
దర్శకుడు విజయేందర్ తన మొదటి సినిమా ‘మిత్ర మండలి’ విడుదల సంబరాలు ఒక విషాదంతో ముగిశాయి. సినిమా రిలీజ్ వేళ, ఆయన క్లోజ్ ఫ్రెండ్, సినిమా యూనిట్‌లో సభ్యుడు ఆకస్మికంగా మరణించారు. ఈ దురదృష్టకర సంఘటన టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
Key Points
దర్శకుడు విజయేందర్‌కి 'మిత్ర మండలి' మొదటి సినిమా.
సినిమా రిలీజ్ సమయంలోనే క్లోజ్ ఫ్రెండ్ ఆకస్మిక మృతి.
మృతుడు సినిమా టీమ్‌తో కలిసి పనిచేశాడు, బన్నీ వాసు ధృవీకరణ.
చిత్ర యూనిట్, దర్శకుడు తీవ్ర విషాదంలో మునిగారు.
విజయేందర్ జీవితంలో విషాదం
Vijayendar : టాలీవుడ్ లో ఓ విషాద సంఘటన నెలకొంది. దర్శకుడి క్లోజ్ ఫ్రెండ్ సినిమా రిలీజ్ సమయానికి చనిపోయారు. ప్రియదర్శి, నిహారిక NM జంటగా తెరకెక్కిన మిత్రమండలి సినిమా నేడు అక్టోబర్ 16న రిలీజ్ కానుంది.(Vijayendar)
ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం పనిచేసిన డైరెక్టర్ క్లోజ్ ఫ్రెండ్ సడెన్ గా పడిపోయాడు. అతన్ని హాస్పిటల్ లో చేర్చి వస్తున్నాము అని తెలిపారు.
మిత్ర మండలి రిలీజ్ & స్నేహితుడి మరణం
బుధవారం రాత్రి మరోసారి ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించగా బన్నీవాసు మాట్లాడుతూ.. మా ఎవ్వరికి పది రోజులుగా సరిగ్గా నిద్ర లేదు. డైరెక్టర్ క్లోజ్ ఫ్రెండ్ మాతో ఈ సినిమాకు పనిచేసాడు. అతను కూడా మాతో నిద్ర లేకుండా ఓ పది రోజుల నుంచి పని చేస్తున్నాడు. మొన్న సడెన్ గా పడిపోయాడు. తీసుకెళ్లి హాస్పిటల్ లో జాయిన్ చేసాము. నిన్న రాత్రి అతను చనిపోయాడు. అందరం ఇంకా ఆ ఎమోషన్ లోనే ఉన్నాము అంటూ తెలిపారు.
బన్నీ వాసు భావోద్వేగ వ్యాఖ్యలు
ఈ సినిమా దర్శకుడు విజయేందర్ కి డైరెక్టర్ గా ఇదే మొదటి సినిమా. దర్శకుడిగా మొదటి సినిమా రిలీజ్ అవుతున్న ఇలాంటి సమయంలో క్లోజ్ ఫ్రెండ్, అది కూడా తనతో పాటు సినిమాకు పనిచేసిన వ్యక్తి మరణించడం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటన ఎవరికీ రాకూడదు పాపం అని విచారం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రారంభంలో అతని ఫోటో షేర్ చేసి అతనికి నివాళులు అర్పించారు మిత్ర మండలి మూవీ టీమ్.
ఒకవైపు మొదటి సినిమా విడుదలతో ఆనందం, మరోవైపు ప్రియ మిత్రుడి మరణంతో విషాదం. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని చిత్ర బృందం, ప్రేక్షకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. విజయేందర్ ఈ దుఃఖం నుండి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.


