
అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విక్రాంత్ మస్సే కుటుంబ స్నేహితుని కుమారుడు మరణించాడు. విక్రాంత్ మస్సే ఈ విషయంపై తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఎమోషనల్ నోట్‌ను పంచుకున్నాడు.
Key Points
విక్రాంత్ మస్సే కుటుంబ స్నేహితుని కుమారుడు విమాన ప్రమాదంలో మృతి.
విక్రాంత్ మస్సే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఎమోషనల్ నోట్ పోస్ట్ చేశాడు.
అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.
ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు మృతి చెందారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం
అహ్మదాబాద్(Ahmedabad) నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా a171 ఫ్లైట్ గురువారం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో ఏకంగా 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్ని క్షణాల్లోనే ఊహించని విధంగా చాలామంది మాంసం ముద్దల్లా పడిపోయారు. అయితే ఇందులో కేవలం ఒకరు మాత్రమే బతికి బయటపడ్డారు. ఈ సంఘటన ఎంతోమందిని కన్నీరు పెట్టిస్తోంది. ఇక ఈ ప్రమాదంపై రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలతో పాటు సాధారణ ప్రజలు తమ సంతాపం తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు.
విక్రాంత్ మస్సే ఎమోషనల్ పోస్ట్
ఎక్కడ చూసినా అహ్మదాబాద్ ఫ్లైట్‌కు సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదంలో బాలీవుడ్ హీరో విక్రాంత్ మస్సే(Vikrant Massey) కజిన్ బ్రదర్ చనిపోయినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. ‘‘అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను తలుచుకుంటే గుండె ముక్కలైపోతుంది. ఈ బాధ నాకంటే నా అంకుల్ క్లిఫార్డ్ కుందర్(Clifford Kunder)కు ఇంకా ఎక్కువగా ఉంటుంది.
కుటుంబ స్నేహితుని కుమారుని మృతి
ఎందుకంటే.. ఈ ప్రమాదంలో ఆయన తన కుమారుడు క్లైవ్ కుందర్‌ను కోల్పోయాడు. తను ఆ విమానానికి ఫస్ట్ ఆఫీసర్ ఆపరేటింగ్‌గా ఉన్నాడు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి ఆ దేవుడు అండగా నిలవాలని కోరుకుంటున్నాను. అలాగే పలు న్యూస్ చానల్స్‌లో రాసిన విధంగా అతను నా కజిన్ కాదు. పైలట్ క్లైవ్ సుందర్ మా కుటుంబ స్నేహితులు. ఈ విషయంలో మరిన్ని ఊహాగానాలకు చోటు ఇవ్వకండి. తప్పుడు వార్తలు రాయకండి’’ అని రాసుకొచ్చాడు.
విక్రాంత్ మస్సే వ్యక్తం చేసిన విషాదం అనేక మందిని కలిచివేసింది. ఈ ఘటనతో సినీ ప్రముఖులు, ప్రజలు కూడా తమ సంతాపం తెలియజేస్తున్నారు.


