|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

త్రిష పేరుతో ఏకంగా విలేజ్‌.. స్టార్‌ హీరోయిన్‌ రియాక్షన్‌ ఇదే, టూ క్రేజీ

Published: 01-06-2025, 11:15 PM
త్రిష పేరుతో ఏకంగా విలేజ్‌.. స్టార్‌ హీరోయిన్‌ రియాక్షన్‌ ఇదే, టూ క్రేజీ

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న త్రిష పేరుతో ఒక గ్రామం ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ‘Vijayak Trisha’ అనే ఆ గ్రామం లడఖ్‌లో ఉంది. త్రిష కూడా ఈ విషయం గురించి స్పందించింది.

Key Points

1

త్రిష పేరుతో ఒక గ్రామం ఉందని అభిమానులు కనుగొన్నారు.

2

లడఖ్‌లోని నూబ్రా లోయలో 'Vijayak Trisha' అనే గ్రామం ఉంది.

4

త్రిష అభిమానులు ఆమె ఆ గ్రామాన్ని సందర్శించాలని కోరుకుంటున్నారు.

త్రిష పేరుతో గ్రామం!

కోలీవుడ్‌, టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది త్రిష. ఆమెకు 42 ఏళ్ళు అయినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంది. ఈ వయస్సులో కూడా యంగ్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. కుర్ర హీరోయిన్లకి అందంలో పోటీ ఇస్తుంది.

అదే సమయంలో తన తోటి హీరోయిన్లలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఇప్పటికీ వరుసగా భారీ ఆఫర్లని అందుకుంటూ దూసుకుపోతుంది. అంతేకాదు అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గానూ నిలిచింది. ఆమె ఒక్కో మూవీకి  రూ.12కోట్ల పారితోషికం అందుకుంటుందని సమాచారం.

‘Vijayak Trisha’ గ్రామం ఎక్కడ ఉంది?

త్రిష ఇటీవల అజిత్‌ `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ` సినిమాలో మెరిసింది. మంచి హిట్‌ని అందుకుంది. త్వరలో `థగ్‌ లైఫ్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.  కమల్‌ హాసన్‌ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 5న విడుదల కాబోతుంది.

అలాగే ఆర్.జె.బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో హీరో సూర్యకి జోడీ కట్టింది త్రిష. అంతేకాకుండా తెలుగులో చిరంజీవితో కలిసి ‘విశ్వంభర’ చిత్రంలోనూ నటిస్తుంది.  మలయాళంలో మోహన్‌లాల్‌తో కలిసి ఓ మూవీ చేస్తుంది. ఇలా తెలుగు, తమిళం, మలయాళంలో భారీ చిత్రాలతో బిజీగా ఉంది త్రిష.

త్రిష రియాక్షన్ ఏమిటి?

ఇదిలా ఉండగా,  హీరోయిన్‌ త్రిష పేరుతో ఒక విలేజ్‌ ఉంది. ఈ విషయాన్ని ఆమె అభిమానులు కనిపెట్టారు.  ఒక అభిమాని ఆ ఊరి పేరు ఉన్న బోర్డు ముందు నిల్చొని వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా, దాన్ని త్రిష కూడా తన ఇన్‌స్టా పేజీలో షేర్ చేసి ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ఆ ఊరి పేరు ‘Vijayak Trisha’. ఆ ఊరు లడఖ్‌లోని నూబ్రా లోయ నుండి ప్రపంచంలోనే ఎత్తైన బేస్ క్యాంప్ అని పిలువబడే సియాచిన్ బేస్ క్యాంప్‌కు వెళ్లే దారిలో ఉందట.

హీరోయిన్ల పేరు మీద ఆలయాలు కట్టడం చూశాం. కానీ మొదటిసారిగా ఒక నటి పేరు మీద ఒక ఊరే ఉండటం ఆశ్చర్యపరుస్తుంది. ఇది చూసి ఫ్యాన్స్ కూడా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు.  కొందరైతే  త్రిష ఆ ఊరికి వెళ్లాలని కోరుతున్నారు.  త్రిష ఆ రీల్స్ వీడియోను లైక్ చేయడంతో ఇప్పుడది వైరల్ అవుతోంది.

త్రిష పేరుతో ఒక గ్రామం ఉండటం నిజంగా ఆశ్చర్యకరం. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. త్రిష భవిష్యత్తు సినిమాలకు అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.