
వినాయక చవితి పర్వదినం సందర్భంగా, వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు వివిధ పరిహారాలు, మంత్రాలు ఉన్నాయి. సింధూరం, తమలపాకులు సమర్పించడం, విశేష మంత్రాలు జపించడం వంటివి జీవితంలో శుభాన్ని ఆహ్వానిస్తాయి.
Key Points
వినాయక చవితి నాడు సింధూరం సమర్పించి అనుగ్రహం పొందండి.
తమలపాకులతో పాటు సున్నం కలిపి తాంబూలం సమర్పించండి.
వినాయకుడి మంత్రాలను పఠించి ఆశీస్సులు పొందండి.
పూజలో తమలపాకులతో పత్రపూజ చేయండి.
వినాయకుడికి సింధూరం, తమలపాకుల సమర్పణ
వినాయక చవితి నాడు వినాయకుడిని భక్తి, శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి, సంతోషంగా ఉండొచ్చు. ఎవరు, ఎప్పుడు ఏ పూజ చేసినా మొట్టమొదట వినాయకుడిని పూజిస్తారు. వినాయకుడిని పూజించడం వలన చేసే పనిలో ఆటంకాలు ఉండవని, విజయాలే ఉంటాయని నమ్ముతారు. అందుకే శుభకార్యానికైనా, ఏ పూజకైనా, ఏ హోమాలు, వ్రతాలకైనా వినాయకుని మొట్టమొదట పూజిస్తారు.
వినాయక చవితి ఆగస్టు 27 బుధవారం నాడు వచ్చింది. ఆ రోజు వినాయకుడిని పూజించడం వలన సంతోషంగా ఉండొచ్చు. విఘ్నాలు తొలగిపోయి విజయాలే ఉంటాయి. అయితే వినాయక చవితి నాడు కొన్ని పరిహారాలని పాటిస్తే కూడా వినాయకుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. మరి వినాయక చవితి నాడు వినాయకుని అనుగ్రహం కలకాలం మనపై ప్రసన్నం కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం.
వినాయకుడికి సింధూరం అంటే ఎంతో ఇష్టం. సింధూరాన్ని వినాయకుడికి సమర్పించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చు. స్త్రీలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి. వినాయక చవితి నాడు సింధూరాన్ని సమర్పించడం వలన జ్ఞానం వృద్ధి చెందుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, అడ్డంకులు తొలగిపోయి జీవితం పై విశ్వాసం కలుగుతుంది.
వినాయక చవితి మంత్రాలు
వినాయకుడికి సింధూరాన్ని సమర్పించేటప్పుడు ముందు పసుపు, గంధం, కుంకుమలతో అలంకరించి ఆ తర్వాత సింధూరాన్ని సమర్పించండి. తర్వాత వినాయకుడికి దీప, ధూప, నైవేద్యాలను సమర్పించి హారతి ఇచ్చి కోరికలను తెలపండి. దీంతో మీరు అనుకున్నవి జరిగిపోతాయి, అదృష్టం కూడా కలిసి వస్తుంది.
తమలపాకులను కూడా సమర్పించండి
వినాయకుడికి తమలపాకులను కూడా సమర్పించండి. వినాయక చవితి నాడు వినాయకుడికి తమలపాకుతో పాటు సున్నం కలిపి తాంబూలంగా ఇవ్వండి. వినాయకుడికి తమలపాకులను సమర్పిస్తే ఆటంకాలు తొలగిపోయి వినాయకుని అనుగ్రహాన్ని పొందవచ్చు. పత్రపూజ చేసేటప్పుడు తమలపాకులను కూడా సమర్పించండి. దీంతో పూజకు సంపూర్ణత వస్తుంది.
పూజా విధానం మరియు ప్రయోజనాలు
వినాయక చవితి నాడు ఈ మంత్రాలను పఠిస్తే మంచిది. ”ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే.. వర వరద సర్వజనమ్ మే వశమానాయ స్వాహా” ఈ మంత్రం పఠిస్తే శాంతి , అదృష్టంతో పాటు విజయాలు కూడా మీ సొంతమవుతాయి.
అదే విధంగా ”ఓం గం గణపతయే సర్వ వరప్రదాయకాయ సర్వేశ్వరాయ సర్వ విఘ్నఛేదాయ సర్వాయ విశ్వకర్మణే నమ:’ ‘ ఈ మంత్రాన్ని పఠించడం వలన జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి విజయాన్ని పొందవచ్చు. మనోబలం పెరుగుతుంది, కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
వినాయక చవితి నాడు ఈ పద్ధతులను పాటించడం ద్వారా వినాయకుని అనుగ్రహాన్ని పొంది, జీవితంలోని అడ్డంకులను తొలగించుకోవచ్చు. భక్తితో కూడిన పూజ జీవితంలో శాంతి, సంతోషం, అదృష్టాన్ని తెస్తుంది.


