|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఈ క్యూట్ పిల్లలు ఎవరో తెలుసా? ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్ హీరోలు! వైరల్ ఫోటోలు!

Published: 23-02-2026, 11:35 AM
షాకింగ్: ఈ క్యూట్ పిల్లలు ఎవరో తెలుసా? ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్ హీరోలు! వైరల్ ఫోటోలు!
  • సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ చిన్నప్పటి ఫోటోలు వైరల్! క్యూట్ లుక్స్ తో అదరగొట్టిన అన్నదమ్ములు.
  • ప్రభాస్ డైరెక్టర్ కొడుకులుగా ఎంట్రీ ఇచ్చిన సంతోష్, సంగీత్.. ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలు!
  • సంగీత్ శోభన్ ‘మ్యాడ్ స్క్వేర్’ తో హిట్, త్వరలో ‘రాకాస’ మూవీతో ప్రేక్షకులను అలరించనున్నాడు.
  • సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు! ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!!

టాలీవుడ్ లో ఒక సంచలనం! హీరో సంతోష్ శోభన్ మరియు సంగీత్ శోభన్ ల చిన్ననాటి ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలలో వారి క్యూట్ లుక్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వారి సక్సెస్ గురించి తెలుసుకోవడానికి ఇదిగో ఇక్కడ!

చిన్ననాటి క్యూట్ ఫోటోలు వైరల్!

Heros : అప్పుడప్పుడు మన సినిమా సెలబ్రిటీలు వాళ్ళ చిన్నప్పటి ఫొటోలు షేర్ చేయడంతో అవి వైరల్ గా మారతాయి. తాజాగా ఓ హీరో తమ చిన్నప్పటి ఫోటో షేర్ చేసాడు. ఈ ఫొటోలు షేర్ చేస్తూ స్పెషల్ పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

ఇంతకీ ఈ ఫొటోలో ఉన్నది ఎవరో అనుకున్నారా? హీరోలు, అన్నదమ్ములు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్. ప్రభాస్ వర్షం సినిమా డైరెక్టర్ శోభన్ కొడుకులు ఈ ఇద్దరూ. చైల్డ్ ఆర్టిస్ట్ గానే పలు సినిమాలు చేసిన సంతోష్, సంగీత్ ఇప్పుడు హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. తమ్ముడు సంగీత్ శోభన్ మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, 3 రోజెస్, ఒక చిన్న ఫ్యామిలీ కథ.. ఇలా వరుసగా సినిమాలు, సిరీస్ లతో హిట్స్ కొడుతున్నాడు. త్వరలోనే రాకాస అనే సినిమాతో రాబోతున్నాడు.

ప్రభాస్ డైరెక్టర్ కొడుకులు హీరోలుగా!

ఇక సంతోష్ గత కొన్నాళ్లుగా ఫ్లాప్స్ లో ఉండగా ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో హిట్ కొట్టాడు. హృదయాన్ని హత్తుకునే ప్రేమకథగా ఈ సినిమా ప్రేక్షకులని థియేటర్స్ లో మెప్పిస్తుంది. చాన్నాళ్ల తర్వాత అన్నయ్య సంతోష్ శోభన్ హిట్ కొట్టడంతో చిన్నప్పుడు దిగిన ఫొటోలు, తమ తల్లితో దిగిన ఫొటోలు షేర్ చేసి స్పెషల్ పోస్ట్ చేసాడు సంగీత్.

సంగీత్, సంతోష్ ల సక్సెస్ స్టోరీ!

ఈ పోస్ట్ లో సంగీత్.. మనలో ప్రతి శుక్రవారం ఎవరికో ఒకరికి రాసిపెట్టి ఉంటుంది. ఈ శుక్రవారం నీది. నీ బట్టలు వేసుకొని ఎపుడూ నీకు సపోర్ట్ గా ఉంటాను. జీవితం చివరి వరకు నీతోనే ఉంటాను అని ఎమోషనల్ గా పోస్ట్ చేసాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. గోల్కొండ హై స్కూల్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులుగా కలిసి మెప్పించిన సంతోష్ – సంగీత్ ఇప్పుడు ఇలా హీరోలుగా దూసుకెళ్తుండటం గ్రేట్ అని అభినందిస్తున్నారు. ప్రభాస్ సపోర్ట్ ఈ ఇద్దరు అన్నదమ్ములకు ఎప్పుడూ ఉంటుంది. ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు స్పెషల్ ఇంటర్వ్యూ కూడా చేసాడు ప్రభాస్.

సంతోష్, సంగీత్ ల చిన్ననాటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారి రాబోయే సినిమాల కోసం ఎదురుచూద్దాం. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.