|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వైరల్ వయ్యారి సాంగ్ కు బామ్మ డ్యాన్స్ వైరల్.. కాలు కదిపిన సుమ.. అదిరే స్టెప్పులు.. ఎవరీ సీనియర్ నటి?

Published: 17-07-2025, 2:44 AM
వైరల్ వయ్యారి సాంగ్ కు బామ్మ డ్యాన్స్ వైరల్.. కాలు కదిపిన సుమ.. అదిరే స్టెప్పులు.. ఎవరీ సీనియర్ నటి?

జూనియర్ సినిమాలోని ‘వైరల్ వయ్యారి’ సాంగ్ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ కు ఓ బామ్మ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ బామ్మ ఎవరో తెలుసుకుందాం.

Key Points

1

వైరల్ వయ్యారి సాంగ్ కు సీనియర్ నటి మణి అదిరిపోయే డ్యాన్స్!

2

యాంకర్ సుమ కూడా డ్యాన్స్ చేసింది!

4

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

వైరల్ డ్యాన్స్ వీడియో

వైరల్ వయ్యారి.. ఇప్పుడు చిన్నవాళ్ల నుంచి ముసలి వాళ్ల వరకూ అందరితో డ్యాన్స్ చేయిస్తున్న పాపులర్ సాంగ్ ఇది. జూనియర్ మూవీలోని ఈ సాంగ్ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. యూట్యూబ్, సోషల్ మీడియా ఇలా ఎక్కడైనా ఈ సాంగ్ రీల్స్, షార్ట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడీ వైరల్ సాంగ్ కు ఓ బామ్మ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

పారిశ్రామికవేత్త, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. జూనియర్ సినిమాతో తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ మూవీ జూలై 18న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం (జూలై 16) హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ ప్రారంభంలోనే బామ్మ వైరల్ డ్యాన్స్ చేసింది.

సుమ కూడా డ్యాన్స్ చేసింది

జూనియర్ ప్రి రిలీజ్ ఈవెంట్లో బామ్మ చేసిన డ్యాన్స్ వైరల్ గా మారింది. యాంకర్ సుమ పిలవగానే కుర్చీలో నుంచి లేచి వచ్చిన బామ్మ.. ‘‘ వైరల్ వయ్యారి నేనే.. వయసొచ్చిన అణుబాంబును’’ అంటూ తెగ హుషారుగా స్టెప్పులు వేసింది. శ్రీలీల ఎనర్జీని మ్యాచ్ చేసేంతగా ఈ బామ్మ డ్యాన్స్ ఉండటం నెటిజన్లతో వావ్ అనిపిస్తోంది. ఆ బామ్మ పేరు మణి. తెలుగు సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్లు చేశారు ఆమె. సీనియర్ ఆర్టిస్ట్ గా నటనతో అలరించే ఆవిడలో ఇలాంటి యాంగిల్ ఉందని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు.

సీనియర్ నటి మణి డ్యాన్స్ చూసి యాంకర్ సుమకు కూడా ఊపొచ్చింది. వెంటనే మైక్ పక్కనపెట్టేసి వైరల్ వయ్యారికి సుమ కూడా డ్యాన్స్ చేసింది. ఈ డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. స్టేజీ దద్దరిల్లిపోయింది. బామ్మ ఎనర్జీ వేరే లెవల్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

జూనియర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్

కిరీటీ ఫస్ట్ సినిమా జూనియర్. దీనికి ‘మాయా బజార్’ ఫేమ్ రాధాకృష్ణ రెడ్డి డైరెక్టర్. తెలుగుతో పాటు కన్నడలో ఈ సినిమాను తెరకెక్కించారు. యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. వైరల్ వయ్యారి సాంగ్ లో శ్రీలీల డ్యాన్స్ స్టెప్పులు అదిరిపోయాయి. ఈ సినిమాతో 13 ఏళ్ల తర్వాత జెనీలియా తెలుగు అభిమానులను పలకరించనుంది.

చివరగా, సీనియర్ నటి మణి యొక్క అద్భుతమైన నృత్య ప్రదర్శన సోషల్ మీడియాలో అలరించింది. సుమ కూడా ఆమెకు తోడుగా నృత్యం చేసింది. జూనియర్ సినిమా ప్రమోషన్లకు ఇది మరింత వేడిని చేర్చింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.