
డ్యాన్స్‌కు పేరుగాంచిన శ్రీలీల, ‘జూనియర్’ సినిమాలోని తన పాత్ర, సహనటుల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ‘వైరల్ వయ్యారి’ సాంగ్ యొక్క విజయానికి కారణాలను కూడా ఆమె వివరించింది.
Key Points
శ్రీలీల 'జూనియర్' సినిమాలో నటనకు ప్రశంసలు
'వైరల్ వయ్యారి' సాంగ్ వైరల్ కావడానికి కారణం దేవీశ్రీ ప్రసాద్ సంగీతం
కిరీటి రెడ్డి డ్యాన్స్‌లో వెపన్‌గా శ్రీలీల అభిప్రాయం
జూలై 18న 'జూనియర్' సినిమా విడుదల
‘జూనియర్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
డ్యాన్సింగ్ క్వీన్‌గా తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకుంది ముద్దుగుమ్మ శ్రీలీల. వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది ఈ బ్యూటిపుల్ హీరోయిన్. శ్రీలీల నటించిన లేటెస్ట్ మూవీ జూనియర్. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సినిమా ఈ జూనియర్.
సీనియర్ హీరోయిన్ జెనీలియా ఇందులో కీలక పాత్ర పోషించింది. జూనియర్ సినిమాకు రాధ కృష్ణ దర్శకత్వం వహించారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి జూనియర్ సినిమాను నిర్మించారు. అయితే, జూనియర్ మూవీ సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా వైరల్ వయ్యారి అనే పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిపోయింది.
శ్రీలీల కామెంట్స్: కిరీటి, దేవీశ్రీ ప్రసాద్ పై
జూనియర్ టీజర్, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూనియర్ సినిమా జూలై 18న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బెంగళూరులో జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరైన జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ సినిమా జర్నీ చాలా వండర్‌ఫుల్‌గా జరిగింది. రాధాకృష్ణ గారు చాలా క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్. ఈ కథని చాలా అద్భుతంగా చెప్పారు. రవిచంద్రన్ గారితో కలిసి వర్క్ చేయడం చాలా గొప్ప ఎక్స్‌పీరియన్స్” అని చెప్పింది.
‘వైరల్ వయ్యారి’ పాట విజయం
“జెనీలియా గారితో కలిసి పని చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి స్ట్రాంగ్ పిల్లర్ నిర్మాత సాయి గారు. చాలా ప్రేమతో ఈ సినిమా చేశారు. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. శివన్న గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది” అని శ్రీలీల తెలిపింది.
“కిరీటితో వర్క్ చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. డాన్స్ పెర్ఫార్మెన్స్‌లో ఒక వెపన్‌గా అనిపించారు. వైరల్ వయ్యారి సాంగ్ వైరల్ కావడానికి కారణం దేవీశ్రీ ప్రసాద్ గారు. ఆయన ఈ సినిమాకి అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. జూలై 18న ఈ సినిమా వస్తుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను” అని శ్రీలీల తన స్పీచ్ ముగించింది.
చివరగా, శ్రీలీల తన అభిప్రాయాలను పంచుకుంటూ, ‘జూనియర్’ సినిమా అందరినీ అలరించబోతోందని ఆశాభావం వ్యక్తం చేసింది. సినిమా విజయవంతం కావాలని ఆమె కోరుకుంది.


