
📌 Key Points
- విశాఖపట్నం – చర్లపల్లి మధ్య రైలు ఇక రెగ్యులర్ సర్వీసుగా అందుబాటులోకి రానుంది.
- ప్రతి శుక్రవారం విశాఖ నుంచి, శనివారం చర్లపల్లి నుంచి రైలు బయలుదేరుతుంది.
- రైలు నెంబర్ 18527 విశాఖలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుతుంది.
- ఈ రైలులో 2ఏ, 3ఏ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ మరియు దివ్యాంగుల కోచ్‌లు కలవు.
తెలుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. విశాఖపట్నం మరియు చర్లపల్లి మధ్య నడిచే రైలును రెగ్యులర్ సర్వీసుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
రెగ్యులర్ రైలుగా విశాఖ-చర్లపల్లి రైలు
తెలుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం – చర్లపల్లి(హైదరాబాద్) మధ్య నడిచే ((18527/18528) రైలును రెగ్యూలర్ ట్రైన్ గా మార్పు చేశారు. ఈ మేరకు ప్రకటన జారీ అయింది.
ప్రతి శుక్రవారం విశాఖపట్నం నుంచి చర్లపల్లి (హైదరాబాద్), ప్రతి శనివారం చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి వెళ్లే ఈ రైలు… ఇక రెగ్యులర్ గా మార్పు కానుంది. ఇందుకు రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రైలు వేళలు మరియు సమయాలు
విశాఖపట్నం- చర్లపల్లి (18527) ట్రైన్…. ప్రతి శుక్రవారం విశాఖలో సాయంత్రం 05.30 గంటలకు బయలుదేరుతుంది. ఈ ట్రైన్…. మరుసటిరోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
ఈ ట్రైన్ తిరుగు ప్రయాణంలో (ట్రైన్ నెంబర్ 18528) ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రతి శనివారం చర్లపల్లిలో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 5.20 గంటలకు విశాఖపట్నంకు చేరుకుంటుంది.
రైలులో అందుబాటులో ఉన్న కోచ్‌లు
ఈ రైళ్లలో 2ఏ, 3ఏ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ మరియు దివ్యాంగుల కోచ్‌లు ఉంటాయి.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
విశాఖపట్నం, చర్లపల్లి మధ్య నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు మరింత సౌకర్యం చేకూరుస్తుంది.


