|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విశాల్, అంజలి కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇంట్రెస్టింగ్‌గా మకుటం టీజర్.. సముద్ర మాఫియా నేపథ్యంలో!

Published: 25-08-2025, 6:44 AM
విశాల్, అంజలి కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇంట్రెస్టింగ్‌గా మకుటం టీజర్.. సముద్ర మాఫియా నేపథ్యంలో!

వెర్సటైల్ హీరో విశాల్ నటించిన 35వ చిత్రం ‘మకుటం’ టైటిల్ టీజర్ విడుదలైంది. అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం సముద్ర మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోంది. టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.

Key Points

1

విశాల్ 35వ చిత్రం 'మకుటం' టైటిల్ టీజర్ విడుదల

2

సముద్ర మాఫియా నేపథ్యంలో సాగే కథ

4

జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, రిచర్డ్ ఎం. నాథన్ సినిమాటోగ్రఫీ

‘మకుటం’ టైటిల్ టీజర్ విడుదల

వెర్సటైల్ హీరో, పురుట్చి దళపతి విశాల్ ప్రస్తుతం 35వ ప్రాజెక్ట్‌తో చాలా బిజీగా ఉన్నాడు. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. తెలుగు అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్‌బి చౌదరి 99వ చిత్రంగా విశాల్ 35వ సినిమా రానుంది.

ఈ విశాల్ 35 ప్రాజెక్ట్ మూవీకి రవి అరసు దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇంత వరకు విశాల్ 35 అంటూ ఈ ప్రాజెక్ట్‌కు వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇక కాసేపటి క్రితమే ఈ ప్రాజెక్ట్ టైటిల్‌ను రివీల్ చేస్తూ టీజర్‌ను విడుదల చేశారు.

విశాల్ కొత్త సినిమాకు ‘మకుటం’ అనే టైటిల్‌ను పెట్టారు. మకుటం సినిమాలో విశాల్ , అంజలి, దుషార విజయన్ హీరో హీరోయన్లుగా నటిస్తున్నారు. ఈ మేరకు వదిలిన మకుట టీజర్‌ను గమనిస్తే.. ఇది సముద్రం నేపథ్యంలో నడిచే ఓ మాఫియా కథ అని అర్థం అవుతోంది.

సముద్ర మాఫియా నేపథ్యం

సముద్రం లోపలి జీవరాశుల్ని చూపిస్తూ.. చివరగా విశాల్‌ను బ్యాక్ సైడ్ నుంచి చూపించారు. ‘మకుటం’ చిత్రంలో విశాల్‌ను సరికొత్తగా చూపించబోతోన్నారని అర్థం అవుతోంది. వైట్ సూట్‌లో షిఫ్‌లో బ్యాక్ సైడ్ నుంచి విశాల్‌ను చూపించారు. విశాల్ హెయిల్ స్టైల్ కొత్తగా ఉంది. లాంగ్ హెయిర్‌తో విశాల్‌ను చూపించారు.

సముద్ర నేపథ్యంలో మాఫియా, షిఫ్పింగ్, ట్రాన్స్‌పోర్ట్ వంటి అంశాలు ఉండనున్నాయి. ‘మకుటం’ టైటిల్ టీజర్‌లో జీవీ ప్రకాష్ కుమార్ అందించిన ఆర్ఆర్ అద్భుతంగా ఉంది. ఈ మూవీకి ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మకుటం సినిమాకు సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు.

నటీనటుల వివరాలు

అలాగే, మకుటం సినిమాలో విశాల్, దుషార విజయన్, అంజలి తోపాటు తంబి రామయ్య, అర్జై తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకే మకుటం సినిమాలో అంజలి నటిస్తున్నట్లు అనౌన్స్‌మెంట్ చేశారు. మద గద రాజు సినిమా తర్వాత విశాల్‌తో అంజలి నటిస్తున్న సినిమా ఇది.

విశాల్, అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన మద గద రాజు మంచి హిట్ అందుకుంది. మరి మకుటంలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ ప్లేసును దుషార విజయన్ భర్తీ చేశారు. మరోసారి విశాల్, అంజలి నటిస్తున్న మకుటం ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

మొత్తంగా ‘మకుటం’ సినిమా టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సముద్ర మాఫియా నేపథ్యం, విశాల్ కొత్త లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని భావిస్తున్నారు. చిత్రం విడుదలకు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.