|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vishal’s health Update : స్టేజీపైనే కుప్పకూలన హీరో విశాల్.. ఆయన ఆరోగ్యంపై మేనేజర్ క్లారిటీ

Published: 12-05-2025, 9:31 AM
Vishal's health Update : స్టేజీపైనే కుప్పకూలన హీరో విశాల్.. ఆయన ఆరోగ్యంపై మేనేజర్ క్లారిటీ

తమిళ సూపర్ స్టార్ విశాల్ ఒక కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో వేదికపై కుప్పకూలారు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై విశాల్ మేనేజర్ వివరణ ఇచ్చారు.

Key Points

1

వేదికపై విశాల్ కుప్పకూలి ఆసుపత్రిలో చేరారు.

2

మధ్యాహ్న భోజనం తీసుకోకపోవడం వల్ల అస్వస్థతకు గురయ్యారని మేనేజర్ తెలిపారు.

4

క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవాలని డాక్టర్ల సూచన.

వేదికపై అకస్మాత్తుగా కుప్పకూలిన విశాల్

తమిళ స్టార్ హీరో విశాల్ (Vishal) రీసెంట్‌గా ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం తెలిసిందే. తమిళనాడు (Tamil Nadu) విల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అప్పటి వరకు బాగానే ఉన్న ఆయన.. వేదికపై ఉండగా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. అయితే.. అక్కడ ఉన్న వారు, ఆయన అనుచరులు వెంటనే అలెర్ట్ అయ్యి హీరో విశాల్‌ను ఆసుప్రతికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్‌గా మారడంతో.. విశాల్ ఫ్యాన్స్ షాక్‌కు గురవ్వడంతోపాటు పాటు ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఈ వార్తపై విశాల్ మేనేజర్ స్పందించి క్లారిటీ ఇచ్చినట్లు తమిళ మీడియా (Tamil Media) నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు.. విశాల్ మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడం వల్లే ఆయన అస్వస్థతకు గురయ్యారని క్లారిటి ఇచ్చారు మేనేజర్. వెంటనే ఆసుప్రతికి తరలించగా వైద్యులు చికిత్స అందిచినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. టైమ్ టూ టైమ్ ఫుడ్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినట్లు మేనేజన్ చెప్పుకొచ్చారు. మొత్తానికి విశాల్ ఆరోగ్యం బాగానే ఉందని మేనేజర్ చెప్పడంతో.. విశాల్ ఫ్యాన్స్ ఊరిపి పీల్చుకుంటున్నారు.

ఆసుపత్రిలో చికిత్స, ఆరోగ్య పరిస్థితి

మేనేజర్ నుండి క్లారిటీ

విశాల్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని మేనేజర్ తెలిపారు. డాక్టర్ల సూచనలను పాటిస్తూ, ఆయన త్వరగా కోలుకుంటారని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.