|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విశాల్ మాస్ ట్రీట్: తమన్నాతో ‘మొగుడు’ మూవీ.. గ్లింప్స్‌తో రికార్డులు షురూ! 🔥

Published: 21-01-2026, 9:35 AM
విశాల్ మాస్ ట్రీట్: తమన్నాతో 'మొగుడు' మూవీ.. గ్లింప్స్‌తో రికార్డులు షురూ! 🔥
  • విశాల్, తమన్నా జోడీగా వస్తున్న ‘మొగుడు’ మూవీ.. గ్లింప్స్‌తోనే భారీ అంచనాలు!
  • సుందర్ C దర్శకత్వంలో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘మొగుడు’ చిత్రం!
  • తమన్నా భార్యగా, విశాల్ ఇంటి పనులు చేసే భర్తగా.. సరికొత్త కాన్సెప్ట్!
  • యోగిబాబు కామెడీ టైమింగ్‌తో ‘మొగుడు’ మూవీలో నవ్వులు పూయిస్తున్నాడు!

విశాల్ మరోసారి తన మార్క్ చూపించడానికి సిద్ధమయ్యారు. తమన్నా భాటియాతో కలిసి ‘మొగుడు’ అనే సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా గ్లింప్స్ విడుదల కావడంతోనే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

విశాల్, తమన్నా కాంబోలో కామెడీ ట్రీట్!

Vishal : తమిళ్ తో పాటలు తెలుగులో కూడా అదే రేంజ్ మార్కెట్ ఉన్న హీరోల్లో విశాల్ ఒకరు. విశాల్ ఇటీవల మార్క్ ఆంటోని, మదగజరాజ సినిమాలతో హిట్స్ కొట్టాడు. ప్రస్తుతం విశాల్ మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా విశాల్ 36వ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ ఆసక్తికర గ్లింప్స్ రిలీజ్ చేసారు.(Vishal)

‘మొగుడు’ గ్లింప్స్‌తో అంచనాలు పెంచేసిన విశాల్!

విశాల్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా యోగిబాబు కీలక పాత్రలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సుందర్ C దర్శకత్వంలో అరుణ్ కుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో టైటిల్ ‘మొగుడు’ అంటూ గ్లింప్స్ రిలీజ్ చేసారు.

సుందర్ C దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్!

ఈ గ్లింప్స్ లో.. తమన్నా భర్తకు ఆర్డర్స్ వేసే భార్యగా, విశాల్ ఇంట్లో పనులు చేసే మొగుడుగా, సీక్రెట్ గా యాక్షన్స్ చేసే హీరోగా, మధ్యలో యోగిబాబు కామెడీ చేస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమా కామెడీ యాక్షన్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మీరు కూడా విశాల్ కొత్త సినిమా మొగుడు గ్లింప్స్ చూసేయండి..

విశాల్, తమన్నా జోడీగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కామెడీ, యాక్షన్ కలగలిపిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.