|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vishnu Manchu: వరుస ఫ్లాప్స్‌.. ఏ డైరెక్టర్‌ నాతో పని చేయరని తెలుసు

Published: 30-06-2025, 6:53 AM
Vishnu Manchu: వరుస ఫ్లాప్స్‌.. ఏ డైరెక్టర్‌ నాతో పని చేయరని తెలుసు

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు తన వరుస సినిమా ఫ్లాప్స్ గురించి, తన తాజా చిత్రం ‘కన్నప్ప’ షూటింగ్ అనుభవాల గురించి, మరియు తెలుగు డైరెక్టర్లతో పనిచేయడంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Key Points

1

మంచు విష్ణు వరుస ఫ్లాప్స్ తో బాధపడుతున్నారు.

2

కన్నప్ప సినిమాపై ట్రోలింగ్ గురించి విష్ణు స్పందించారు.

4

కన్నప్ప సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ ని దర్శకుడిగా ఎంచుకోవడానికి కారణాలను విష్ణు వివరించారు.

కన్నప్ప సినిమాపై విష్ణు అభిప్రాయాలు

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు ( Vishnu Manchu) కు హిట్టు పడి చాలా ఏళ్లే అయింది. ఆయన చివరగా జిన్నా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. ఈసారి రొటీన్‌ సినిమాలు కాదని తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్పను పట్టాలెక్కించాడు. దీనికోసం ఎంతో అధ్యయనం చేసిన తర్వాతే కన్నప్ప షూటింగ్‌ మొదలుపెట్టాడు. మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌, శరత్‌ కుమార్‌ వంటి బడా తారలు కీలక పాత్రలు పోషించారు.

కన్నప్పపై ట్రోలింగ్‌ మహాభారత్‌, రామాయణ్‌ సీరియల్స్‌ తెరకెక్కించిన హిందీ దర్శకుడు ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ ( Mukesh Kumar Singh ) ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశాడు. జూన్‌ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ లభిస్తోంది. దీంతో సినిమా సక్సెస్‌ మీట్‌ కూడా నిర్వహించారు. ఈ వేడుకలో విష్ణు.. కన్నప్పపై జరిగిన ట్రోలింగ్‌ గురించి మాట్లాడాడు. కన్నప్ప సినిమా టీజర్‌ రిలీజైనప్పుడు ఉత్తి పుణ్యానికే నెగెటివిటీ ప్రచారం చేశారు. యూట్యూబ్‌లో నాన్నగారి గురించి, నా గురించి ఏమీ లేకపోయినా నెగెటివ్‌ థంబ్‌నైల్స్‌ పెడితే వారికి ఎక్కువ క్లిక్స్‌ వస్తున్నాయి, ఆదాయం వస్తోంది.

వరుస ఫ్లాప్స్‌కు కారణాలు

వీఎఫ్‌ఎక్స్‌ గుర్తించలేకపోయారు అది ఎంత పెద్ద తప్పని వారు రియలైజ్‌ అవట్లేదు. లొకేషన్స్‌ బాలేవు, గ్రాఫిక్స్‌ బాగోలేవు అని నానామాటలు అన్నారు. చాలామందికి తెలియని విషయమేంటంటే నేను రిలీజ్‌ చేసిన మొదటి టీజర్‌లో చాలా తక్కువ వీఎఫ్‌ఎక్స్‌ ఉన్నాయి. రెండో టీజర్‌లో మాత్రం 70% వీఎఫ్‌ఎక్స్‌ ఉన్నాయి. అదెవరూ గుర్తించలేకపోయారు. మోహన్‌లాల్‌గారి ఎపిసోడ్‌లో ఆ బాణాలు తప్ప అన్నీ ఒరిజినలే! రియల్‌ లొకేషన్‌లో షూట్‌ చేశాం అన్నాడు.

నాతో ఎవరూ చేయరు తెలుగులో లెజెండరీ డైరెక్టర్స్‌ ఉన్నా, హిందీలో ముకేశ్‌ కుమార్‌నే ఎందుకు నమ్మారు? ఆయనకే ఎందుకు డైరెక్షన్‌ బాధ్యతలు ఇచ్చారన్న ప్రశ్న ఎదురైంది. అందుకు విష్ణు స్పందిస్తూ.. నాతో తెలుగులో ఏ డైరెక్టర్‌ పని చేయరని నాకు తెలుసు. కన్నప్ప స్క్రిప్ట్‌ తీసుకెళ్తే ఎవరూ నాతో చేయరని అందరికీ తెలుసు. పైగా దీనికంటే ముందు నేను చేసిన రెండు,మూడు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. అందువల్ల ఇక్కడ ఎవరూ చేయరు. మహాభారతాన్ని (సీరియల్‌) అంత గొప్పగా తీసిన ముకేశ్‌ కన్నప్పను అంతే అద్భుతంగా తెరపై చూపించగలరని నమ్మాను అని చెప్పాడు. ముకేశ్‌ కుమార్‌ సింగ్‌కు దర్శకుడిగా ఇదే తొలి సినిమా కావడం విశేషం!

తెలుగు డైరెక్టర్లతో సహకారం

చివరగా, విష్ణు తన వరుస ఫ్లాప్స్ మరియు భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కన్నప్ప సినిమా విజయంపై ఆయన ఆశలు పెట్టుకున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.