|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విష్ణుప్రియ హాట్ ట్రీట్: సబ్‌స్క్రిప్షన్‌తో రికార్డు కలెక్షన్లు! షాకింగ్‌గా ఉందేంటి?

Published: 15-04-2026, 10:35 PM
విష్ణుప్రియ హాట్ ట్రీట్: సబ్‌స్క్రిప్షన్‌తో రికార్డు కలెక్షన్లు! షాకింగ్‌గా ఉందేంటి?
  • విష్ణుప్రియ హాట్ ఫోటోలకు సబ్‌స్క్రిప్షన్.. నెలకు రూ.390!
  • విష్ణుప్రియ బోల్డ్ కంటెంట్‌తో యూత్‌కు పిచ్చెక్కిస్తోంది!
  • సబ్‌స్క్రైబర్లు డబుల్.. మూడు వేల నుండి ఆరు వేలకు చేరిక!
  • విష్ణుప్రియ సంపాదన @ ఇరవై లక్షల వరకు!

విష్ణుప్రియ సంచలన నిర్ణయంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఆమె బోల్డ్ ఫోటోలు, వీడియోల సబ్‌స్క్రిప్షన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై వస్తున్న విమర్శలు, వివాదాలు ఆమెకు మరింత పాపులారిటీని తెచ్చిపెడుతున్నాయా?

విష్ణుప్రియ సబ్‌స్క్రిప్షన్.. దుమారం రేపుతున్న ఫోటోలు!

విష్ణు ప్రియ ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆమె తన ఫోటోలు, వీడియోలు చూడ్డానికి సబ్‌ స్క్రిప్షన్‌ పెట్టుకోవడమే అందుకు కారణం. మగాళ్ల వీక్‌నెస్‌ని క్యాష్‌ చేసుకుంటూ ఆమె డబ్బులు సంపాదిస్తుందని చెప్పి అంతా ఆమెపై విమర్శలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. ఏకంగా కేసు కూడా పెట్టారు.

ఈ సబ్‌ స్క్రిప్షన్ పేరుతో ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు, వీడియోలను చూపిస్తోంది విష్ణు ప్రియ. అయితే ఈ ఫోటోలు, వీడియోలు చాలా బోల్డ్ గా ఉంటున్నాయి. ఇక వాటిని చూసి ఆకర్షితులవుతున్న యూత్‌ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. అయితే ఇటీవల ఆమెపై కేసు నమోదు కావడంతో, విష్ణు ప్రియ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. బాగా ట్రోలింగ్‌ నడుస్తోంది. దీంతో ఇది వివాదంగా మారింది. అయితే ఈ వివాదం ఇప్పుడు విష్ణుప్రియకు ప్లస్‌ అవుతుంది.  దెబ్బకి సబ్‌ స్క్రైబర్లు రెట్టింపు అయ్యారు. మూడు వేల మంది ఉండగా, ఇప్పుడు ఆరు వేల మందికిపైగా అయ్యారు.  సుమారు ఇప్పటికే ఇరవై లక్షల వరకు సంపాదించినట్టు తెలుస్తోంది.

అయితే విష్ణు ప్రియ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలు, వీడియో కంటెంట్‌ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె టూ బోల్డ్ కంటెంట్‌ ని పోస్ట్ చేస్తుంది. గ్లామర్‌ డోస్‌ పెంచింది. ఆల్మోస్ట్ అర్థనగ్నంగా కనిపిస్తోంది. ఆమెని ఇలా చూశాక కొందరు నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. విష్ణు ప్రియ ఇలా చేయడంలో తప్పేం లేదంటున్నారు. ఎక్స్ క్లూజివ్‌గా ఇలాంటి కంటెంట్‌ ని అందిస్తుండటంతో వారంతా పండగ చేసుకుంటున్నారు. ఇవి చూసి నెలకు రూ.390 పెట్టడంలో తప్పేం లేదంటున్నారు.

డబుల్ అయిన సబ్‌స్క్రైబర్లు.. కారణం అదేనా?

అయితే చాలా మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇలాంటి సబ్‌ స్క్రిప్షన్‌ పేరుతో చాలానే సంపాదిస్తున్నారు. సైలెంట్‌గా తమ పని తాము చేసుకుంటున్నారు. కానీ  వారి విషయం వివాదం కాలేదు, చర్చ జరగలేదు. కానీ విష్ణుప్రియ విషయంలో ఇంత వివాదం నడవటమే ఆశ్చర్యపరుస్తోంది. అయితే విష్ణు ప్రియ సెలబ్రిటీ కావడం, టీవీ షోస్‌లో మెరుస్తుండటంతో అందరి చూపు ఆమెపైనే ఉంటుంది. దీంతో ఇంత పెద్ద స్థాయిలో వివాదం అయ్యిందని చెప్పొచ్చు.

ఇక విష్ణు ప్రియ `పోరాపోవే` అనే ఈటీవీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె ఈ షో చేసి మెప్పించింది. ఆ తర్వాత ఒక్కో షోలో మెరుస్తూ ఆకట్టుకుంది. బిగ్‌ బాస్‌ షోలోనూ పాల్గొని సందడి చేసింది. ఇది ఆమెకి విశేషమైన పాపులారిటీని తెచ్చిందని చెప్పొచ్చు.

విమర్శలు, ట్రోల్స్.. విష్ణుప్రియకు కలిసొచ్చేనా?

విష్ణు ప్రియ పలు సినిమాల్లోనూ మెరిసింది. ఆమె ఒకప్పుడు `యమదొంగ`లో చిన్న పాత్రలో కనిపించింది. ఆ మధ్య రాఘవేంద్రరావు రూపొందించిన `వాంటెడ్‌ పండుగాడ్‌`లో ముఖ్య పాత్ర పోషించింది. అలాగే `దయా` అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది. అయితే సినిమాల్లో ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ టీవీనే ఆమెని స్టార్‌ని చేసిందని చెప్పొచ్చు.

ఇక ప్రస్తుతం సుడిగాలి సుధీర్‌తో కలిసి `సర్కార్‌` షోలో మెరుస్తోంది. ఇప్పుడు ఆరో సీజన్‌ రన్‌ అవుతుంది. `ఆహా`లో స్ట్రీమింగ్‌ అయ్యే ఈ షోలో సుధీర్‌, విష్ణు ప్రియ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. సుధీర్, రష్మి కంటే.. విష్ణుప్రియతో సుధీర్‌ కెమిస్ట్రీనే బాగా వర్కౌట్‌ కావడం విశేషం.

విష్ణుప్రియ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె తదుపరి అడుగులేమిటో వేచి చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.