
📌 Key Points
- విష్ణుప్రియ హాట్ కామెంట్స్: నా అందం నా తప్పా? చూపు మీదే ఉంటుంది!
- ఇన్‌స్టాగ్రామ్‌లో విష్ణుప్రియ ఫాలోయింగ్.. నెలకి రూ.11 లక్షల ఆదాయం!
- బెట్టింగ్ యాప్ కేసు తర్వాత.. విష్ణుప్రియ గ్లామర్ షోతో దుమారం!
- దేవతలా చూడాలి.. తప్పుడు ఉద్దేశంతో చూస్తే కర్మ వదలదు: విష్ణుప్రియ
యాంకర్ విష్ణుప్రియ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. తన అందంపై వస్తున్న విమర్శలకు ఆమె ఘాటుగా స్పందించారు. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విష్ణుప్రియ హాట్ కామెంట్స్ వైరల్!
తెలుగు బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియకు పరిచయం అవసరం లేదు. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ‘ పోవే పోరా’ వంటి షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం సర్కార్, ఆట వంటి షోలు చేస్తోంది. కాగా.. గత కొద్ది రోజులుగా విష్ణుప్రియకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. తన గ్లామర్ ని అస్త్రంగా మార్చుకొని.. డబ్బులు సంపాదిస్తోందంటూ వార్తలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆమెకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ వీడయో వైరల్ గా మారింది. అందులో.. విష్ణు ఏం మాట్లాడిందంటే…
‘ ఇన్ స్టా గ్రామ్ లో ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటం వల్లే నాకు మానిటైజేషన్ అయ్యి డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. దానికి నేను ఎప్పుడూ థ్యాంక్ ఫుల్ గానే ఉంటాను’ అని విష్ణుప్రియ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక.. సోషల్ మీడియాలో మీ ఫోటోలపై వచ్చే కామెంట్స్, మీమ్స్ పై మీరు ఎలా స్పందిస్తారు అని యాంకర్ అడగగా‘ పాజిటివ్ ఎవరైనా కామెంట్ కానీ, మీమ్ గానీ పెడితే.. వెంటనే లైక్ చేస్తాను. లేదు… ఎవరైనా నెగిటివ్ గా పెడితే వెంటనే రిపోర్ట్ కొట్టేస్తాను. కానీ, కొన్నిసార్లు ఇలాంటి కామెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని మనం కంట్రోల్ చేయలేం… అప్పుడు నేను ఒకటే అనుకుంటాను… ఇంత హాట్ గా పుట్టడం నా తప్పా? దేవుడు నాకు ఇంత హాట్ నెస్ ఇవ్వడం తప్పా? అయినా చూసే చూపులోనే ఉంటుంది. అమ్మాయిలను దేవతలాగా చూడాలి.. తప్పుడు ఉద్దేశంతో చూస్తే…. వాళ్లను కర్మ వదిలిపెట్టదు..’ అని విష్ణు ప్రియ చెప్పడం విశేషం.
నెలకు రూ.11 లక్షలు సంపాదన నిజమేనా?
ఇదిలా ఉండగా… విష్ణుప్రియ తన ఎక్స్ క్లూజివ్ ఫోటోల కోసం ఇన్ స్టాగ్రామ్ సబ్ స్క్రిష్షన్ ఫీచర్ వాడుకుంటోంది. అంటే.. ఆమె బోల్డ్ ఫోటోలు చూడాలంటే ఫాలోవర్లు కొంత మొత్తం చెల్లించి సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆమె ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ని 3000 వేల మందికి పైగా సబ్ స్క్రైబ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఆమె నెలకు దాదాపు రూ.11లక్షల వరకు సంపాదిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి.
గ్లామర్ షోపై నెటిజన్ల రియాక్షన్!
గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో కేసు నమోదు కావడం, ఇప్పుడు ఈ స్థాయిలో స్కిన్ షో చేయడంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె బోల్డ్‌నెస్ ని మెచ్చుకుంటుంటే, మరికొందరు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
విష్ణుప్రియ కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆమె వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


