|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’: ఫస్ట్ రివ్యూ వచ్చేసింది! టాక్ ఏంటంటే.. మామూలు హైప్ లేదుగా!!

Published: 26-02-2026, 12:35 AM
శ్రీవిష్ణు 'విష్ణు విన్యాసం': ఫస్ట్ రివ్యూ వచ్చేసింది! టాక్ ఏంటంటే.. మామూలు హైప్ లేదుగా!!
  • శ్రీవిష్ణు లెక్చరర్ పాత్రలో అదరగొట్టాడని టాక్, కామెడీ టైమింగ్ సూపర్ అంట!
  • హీరోయిన్ నయన సారికతో లవ్ ట్రాక్.. సినిమాలో మేజర్ హైలైట్ అట!
  • ఫస్టాఫ్ మొత్తం ఫన్ రైడ్, సెకండాఫ్ లో కామెడీ సీన్స్ అదిరిపోయాయట.
  • క్లైమాక్స్ లో వచ్చే సందేశం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుందట!

యంగ్ హీరో శ్రీవిష్ణు మరోసారి తన మార్క్ చూపించడానికి సిద్ధమయ్యారు. ‘విష్ణు విన్యాసం’ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. సినిమా ఫస్ట్ రివ్యూ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

ఫస్ట్ రివ్యూ: శ్రీవిష్ణు విన్యాసం ఎలా ఉందంటే?

యంగ్‌ హీరో శ్రీవిష్ణు సైలెంట్‌గా సినిమాలు చేస్తూ, హిట్లు కొట్టుకుపోతున్నారు. మంచి ఫన్‌, హ్యూమర్‌ ఉన్న చిత్రాలను ఎంచుకుని, వాటిలో చిన్న సందేశాన్ని జోడించి, అది కూడా చెప్పీ చెప్పనట్టుగా చెప్పేసి ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. వరుసగా విజయాలు సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా ఆయన `విష్ణు విన్యాసం` అనే చిత్రంలో నటించాడు. యుదాంత్‌ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్‌ పతాకంపై సుమంత్‌ నాయుడు జి నిర్మించారు. హేమ అండ్‌ శాలిని సమర్పకులు. ఈ మూవీ శుక్రవారం(ఫిబ్రవరి 27న) విడుదల కానుంది. ఈక్రమంలో సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చింది.

ముందుగా `విష్ణు విన్యాసం` మూవీ సెన్సార్‌ని పూర్తి చేసుకుంది. కొన్ని చిన్న చిన్న డైలాగ్‌ మార్పులతో `యూ ఏ` సర్టిఫికేట్‌ వచ్చింది. 16ఏళ్లపై వయసు ఉన్న వారు ఈ మూవీని చూడొచ్చు. ఫన్‌ బాగుందనే అభిప్రాయం సెన్సార్‌ నుంచి వ్యక్తమయినట్టు టాక్‌. ఇదిలా ఉంటే ఈ మూవీ టీజర్‌, ట్రైలర్లతో ఆకట్టుకుంది. అది సినిమాపై అంచనాలను పెంచింది. పైగా తనదైన ప్రమోషన్స్ తో శ్రీవిష్ణు దూసుకుపోతున్నారు. ఇది సినిమాకి హెల్ప్ కాబోతుంది.

సినిమాలో హైలైట్స్ ఏంటి? ట్విస్ట్ అదిరిందట!

ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినిమాని కొందరు టీమ్‌, ఇండస్ట్రీ ప్రముఖులు వీక్షించారు. వారి అభిప్రాయం ప్రకారం సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. శ్రీవిష్ణు ఇందులో లెక్చరర్‌గా కనిపించబోతున్నారట. ఆయన ఒంగోలులోని ఓ కాలేజీలో వర్క్ చేస్తున్నారు. అతనికి జాతకాలంటే పిచ్చి. అలాంటి విష్ణు.. హీరోయిన్‌ నయనసారికతో పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. అయితే హీరోయిన్‌కి ఇందులో పెళ్లి అంటే భయం. వాస్తు, జాతకాలంటూ తిరిగే విష్ణుకి, పెళ్లి అంటే భయపడే నయన సారికకి జోడీ ఎలా కుదిరింది. ఈ క్రమంలో ఎలాంటి సంఘటనలు, సన్నివేశాలు చోటు చేసుకున్నాయనేది సినిమా అని టాక్‌.

ఇక మూవీ ఎలా ఉందంటే ఇది ఆద్యంతం హిలేరియస్‌ ఫన్‌ రైడ్‌ అంటున్నారు. ఫస్టాఫ్‌ అంతా విష్ణు రచ్చ, ఆయన హీరోయిన్‌తో ప్రేమలో పడేయడం చుట్టూ తిరుగుతుందట. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆద్యంతం నవ్వులు పూయిస్తాయట. రొమాంటిక్‌గానూ ఉంటాయట. హీరోయిన్‌తో హీరో ప్రేమలో పడటం, ఆమె హీరోని వేరే ఉద్దేశ్యంతో పడేయడం విచిత్రంగా, క్రేజీగా ఉంటుందట. ఇదే పెద్ద ట్విస్ట్ అని టాక్‌. హీరోకి, హీరోయిన్‌ ఇచ్చే ఝలక్‌ అదిరిపోతుందట. సెకండాఫ్‌ కామెడీ బాగుంటుందని, క్లైమాక్స్ లో మంచి సందేశం కూడా ఉంటుందట.

ఫన్ రైడ్ మూవీ.. సందేశం కూడా ఉందట!

నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ నటించిన `ఆ ఒక్కటీ అడక్కు` తరహాలో సినిమా సాగుతుందని అంటున్నారు. కాకపోతే కొత్త ట్రీట్‌మెంట్‌ ఉంటుందట. ట్రెండీగానూ ఉంటుందని సమాచారం. శ్రీవిష్ణు మార్క్ కామెడీ హైలైట్‌గా నిలుస్తుందని, ఫ్యామిలీ ఆడియెన్స్ కి, యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. లిప్‌ లాక్‌ అదిరిపోతుందని తెలుస్తోంది. విజువల్స్, రథన్‌ మ్యూజిక్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్ అని టాక్‌. అయితే ఫన్‌ అన్ని చోట్ల వర్కౌట్‌ కాలేదని, కొన్ని చోట్ల బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తుందని అంటున్నారు. లవ్‌ ట్రాక్‌ కూడా నార్మల్‌గానే ఉంటుందని, డ్రామా అంతగా పండలేదని టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి. కానీ ఈ సారి కూడా శ్రీవిష్ణు హిట్‌ కొట్టాడని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు కరెక్ట్, సినిమా నిజంగానే బాగుందా అనేది అసలైన ఏసియానెట్‌ రివ్యూలో చూడండి. అందుకు రేపటి వరకు వెయిట్‌ చేయండి.

విష్ణు విన్యాసం మూవీకి ఫస్ట్ రివ్యూ అదిరింది. కామెడీ, రొమాన్స్, సందేశంతో సినిమా సూపర్ హిట్ అని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.