
📌 Key Points
- శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 3.25 కోట్ల వసూళ్లు రాబట్టింది – టాలీవుడ్ షేక్!
- నయన్ సారిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లలో దూకుడు చూపిస్తోంది.
- ఈ సినిమా ఇండియాలో రూ. 2 కోట్లు వసూలు చేసింది, ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లు సాధించింది.
- ‘విష్ణు విన్యాసం’ మూవీకి రూ. 20 కోట్ల బడ్జెట్ కాగా, నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా రూ. 16 కోట్లు వచ్చాయి.
శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘విష్ణు విన్యాసం’ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్ల పరంగా మాత్రం అదరగొడుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూద్దాం!
ఫస్ట్ డే కలెక్షన్ల మోత.. రికార్డులు బ్రేక్!
శ్రీవిష్ణు.. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్‌మెంట్ ట్యాగ్‌ని సొంతం చేసుకున్నారు. వినోదాత్మక చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. తాను చేసిన సినిమాల్లో ఎక్కువగా లవ్ స్టోరీస్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న చిత్రాలే ఉంటాయి. చిన్న కాన్సెప్ట్ తో, దాని చుట్టూ మంచి వినోదాన్ని అల్లుకుని సినిమాలు తీస్తూ హిట్లు కొడుతున్నాడు. ఇప్పుడు `విష్ణు విన్యాసం` మూవీతో వచ్చాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి కొంత డివైడ్ టాక్ వచ్చింది.
యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన `విష్ణు విన్యాసం` మూవీలో శ్రీవిష్ణుకి జోడీగా నయన సారిక హీరోయిన్‌గా నటించింది. సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, గోపరాజు రమణ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎంటర్‌టైన్‌మెంట్‌ని బేస్ చేసుకుని ఈ చిత్రం రూపొందింది. శ్రీవిష్ణు తన భుజాలపై వేసుకుని సినిమాని నడిపించారు. ట్రెండీ కామెడీ, జెంజీ డైలాగ్‌లతో ఆకట్టుకున్నాడు. అయితే కొంత నెగటివ్ టాక్ వచ్చింది.
ఓవర్సీస్‌లోనూ అదరగొట్టిన విష్ణు విన్యాసం
మరి ఈ మూవీ కలెక్షన్ల పరంగా ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుంది. సినిమా బాక్సాఫీసు వద్ద ఏ రేంజ్‌లో సత్తా చాటుతుందనేది చూస్తే, మొదటి రోజు డీసెంట్ కలెక్షన్లు వచ్చాయి. ఇండియాలో రెండు కోట్లు వసూలు చేస్తే, ఓవర్సీస్‌లో కలిపి మొత్తం రూ.3.25కోట్లు రాబట్టింది. మొత్తంగా దాదాపు కోటిన్నరకుపైగా షేర్ సాధించింది. రెండో రోజు ఇప్పటికే కోటి వరకు రాబట్టినట్టు సమాచారం. ఈ వీకెండ్ మాత్రం సినిమా బాగానే ఆడేలా ఉంది. ఆ తర్వాత ఎలా ఉంటుందనేది చూడాలి. ఆడియెన్స్ కి కామెడీ కనెక్ట్ అయితే ఆడుతుంది. లేదంటే సోమవారం నుంచి పడిపోతుందని చెప్పొచ్చు.
బడ్జెట్ రికవరీ.. నిర్మాతలకు లాభాల పంట!
`విష్ణు విన్యాసం` మూవీకి దాదాపు రూ.20కోట్ల బడ్జెట్ అయ్యింది. థియేట్రికల్ బిజినెస్ ని రూ.12కోట్లుగా వెలకట్టారు. నాన్ థియేట్రికల్‌గా దీనికి రూ.16కోట్ల వరకు వచ్చిందని సమాచారం. ఈ లెక్కన ఇప్పటికే నిర్మాతలకు రూ.28కోట్లు వచ్చింది. ఎనిమిది కోట్లు లాభాల్లో ఉన్నారు. కానీ థియేట్రికల్‌గా సినిమా ఏ రేంజ్‌లో సత్తా చాటుతుందనేది ఆసక్తికరంగా మారింది. థియేటర్ నుంచి రూ.24కోట్ల గ్రాస్ వసూలు చేస్తే, బయ్యర్లు సేఫ్ లేదంటే నష్టాలు తప్పవు. మరి ఆ టార్గెట్‌ని రీచ్ అవుతుందా అనేది చూడాలి.
‘విష్ణు విన్యాసం’ మూవీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్నప్పటికీ, అసలు సత్తా చాటాలంటే రానున్న రోజుల్లో మరింత రాణించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


