|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: విష్ణు విన్యాసంలో అల్లు అర్జున్‌కు అవమానం? ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫైర్!

Published: 11-01-2026, 10:00 PM
షాకింగ్: విష్ణు విన్యాసంలో అల్లు అర్జున్‌కు అవమానం? ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫైర్!
  • శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’ మూవీలో అల్లు అర్జున్‌ను అవమానించారంటూ ఫైర్ అవుతున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్!
  • ‘దేఖో విష్ణు విన్యాసం’ పాటలో AA బ్రాండ్‌ను తలకిందులుగా చూపించిన శ్రీవిష్ణు..దుమారం రేపుతున్న వివాదం!
  • అల్లు అర్జున్ బ్రాండ్‌ను అవమానించేందుకే ఇలా చేశారని ఆరోపిస్తున్న ఫ్యాన్స్..సోషల్ మీడియాలో ట్రోల్స్!
  • విష్ణు విన్యాసం టీమ్ వివరణ కోసం ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ అభిమానులు.. త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం!

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ‘విష్ణు విన్యాసం’ చిత్రం విడుదలకి ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలోని పాటలో అల్లు అర్జున్‌ను అవమానించే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలేం జరిగిందో చూద్దాం!

వివాదానికి దారితీసిన ‘విష్ణు విన్యాసం’ సాంగ్!

నటనపై మక్కువతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు శ్రీవిష్ణు(Sri Vishnu). తన సహజ నటనతో క్రమంగా హీరోగా స్థిరపడ్డాడు. కంటెంట్‌కు ప్రాధాన్యత ఇస్తూ విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’(vishnu vinyasam). ఈ సినిమాతో యదునాథ్ మారుతీ రావు దర్శకుడిగా పరిచయం అవుతుండగా, శ్రీవిష్ణుకు జోడీగా నయన్ సారిక నటిస్తోంది. షూటింగ్ వేగంగా జరుగుతున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. అయితే ఇటీవల విడుదలైన ‘దేఖో విష్ణు విన్యాసం’ పాట అనుకోకుండా వివాదానికి దారి తీసింది. ఈ పాటలోని ఓ విజువల్ కారణంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను అవమానించారంటూ ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..అల్లు అర్జున్ తన బ్రాండ్ గా AA పెట్టుకున్న విషయం తెలిసిందే. AA అల్లు అర్జున్(Allu Arjun) అండ్ అల్లు ఆర్మీ అనే మీనింగ్ వచ్చేలా ఆ బ్రాండ్ సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన సినిమాల్లోనూ ఆ బ్యాండ్‌ను చూపిస్తుంటాడు. అలాంటిది అలాంటి బ్రాండ్‌ని విష్ణు అవమానించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ‘విష్ణు విన్యాసం’ సాంగ్‌లో శ్రీవిష్ణుAA బ్రాండ్ ను తలకిందులుగా చూపించాడు శ్రీవిష్ణు. AA ని తలకిందులుగా రాస్తే అది VV అవుతుంది. అంటే విష్ణు విన్యాసం అని. కానీ, అల్లు అర్జున్ ను అవమానించడానికే ఆలా చేశారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక కొందరు మాత్రం తన సినిమా పేరును రాసుకోవడంలో తప్పులేదని సమర్ధిస్తున్నారు.

AA బ్రాండ్‌ను తలకిందులుగా చూపించడంతో ఆగ్రహం!

విష్ణు విన్యాసం టీమ్ ఏం సమాధానం చెబుతుందో చూడాలి!

ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై విష్ణు విన్యాసం టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.