|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విష్ణు విన్యాసం: ఫస్టాఫ్ బోర్ అంటున్న హీరోయిన్! అసలు కారణం ఇదేనా?

Published: 24-02-2026, 12:30 PM
విష్ణు విన్యాసం: ఫస్టాఫ్ బోర్ అంటున్న హీరోయిన్! అసలు కారణం ఇదేనా?
  • ఫస్టాఫ్‌లో అబ్బాయిలకు కాస్త చిరాకు కలిగిస్తుందన్న నయన్ సారిక.
  • సెకండాఫ్‌లో అసలు విషయం తెలుస్తుందని వెల్లడి.
  • సినిమాలో మనీషా పాత్రలో నయన్ సారిక.
  • శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందని నయన్ సారిక ప్రశంసించారు.

శ్రీ విష్ణు, నయన్ సారిక నటించిన చిత్రం ‘విష్ణు విన్యాసం’. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుందని హీరోయిన్ నయన్ సారిక అన్నారు. అయితే, ఆమె అలా అనడానికి ఒక కారణం ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫస్టాఫ్ బోర్ అని నయన్ సారిక ఎందుకు అన్నారు?

Nayan Sarika: శ్రీ విష్ణు (Sree Vishnu), నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించిన హిలేరియస్ జాయ్‌ రైడ్‌ చిత్రం ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam). యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేస్తూ.. హీరోయిన్ నయన్ సారిక (Nayan Sarika) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ‘విష్ణు విన్యాసం’ సినిమా ఫస్టాఫ్ అంతా బోర్ కొడుతుందనే వ్యాఖ్యలతో ఈ సినిమాపై ఇంకాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. అయితే ఆమె కావాలనేం చెప్పలేదు. అందుకో రీజన్ కూడా ఉంది. అసలామె ఏం చెప్పుకొచ్చిందంటే..

సినిమాలో మనీషా పాత్ర ఎలా ఉండబోతోంది?

‘‘ఇందులో చాలా డిఫరెంట్ పాత్ర చేశాను. నా పాత్రకు చాలా షేడ్స్ వుంటాయి. కొంచెం ఫీమేల్ డామినేటింగ్‌గా నా పాత్ర ఉంటుంది. ఫస్టాఫ్‌లో అబ్బాయిలకి కాస్త చిరాకు కలిగిస్తుంది. కానీ దానికి కారణం ఏమిటో సెకండాఫ్‌లో రివీల్ అయిన తర్వాత ఆ పాత్రని అందరూ అర్థం చేసుకుని, ఇష్టపడతారు. నాకు ఈ పాత్ర చెప్పినప్పుడు చాలా నచ్చింది. టీజర్‌లో చూసిన కొన్ని సీన్స్ క్యారెక్టర్ కోసం, కథ కోసం చాలా ఇంపార్టెంట్. ఇందులో మనీషా అనే పాత్రలో కనిపిస్తాను. తను జీవితంలో చాలా బాధలు ఎదుర్కొన్న అమ్మాయి. ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత జీవితాన్ని హాయిగా బ్రతకాలనుకునే అమ్మాయి. ఇందులో కాలేజీలో ఫ్యాకల్టీగా కనిపిస్తాను. విష్ణు క్యారెక్టర్ కూడా అదే. ఇద్దరు ఫ్యాకల్టీల మధ్య జరిగే ప్రేమ కథ. స్టూడెంట్స్, యూత్ చాలా బాగా కనెక్ట్ అవుతారు.

శ్రీ విష్ణుతో పనిచేయడం ఎలా ఉంది?

శ్రీ విష్ణుతో వర్క్ చేయడం వెరీ ఫన్ జర్నీ. చాలా జోవియల్ పర్సన్. ఆయన సరదాగా మాట్లాడుతుంటే వినడానికి హాయిగా ఉంటుంది. చాలా మాటలు గుర్తుండిపోతాయి. ఆయనతో కలిసి పనిచేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. ప్రేక్షకులను నవ్వించడం నిజంగా చాలా కష్టం. విష్ణుకి ఆ కామెడీ టైమింగ్ చాలా నేచురల్‌గా వచ్చేస్తుంది. ఆ విషయంలో ఆయన వెరీ టాలెంటెడ్. అలాగే ఆయన స్పాట్‌లో ఇంప్రవైజ్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. ఆయన నేచురల్ పర్ఫార్మెర్ కావడంతో మా పెర్ఫార్మన్స్ కూడా బెటర్ అయ్యింది. నాకు రాజమౌళి సినిమాలో పనిచేయాలని ఉంది. ఆయన సినిమాలో చేయడం నా డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

మొత్తానికి విష్ణు విన్యాసం సినిమాపై నయన్ సారిక చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. సినిమా చూడడానికి సిద్ధంగా ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.