|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vishnupriya – Prithvi : పృథ్వీతో రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన విష్ణుప్రియ.. ఒకవేళ అతను చెప్తే..

Published: 25-05-2025, 6:30 AM
Vishnupriya – Prithvi : పృథ్వీతో రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన విష్ణుప్రియ.. ఒకవేళ అతను చెప్తే..

యాంకర్, నటి విష్ణుప్రియ, బిగ్ బాస్ షోలో పాల్గొన్న సీరియల్ నటుడు పృథ్వీతో తన సంబంధం గురించి క్లారిటీ ఇచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె వారి మధ్య ఉన్న బంధం గురించి, పృథ్వీ ప్రపోజల్ గురించి మాట్లాడింది.

Key Points

1

విష్ణుప్రియ, పృథ్వీతో తన స్నేహాన్ని వివరించింది.

2

పృథ్వీ ప్రపోజల్ చేస్తే ఆలోచిస్తానని చెప్పింది.

4

బిగ్ బాస్ తర్వాత వారిద్దరి మధ్య ఉన్న బంధంపై చర్చ జరుగుతోంది.

విష్ణుప్రియ – పృథ్వీ సంబంధంపై క్లారిటీ

Vishnupriya – Prithvi : యాంకర్ గా, నటిగా విష్ణుప్రియ ప్రస్తుతం పలు షోలు, సిరీస్ లతో బిజీగానే ఉంది. గత సీజన్ బిగ్ బాస్ లో పాల్గొన్నప్పుడు సీరియల్ నటుడు పృథ్వీతో బాగా క్లోజ్ అయింది. షోలో ఇద్దరూ కలిసి ఆట ఆడారని అందరూ అన్నారు. షో తర్వాత కూడా అతనితో క్లోజ్ గా ఉంటూ కనిపిస్తుంది. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణుప్రియ పృథ్వీతో ఉన్న రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చింది.

బిగ్ బాస్ తర్వాత వారి బంధం

విష్ణుప్రియ మాట్లాడుతూ.. పృథ్వీ నాకు మంచి ఫ్రెండ్ అంతే. మంచి బాండింగ్ ఉంది అతనితో. పృథ్వీ వస్తున్నాడు అంటే నేను హ్యాపీ. పృథ్వీ పక్కన ఉంటే హ్యాపీగానే ఉంటాను. పృథ్వీ కోసమే కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోకి మళ్ళీ వచ్చాను. ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నాము. ఒకవేళ అతను లవ్ అనే టాపిక్ తో వస్తే అప్పుడు ఆలోచిస్తాను. అది జరిగినా ఓకే. జరగకపోయినా ఓకే. ఒకవేళ పృథ్వికి గర్ల్ ఫ్రెండ్ వచ్చి వెళ్ళిపోయినా నాకు ఓకే. మొదట్లో పాత రిలేషన్స్ లో తప్పులు జరిగాయి కాబట్టి ఇప్పుడు కూల్ గా ఆలోచిస్తున్నాను. ప్రస్తుతానికి నేను సింగిల్. మింగిల్ అవ్వడానికి రెడీ. పెళ్లి చేసుకుంటాను. నా వైబ్రేషన్ ఉన్న అబ్బాయి దొరికితే చేసుకుంటాను అని చెప్పింది.

ప్రపోజల్‌పై విష్ణుప్రియ స్పందన

దీంతో ఒకవేళ పృథ్వీ ప్రపోజ్ చేస్తే మాత్రం ఓకే చెప్తాను అని డైరెక్ట్ గానే చెప్పేసింది విష్ణుప్రియ. మరి పృథ్వీ విష్ణుకి ప్రపోజ్ చేస్తాడా? లేక ఇద్దరు వేరే వాళ్ళని చేసుకుంటారా చూడాలి.

విష్ణుప్రియ, పృథ్వీతో ఉన్న తన బంధం గురించి స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం సింగిల్‌గా ఉన్న ఆమె, పృథ్వీ ప్రపోజ్ చేస్తే ఆలోచిస్తానని చెప్పడంతో వారి భవిష్యత్తు ఆసక్తికరంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.