
షార్ట్ ఫిలిమ్స్, యాంకరింగ్, బిగ్ బాస్ తో పాపులర్ అయిన విష్ణుప్రియ, హీరోయిన్ గా నటించకూడదని నిర్ణయించుకుంది. ఆమె ఈ నిర్ణయానికి కారణం ఆర్థిక అంశాలు అని తెలిపింది. బాలీవుడ్, తమిళ్ నుంచి కూడా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి.
Key Points
విష్ణుప్రియ హీరోయిన్‌గా కెరీర్ కొనసాగించకూడదని నిర్ణయించుకుంది.
హీరోయిన్ పాత్రలకు కావాల్సిన మెయింటెనెన్స్ ఖర్చులను భరించలేకపోవడమే కారణం.
తమిళం, బాలీవుడ్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆఫర్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం తెలుగులోనూ ఒక సినిమాలో నటిస్తున్నారు.
హీరోయిన్ పాత్రలకు దూరం
Vishnupriya : షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి యాంకర్ గా పేరు తెచ్చుకుంది విష్ణుప్రియ. ఆ తర్వాత బిగ్ బాస్ తో మరింత పాపులారిటీ తెచ్చుకొని ఇప్పుడు నటిగా సినిమాలు, సిరీస్ లు, పలు టీవీ షోలతో బిజీగానే ఉంది. అయితే విష్ణుప్రియ హీరోయిన్ గా ఎందుకు చెయ్యట్లేదు, అవకాశాలు వచ్చాయా అనేదానిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.
ఖర్చుల భారం
విష్ణుప్రియ మాట్లాడుతూ.. కెరీర్ మొదట్లో హీరోయిన్ గా ఓ సినిమా చేసాను. ఆ సినిమా తర్వాత మళ్ళీ హీరోయిన్ గా చేయకూడదు అనుకున్నా. హీరోయిన్ గా ఉంటే బాగా ట్యాన్ అయిపోయా. నా కలర్ కూడా తగ్గిపోయింది. నేను సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయా. హీరోయిన్ గా ఉండాలంటే ఫుడ్, డైట్, బ్యూటీ, స్టాఫ్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. వాటికి డబ్బులు కావలి. నా దగ్గర డబ్బులు లేవు. నాకు అన్ని మెయింటైన్ చేయాలంటే కష్టం అందుకే నేను హీరోయిన్ గా చేయను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కొనసాగుతాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తమిళ్, బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. త్వరలో ఆ సినిమాల్లో చూస్తారు. తెలుగులో కూడా ఓ సినిమా చేస్తున్నాను అని తెలిపింది.
తమిళ్, బాలీవుడ్ ఆఫర్లు
చివరగా, విష్ణుప్రియ తన నిర్ణయంపై స్పష్టత ఇచ్చి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ కొనసాగించాలని చెప్పింది. తమిళం, బాలీవుడ్ సినిమాల్లో కూడా ఆమెను త్వరలోనే చూడొచ్చు.


