|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vishwambhara : మెగాస్టార్ తో ‘విశ్వంభర’లో స్టెప్పులేసే స్పెషల్ భామ ఎవరో తెలుసా? బాలీవుడ్ నుంచి దించారుగా..

Published: 26-07-2025, 7:13 AM
Vishwambhara : మెగాస్టార్ తో ‘విశ్వంభర’లో స్టెప్పులేసే స్పెషల్ భామ ఎవరో తెలుసా? బాలీవుడ్ నుంచి దించారుగా..

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో చిరంజీవితో స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ నటి నటించనున్నారు. ఆమె ఎవరో తెలుసుకుందాం.

Key Points

1

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' చిత్రంలో స్పెషల్ సాంగ్ షూట్.

2

బాలీవుడ్ నటి మౌనీ రాయ్ చిరంజీవితో స్టెప్పులేయనున్నారు.

4

ఈ సాంగ్ తో మౌనీ రాయ్ తెలుగు సినీ ప్రవేశం.

చిరంజీవి ‘విశ్వంభర’ చిత్ర షూటింగ్

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూట్ లో ఉన్నాడు. పలు కారణాలతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ నిన్నే మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్ లో చిరంజీవితో స్పెషల్ సాంగ్ షాట్ చేస్తున్నారు. ఇందుకోసం ఓ భారీ సెట్ కూడా వేశారు. భీమ్స్ సంగీతం అందించిన స్పెషల్ సాంగ్ కి గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

అయితే ఈ స్పెషల్ సాంగ్ లో చిరంజీవితో స్టెప్పులేసేందుకు బాలీవుడ్ భామని తీసుకొచ్చారు. బాలీవుడ్ లో నాగిని సీరియల్ తో ఫేమ్ తెచ్చుకొని పలు సినిమాలు, సీరియల్స్ తో పాపులర్ అయిన మౌని రాయ్ ని ఈ స్పెషల్ సాంగ్ కోసం తీసుకొచ్చినట్టు సమాచారం. సోషల్ మీడియాలో మౌని రాయ్ రెగ్యులర్ గా తన హాట్ హాట్ ఫొటోలతో వైరల్ అవుతూనే ఉంటుంది.

బాలీవుడ్ భామ మౌనీ రాయ్ తెలుగు ఎంట్రీ

ఈ సినిమాతో మౌనీ రాయ్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మరి చిరు – మౌనీ రాయ్ కాంబో స్పెషల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సాంగ్ షాట్ అయ్యాక ఓ రెండు రోజుల ప్యాచ్ వర్క్ తో విశ్వంభర షూట్ మొత్తం పూర్తవుతుందని సమాచారం.

స్పెషల్ సాంగ్ షూట్ వివరాలు

చిరంజీవి మరియు మౌనీ రాయ్ కాంబినేషన్ లోని స్పెషల్ సాంగ్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. విశ్వంభర చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.