|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విశ్వంభర విడుదలపై సస్పెన్స్ వీడింది! నిర్మాత ప్రకటనతో మెగా అభిమానుల్లో ఆనందం!!

Published: 02-02-2026, 11:05 AM
విశ్వంభర విడుదలపై సస్పెన్స్ వీడింది! నిర్మాత ప్రకటనతో మెగా అభిమానుల్లో ఆనందం!!
  • దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర.
  • సినిమా జూలై 9న విడుదల కానుందనే వార్తలపై నిర్మాత స్పష్టత ఇచ్చారు.
  • సినిమా సీజీ వర్క్ కారణంగా ఆలస్యమైందని నిర్మాత తెలిపారు.
  • చిరంజీవి ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై దృష్టి సారించారు.

మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం విశ్వంభర. ఈ సినిమా విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధతకు నిర్మాత ఒక ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చారు. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలుసుకోండి.

విశ్వంభర విడుదలపై నిర్మాత స్పందన

Vishwambhara: బింబిసార సినిమాతో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ వశిష్ట( Vassishta) తన రెండో సినిమా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో చేసే అవకాశాన్ని అందుకున్నారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్లో విశ్వంభర(Vishwambhara) అనే సినిమాను ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయి. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావలసిన ఈ సినిమా ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో ఈ సినిమా విడుదల గురించి అభిమానులు కూడా ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా జూలై 9వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా విడుదల గురించి వస్తున్నటువంటి వార్తలపై తాజాగా నిర్మాణ సంస్థతో అనుబంధం ఉన్నటువంటి వారిలో ఒకరైన అజయ్ రాజు క్లారిటీ ఇచ్చారు.

యు.వీ నిర్మాణ సంస్థలో సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా యువి నిర్మాణ సంస్థతో అనుబంధం ఉన్నటువంటి అజయ్ రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయనకు విశ్వంభర సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది ఆలస్యం కావడానికి కారణాలు ఏంటి అనే ప్రశ్న ఎదురవడంతో అజయ్ మాట్లాడుతూ ఈ సినిమా మొత్తం సీజీ వర్క్ తో కూడుకున్నదని తెలిపారు. అయితే సినిమా నుంచి విడుదల చేసిన ఒక టీజర్ సిజి వర్క్ విషయంలో చాలా విమర్శలను ఎదుర్కొంది అందుకే ఈ సినిమా ఆలస్యమైందని తెలిపారు.

సినిమా ఆలస్యానికి కారణం ఇదేనా?

ప్రస్తుతం ఈ సినిమాకు సీజీ వర్క్ జరుగుతోందని ఈసారి అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని అజయ్ రాజు ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమా సమ్మర్లో విడుదల కాబోతోందా అనే ప్రశ్న ఎదురవడంతో ఈ సినిమా విడుదల గురించి నిర్మాత వంశి గారు త్వరలోనే క్లారిటీ ఇస్తారు అంటూ మాట దాటవేసారు గానీ ఈ సినిమా విడుదల గురించి సరైన స్పష్టత మాత్రం వెల్లడించలేదు. మరి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు అనుగుణంగానే ఈ సినిమాని జూలై 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతారా? లేదంటే మరింత ఆలస్యం చేస్తారా ?అనేది తెలియాల్సి ఉంది.

బాబీ సినిమాతో మెగాస్టార్ బిజీ..

మెగాస్టార్ తదుపరి చిత్రాలపై ఫోకస్

ఇక ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి కావడంతో చిరంజీవి తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా మంచి విజయమైన నేపథ్యంలో తదుపరి డైరెక్టర్ బాబి డైరెక్షన్లో చిరంజీవి బిజీ కాబోతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకొని మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు జరుపుకోబోతుందని తెలుస్తోంది.

విశ్వంభర సినిమా విడుదల తేదీపై నిర్మాత స్పష్టత ఇవ్వడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా సీజీ వర్క్ పూర్తయిన తర్వాత త్వరలోనే విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.