|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vishwambhara : ‘విశ్వంభర’ కథ ఇదే.. మొత్తం లీక్ చేసేసిన దర్శకుడు .. అలా ఎలా చెప్పావు బ్రో..

Published: 18-07-2025, 4:47 AM
Vishwambhara : ‘విశ్వంభర’ కథ ఇదే.. మొత్తం లీక్ చేసేసిన దర్శకుడు .. అలా ఎలా చెప్పావు బ్రో..

మెగాస్టార్ చిరంజీవి నటించే ‘విశ్వంభర’ సినిమా కథ దర్శకుడు అనుకోకుండా లీక్ చేశాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నారు.

Key Points

1

చిరంజీవి 'విశ్వంభర' సినిమా కథ దర్శకుడు లీక్ చేశాడు.

2

14 లోకాలను దాటి సత్యలోకానికి హీరో ప్రయాణం కథాంశం.

4

సినిమాలోని ముఖ్య సన్నివేశాలు, షూటింగ్ విశేషాలను దర్శకుడు వెల్లడించాడు.

‘విశ్వంభర’ కథాంశం లీక్

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి త్వరలో విశ్వంభర సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయి VFX వర్క్స్ జరుగుతున్నాయి. యముడికి మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి తర్వాత చాన్నాళ్లకు చిరంజీవి సోషియో ఫాంటసీ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా దర్శకుడు వశిష్ట ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా సినిమా గురించి మాట్లాడుతూ అనుకోకుండా కథ లీక్ చేసేసాడు. దీంతో విశ్వంభర స్టోరీ వైరల్ గా మారింది.

14 లోకాలు మరియు సత్యలోకం

డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. ఫస్ట్ హాఫ్ లో కొంత టాకీ పార్ట్, మూడు పెద్ద సీక్వెన్స్ లు ఉంటాయి. సెకండ్ హాఫ్ అసలు కథ మొదలవుతుంది. మనకు 14 లోకాలు ఉన్నాయి. పైన ఏడు, కింద ఏడు ఉన్నాయి. ఇప్పటివరకు రకరకాలుగా ఆ లోకాలను పలు సినిమాల్లో చూపించారు. నేను ఈ 14 లోకాలు దాటి సత్యలోకం ఉంటుంది. అది విశ్వంభర లోకంగా నేను చూపించబోతున్నా. హీరో ఈ 14 లోకాలను దాటుకొని డైరెక్ట్ గా సత్యలోకానికి వెళ్తాడు. నా ఊహల్లో ఎలా ఉంటుందో అది విశ్వంభర. జగదేక వీరుడు అతిలోక సుందరికి దీనికి సంబంధం లేదు. హీరోయిన్ ని వెతుక్కుంటూ 14 లోకాలు దాటి సత్యలోకానికి వెళ్లి హీరో ఎలా హీరోయిన్ ని తెచ్చుకున్నాడు అనేదే కథ. చాలా వరకు సోషియో ఫాంటసీలలో ఇదే కథ ఉంటుంది. హీరోయిన్ కోసమో, లేదా దేని కోసమో వెతుకుతూ వెళ్తారు. విశ్వంభరకు వెళ్ళాక అక్కడ విలన్ ని చేరే క్రమంలో అయిదు ప్రపంచాలను సృష్టించాము. ఈ అయిదు కూడా పంచ భూతాలను సూచిస్తాయి అని తెలిపారు.

షూటింగ్ విశేషాలు

అలాగే చిరంజీవిపై తీసిన ఫస్ట్ షాట్ గురించి మాట్లాడుతూ.. మొదట వారం రోజులు చిరంజీవి గారు లేని సీన్స్ షూట్ చేసాము. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి గారితో షూట్. ఫస్ట్ రోజు చాలా టెన్షన్ పడ్డాను. సినిమాలో సిద్ధుల కొండ అని ఒక కొండ ఉంటుంది. అక్కడ శివుడు విగ్రహం ఉంటుంది. చిరంజీవి శివుడికి దండం పెట్టే సీన్ ఫస్ట్ షూట్ చేశాను ఆయనతో అని తెలిపాడు.

చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాపై అంచనాలు పెరిగాయి. కథ లీక్ అయినప్పటికీ, సినిమా విజయవంతం అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. దర్శకుడు వశిష్ట వివరణలతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.