|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘విశ్వంభర’ అప్‌డేట్‌.. అందుకే ఆలస్యం అంటూ చిరంజీవి వీడియో

Published: 21-08-2025, 12:46 AM
‘విశ్వంభర’ అప్‌డేట్‌.. అందుకే ఆలస్యం అంటూ చిరంజీవి వీడియో

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ చిత్రం రిలీజ్ గురించి తాజా అప్‌డేట్ వచ్చింది. వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తవడానికి ఆలస్యం కావడం వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడిందని చిరంజీవి వెల్లడించారు.

Key Points

1

చిరంజీవి 'విశ్వంభర' సినిమా రిలీజ్ 2026 సమ్మర్‌లో.

2

వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా సినిమా రిలీజ్ వాయిదా.

4

సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీగా 'విశ్వంభర' రూపొందుతోంది.

విశ్వంభర రిలీజ్ డేట్ ఖరారు

మెగాస్టార్ ‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రాల్లో విశ్వంభర ఒకటి . ఈ మూవీ షూటింగ్ ‌ ఎప్పుడో పూర్తయింది . వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే రిలీజ్ ‌ కావాల్సింది కూడా . అయితే వీఎఫ్ ‌ ఎక్స్ ‌ పనులు ఇంకా పూర్తకాకపోవడంతో వాయిదా వేశారు . అప్పటి నుంచి రిలీజ్ ‌ డేట్ ‌ పై చిత్రబృందం క్లారిటీ ఇవ్వలేదు .

సమ్మర్ ‌, దసరా , దీపావళి , సంక్రాంతి అంటూ నెట్టింట చర్చలు జరిగినా .. మేకర్స్ ‌ మాత్రం విడుదల తేదిపై స్పందించలేదు . తాజాగా ఈ సినిమా రిలీజ్ ‌ పై మెగాస్టార్ ‌ చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు . వచ్చే ఏడాది సమ్మర్ ‌ లో ఈ చిత్రం విడుదల అవుతుందని చెప్పారు . ఆలస్యానికి గల కారణాన్ని వివరిస్తూ ఓ స్పెషల్ ‌ వీడియోని రిలీజ్ ‌ చేశాడు (Vishwambhara Update)

వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా ఆలస్యం

‘విశ్వంభర ఎందుకు ఆలస్యం అవుతుందని చాలా మందికి అనుమానం ఉంది. ఆ జాప్యం సముచితమని నేను భావిస్తున్నాను. ఈ సినిమా సెకండాఫ్‌ మొత్తం వీఎఫ్‌ఎక్స్‌ మీద ఆధారపడి ఉంది.  దీన్ని అత్తుత్తమంగా మీకు అందించాలనే ప్రయత్నమే ఈ జాప్యానికి కారణం.

ఎలాంటి విమర్శలకు చోటివ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ సినిమా చందమామ కథలా సాగిపోతుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది. దీని గ్లింప్స్‌ను ఆగస్టు 21 సాయంత్రం 6.06కు విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాను అందరూ ఎంజాయ్‌ చేసేలా దీన్ని ప్రేక్షకుల ముందుకుతీసుకువస్తారు. 2026 సమ్మర్‌లో ఎంజాయ్‌ చేయండి’ అని చిరంజీవి తెలిపారు. విశ్వంభర విషయానికొస్తే.. చిరంజీవి హీరోగా నటించిన సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌ మూవీ ఇది. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించారు. త్రిషా కృష్ణన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో హీరోయిన్‌ ఆషికా రంగనాథ్, కునాల్‌ కపూర్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

గ్లింప్స్ విడుదల తేదీ

MEGASTAR @KChiruTweets shares a personal note to his fans and the audience about #Vishwambhara ❤️ Check out the MEGA BLAST ANNOUNCEMENT now ⚡ — https://t.co/RQ9is0OQCc Let us celebrate the MEGA BIRTHDAY with #MEGABLASTTEASER out today at 6.06 PM ❤‍🔥 MEGA MASS BEYOND… pic.twitter.com/dtJ2Jo0l1m

— UV Creations (@UV_Creations) August 21, 2025

చిరంజీవి విశ్వంభర సినిమా రిలీజ్ 2026 సమ్మర్‌లో ఉంటుందని, వీఎఫ్‌ఎక్స్ పూర్తి కావడం వల్లే ఆలస్యమని తెలిపారు. గ్లింప్స్ వీడియో ఆగస్టు 21న విడుదల కానుంది.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.