|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vivo T5 Pro: వివో నుంచి సంచలనం! ఫీచర్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే! ధర ఎంతంటే?

Published: 28-03-2026, 6:05 AM
Vivo T5 Pro: వివో నుంచి సంచలనం! ఫీచర్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే! ధర ఎంతంటే?
  • వివో T5 ప్రో 2026 ఏప్రిల్ మధ్యలో విడుదల కానుంది, ధర రూ. 35,000 నుండి ప్రారంభం కావచ్చు.
  • ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
  • వివో T5 ప్రో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
  • ఇందులో 50MP ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 9020mAh బ్యాటరీ ఉన్నాయి.

వివో నుంచి T సిరీస్‌లో సరికొత్త ఫోన్ రాబోతోంది. వివో T5 ప్రో పేరుతో విడుదల కానున్న ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వివో T5 ప్రో: లాంచ్ ఎప్పుడు, ధర ఎంత?

Vivo T5 Pro : వివో T5 ప్రో రాబోతుంది. 2026 ఏప్రిల్ మధ్యలో లాంచ్ అయ్యే ఛాన్స్. లీకుల ప్రకారం.. ప్రారంభ ధర సుమారు రూ. 35,000 మధ్య ఉండవచ్చని అంచనా.

Vivo T5 Pro : కొత్త వివో ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. భారత మార్కెట్లో వివో టీ సిరీస్ అతి త్వరలో లాంచ్ కాబోతుంది. స్మార్ట్‌ప్రిక్స్ రిపోర్టు ప్రకారం.. వివో T5 ప్రో లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది.

ఇప్పటికే ఈ టీ5 ప్రోకు సంబంధించి చాలా ఫీచర్లు రివీల్ అయ్యాయి. ఈ డివైజ్‌లో భారీ బ్యాటరీతో పాటు హై రిఫ్రెష్ రేట్‌ అందించనుంది. గత మోడల్‌తో పోలిస్తే ధర కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.

వివో T5 ప్రో: ఫీచర్లు & స్పెసిఫికేషన్లు

భారత్‌లో వివో టి5 ప్రో లాంచ్ టైమ్, ధర : వివో టీ5 ప్రో ఫోన్ 2026 ఏప్రిల్ మధ్య నాటికి భారత మార్కెట్లో లాంచ్ కావచ్చు. ధర పరంగా పరిశీలిస్తే.. ఈ వివో ఫోన్ మార్కెట్లో రూ. 35,000 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. సేఫ్ మిడ్-రేంజ్ కేటగిరీలో వస్తుంది.

Read Also : Samsung Galaxy S25 Plus 5G : ఈ శాంసంగ్ ఫోన్ హాఫ్ రేటుకే వస్తోంది.. రూ. లక్ష ఖరీదైన ఫోన్ కేవలం రూ. 50వేల లోపే..!

ప్రస్తుతానికి, సేల్ ప్లాట్‌ఫామ్, ఇతర వివరాలు వెల్లడి కాలేదు. లాంచ్ సమయం దగ్గర పడుతున్న పూర్తి వివరాలు రివీల్ కానున్నాయి. లీకుల ప్రకారం.. ఈ వివో ఫోన్ కాస్మిక్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ అనే 2 కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.

బ్యాటరీ మరియు ఛార్జింగ్ వివరాలు

వివో టి5 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : వివో టీ5 ప్రో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో రావచ్చు. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. లాంచ్ సమయంలో ఈ డివైజ్ మరిన్ని స్టోరేజ్ వేరియంట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఒరిజిన్ఓఎస్ 6 ఉంటుంది.

వివో టీ5 ప్రోలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ స్నాపర్‌, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ప్రైమరీ సెన్సార్ సోనీ IMX882 లెన్స్ కూడా ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 9020mAh బ్యాటరీతో పాటు 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

వివో T5 ప్రో మిడ్-రేంజ్ విభాగంలో ఒక బలమైన పోటీదారుగా ఉండనుంది. దీని ఫీచర్లు, బ్యాటరీ సామర్థ్యం ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం వేచి చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.