|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘వృషభ’ సినిమాకు ఈ పాట గుండెలాంటిది.. కచ్చితంగా చూడాల్సిందే: నంద కిషోర్

Published: 13-12-2025, 1:08 AM
‘వృషభ’ సినిమాకు ఈ పాట గుండెలాంటిది.. కచ్చితంగా చూడాల్సిందే: నంద కిషోర్
  • మోహన్ లాల్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ చిత్రం ‘వృషభ’ డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
  • సినిమా నుండి ‘అప్పా’ పాట విడుదలైంది, ఇది సినిమా మ్యూజికల్ జర్నీకి ప్రారంభం.
  • ‘అప్పా’ పాట సినిమాకు గుండెలాంటిదని, తండ్రీ కొడుకుల బంధం చూపుతుందని దర్శకుడు నంద కిషోర్ పేర్కొన్నారు.
  • సంగీత దర్శకుడు సామ్ సి.ఎస్ ఈ పాటను వ్యక్తిగత భావోద్వేగాలతో కంపోజ్ చేసినట్లు తెలిపారు.

మోహన్ లాల్ టైటిల్ పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వృషభ’. ఈ సినిమా నుండి తాజాగా ‘అప్పా’ పాట విడుదలైంది. ఈ పాట సినిమాకు గుండెలాంటిదని దర్శకుడు నంద కిషోర్ తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

వృషభ చిత్రం: డిసెంబర్ 25న విడుదల

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ (Mohanlal)టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వృష‌భ‌’(Vrusshabha). కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై ‘వృషభ’ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సంద‌ర్బంగా ఈ చిత్రం డిసెంబ‌ర్ 25 ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ వరుస అప్డేట్ విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అప్పా..’(appa)అనే సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

“అప్పా” పాట.. సినిమాకు గుండెలాంటిది: నంద కిషోర్

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శకుడు నంద కిషోర్ మాట్లాడుతూ ‘‘వృష‌భ‌’ మ్యూజిక‌ల్ జ‌ర్నీఅప్పా పాట‌ను స్టార్ట్ చేశాం. ఈ సినిమా ద్వారా తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉండే బ‌ల‌మైన, భావోద్వేగా బంధం గురించి మేం చెప్పాల‌ని అనుకున్నాం. దాన్ని ఈ పాట ద్వారా చూపించాం. ఈ సినిమాకు ఈ పాట గుండెలాంటిది. అలాగే ప్రేక్షకుల‌కు కథేంటో కూడా ఈ పాట‌తో చూపించే ప్రయ‌త్నం చేశాం. సామ్ సి.ఎస్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఇది ప్రారంభం మాత్రమే. సినిమా నుంచి మ‌రిన్ని పాటలు విడుద‌లవుతాయి. సినిమా సోల్ ఏంట‌నేది రాబోయే పాట‌ల‌తో ప్రేక్షకుల‌కు మ‌రింత‌గా అర్థమ‌వుతుంది. సాధార‌ణంగా కుటుంబం కోసం, పిల్లల కోసం త‌ప‌న ప‌డే తండ్రి గురించిన సినిమాలు చాలా త‌క్కువ‌గానే వ‌చ్చాయి. ఈ క‌థ‌ను మాత్రం త‌ప్పకుండా చూడాల్సిందే’’ అన్నారు.

మోహన్ లాల్‌తో భావోద్వేగ బంధం: సామ్ సి.ఎస్

మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సి.ఎస్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ నంద‌గారు వృష‌భ‌ స్టోరీ నాకు చెప్పగానే తండ్రీ కొడుకు మ‌ధ్య ఉండే ఎమోష‌న్ బాగా క‌నెక్ట్ అయ్యింది. అప్పా..సాంగ్ కంపోజ్ చేసేట‌ప్పుడు పాట‌ను కంపోజ్ చేయాల‌నే ఆలోచ‌న‌తో కాకుండా నాకు వ్యక్తిగ‌తంగా హ‌త్తుకున్న ఎమోష‌న్‌కు పాట చేస్తున్నట్లు భావించాను. మోహ‌న్‌లాల్‌గారి వంటి గొప్ప న‌టుడు ఉన్నప్పుడు ఈ ఎమోష‌న్ నెక్ట్స్ లెవ‌ల్‌లో ఎలివేట్ అవుతుంది. ఆయ‌న ఈ ఎమోష‌న్‌కు గుండెలాంటివారు. ఆయ‌న న‌ట‌న అంద‌రికీ స్ఫూర్తినిచ్చింది. నంద‌గారికి ఉన్న క్లారిటీతో ఆయ‌న‌కు ఎలాంటి పాట కావాల‌నేది నాకు సుల‌భంగా అర్థమైంది. ఈ అప్పా.. పాట విన్నప్పుడు ప్రేక్షకుల‌కు కూడా తండ్రి అనే బంధంలోని ఎమోష‌న్‌కు క‌నెక్ట్ అవుతారు. ఇది మేం నిర్మిస్తోన్న ప్రపంచంలోని చిన్న భాగం మాత్రమే’’ అన్నారు.

“వృషభ” మ్యూజికల్ జర్నీ “అప్పా” పాటతో ప్రారంభమైంది. తండ్రీ కొడుకుల భావోద్వేగ బంధాన్ని చాటిచెప్పే ఈ పాట సినిమాపై అంచనాలను పెంచింది. డిసెంబర్ 25న రానున్న ఈ చిత్రం విజయం సాధించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.