|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vrusshabha Official Teaser: కింగ్ పాత్రలో మోహన్ లాల్.. టీజర్ వచ్చేసింది

Published: 18-09-2025, 11:55 AM

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ద్విభాషా చిత్రం వృషభ టీజర్ విడుదలైంది. నందకిశోర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

Key Points

1

మోహన్ లాల్ రాజు పాత్రలో కనిపించనున్నారు

2

బాహుబలి తరహా యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి

4

మలయాళం, తెలుగు భాషల్లో విడుదల

వృషభ టీజర్ విడుదల

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న ద్విభాషా చిత్రం వృషభ . ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు . ఈ ఫుల్ యాక్షన్ ‌ మూవీ దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది . ఈ నేపథ్యంలోనే తాజాగా వృషభ టీజర్ ‌ ను మేకర్స్ రిలీజ్ చేశారు . ఈ సినిమాను మలయాళంతో పాటు .. తెలుగులోనూ ఓకేసారి తెరకెక్కించారు . ఈ పాన్ ఇండియా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి .

టీజర్ ‌ చూస్తుంటే ఈ మూవీని పురాణాల నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది . విజువల్స్ , యాక్షన్ సీన్స్ ‌ బాహుబలి తరహాలో మోహన్ లాల్ ‌ ఫ్యాన్స్ ‌ ను ఆకట్టుకుంటున్నాయి . బీజీఎం కూడా టీజర్ ‌ ను మరో రేంజ్ ‌ కు తీసుకెళ్లింది . ఈ చిత్రంలో మోహన్ ‌ లాల్ తొలిసారిగా రాజు పాత్రలో కనిపించనున్నారు . కత్తితో ఫైట్ చేస్తున్న సీన్స్ ‌ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి . కాగా .. ఈ చిత్రంలో సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది కీలక పాత్రల్లో కనిపించనున్నారు . ఈ సినిమాను అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్‌ , కనెక్ట్ట్ మీడియా , బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్ల నిర్మించారు . ఇంకెందుకు ఆలస్యం వృషభ టీజర్ చూసేయండి .

మోహన్ లాల్ రాజుగా

బాహుబలి స్థాయి యాక్షన్

మొత్తంగా, వృషభ టీజర్ అంచనాలను మరింత పెంచింది. మోహన్ లాల్ అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీపావళికి థియేటర్లలో సందడి ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.