|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వైరల్ అవుతున్న స్పిరిట్ ఎడిట్: శివాజీ, అనసూయపై మీమ్స్‌తో నెటిజన్ల రచ్చ!

Published: 04-01-2026, 12:00 AM
వైరల్ అవుతున్న స్పిరిట్ ఎడిట్: శివాజీ, అనసూయపై మీమ్స్‌తో నెటిజన్ల రచ్చ!
  • ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలోని మొదటి పోస్టర్ విడుదల.
  • సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా.
  • శివాజీ, అనసూయల ‘స్పిరిట్’ పోస్టర్ ఎడిట్ సోషల్ మీడియాలో వైరల్.
  • ‘మీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి’ అంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్స్.

ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా పోస్టర్ తరహాలో యాక్టర్ శివాజీ, అనసూయ ఫోటో ఎడిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఎడిటెడ్ ఫోటో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతూ ‘మీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి?’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ప్రభాస్ ‘స్పిరిట్’ పోస్టర్ నేపథ్యం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ‘స్పిరిట్’(Spirit) ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తృప్తి దిమ్రి(Tripthi Dimri) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. అయితే న్యూ ఇయర్ స్పెషల్‌గా ఈ మూవీ నుంచి సందీప్ రెడ్డి ప్రభాస్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ప్రభాస్ షర్ట్ లేకుండా ఒంటి నిండా గాయాలతో ఓ కిటికీ దగ్గర నిల్చుని ఉండగా, హీరోయిన్ తృప్తి దిమ్రి ఆయనకు సిగరెట్ వెలిగిస్తూ కనిపించింది.

వైరల్ అవుతున్న శివాజీ, అనసూయ ఎడిట్

ఈ నేపథ్యంలో స్పిరిట్ పోస్టర్ తరహాలోనే యాక్టర్ శివాజీ, నటి అనసూయ(Anasuya) ఫోటో కూడా సోషల్ మీడియాలో ఎడిట్ చేసి పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట హాట్ టాపిక్‌గా మారగా.. చూసిన నెటిజన్లు మీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి రా అని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా శివాజీ(sivaji) ‘దండోరా;(Dandora) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్స్ పై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపగా అతనికి వ్యతిరేకంగా అనసూయ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్!

A post shared by Memezz and edits (@memezz_n_edits)

మొత్తంమీద, ప్రభాస్ ‘స్పిరిట్’ పోస్టర్‌ను స్ఫూర్తిగా తీసుకొని రూపొందించిన శివాజీ, అనసూయ ఎడిట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఈ సరదా మీమ్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటూ వైరల్‌గా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.