
ఇండస్ట్రీలో సక్సెస్ కి ముందు చాలామంది సెలబ్రిటీలు అవమానాలు ఎదుర్కొంటారు. డైరెక్టర్ VV వినాయక్ జీవితంలో కూడా అలాంటి ఘటనే జరిగింది. గతంలో చులకనగా మాట్లాడిన మేనేజర్, ‘ఆది’ సినిమా హిట్ తర్వాత వినాయక్ డైరెక్టర్ అని తెలిసి ఎలా షాక్ అయ్యాడో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
Key Points
VV వినాయక్ ని గతంలో ఒక మేనేజర్ చులకనగా మాట్లాడారు.
ఆది సినిమా హిట్ అయ్యాక వినాయక్ డైరెక్టర్ అని మేనేజర్ కి తెలిసింది.
త్రివిక్రమ రావు గారు రెస్పెక్ట్ ఇవ్వడంతో మేనేజర్ షాక్ అయ్యాడు.
వినాయక రావు అనే పేరుని వినాయక్ గా మార్చుకున్నారు.
మేనేజర్ తో వినాయక్ తొలి పరిచయం
VV Vinayak : ఇండస్ట్రీలో సక్సెస్ కి ముందు అవమానాలు మాములే. చాలామంది సెలబ్రిటీలు ఒకప్పుడు అవమానాలు, చులకనగా మాట్లాడటం చూసినవాళ్ళే. డైరెక్టర్ వివి వినాయక్ ని కూడా అలాగే చులకన చూసి మాట్లాడిన సందర్భం, ఆ తర్వాత తాను డైరెక్టర్ అని తెలిసి సైలెంట్ అయిన సంగతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.(VV Vinayak)
వివి వినాయక్ మాట్లాడుతూ.. నాగేశ్వర రావు అని ఒక మేనేజర్ ఉన్నారు. గతంలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు బాగా తిట్టి వర్క్ చేయించేవాడు. ఆది సినిమా రిలీజ్ అయి హిట్ అయిన తర్వాత చెన్నకేశవరెడ్డి సినిమా మొదలుపెట్టాను. ఆ సినిమా సెట్ వర్క్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. అది చూడటానికి వెళ్తే ఆ మేనేజర్ అక్కడ కనపడ్డాడు. ఆయన వచ్చి ఏంటి కో డైరెక్టర్ అయిపోయావా అప్పుడే అని సిల్లీగా మాట్లాడాడు.
‘ఆది’ హిట్ తర్వాత మేనేజర్ రియాక్షన్
అప్పుడే నిర్మాత త్రివిక్రమ రావు గారు అక్కడికి వచ్చి డైరెక్టర్ గారు నమస్తే అనగానే ఆ మేనేజర్ షాక్ అయ్యాడు. త్రివిక్రమ రావు గారు నాకు రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడటం, ఆయన సినిమా సెట్ చూపిస్తూ, కాఫీ తెప్పించి ఇవ్వడంతో మేనేజర్ షాక్ లో ఉన్నాడు. ఆ మేనేజర్ ఆయన సినిమాకు చేస్తున్నాడు. ఆయన వెళ్ళిపోయాక మేనేజర్ ఏంటి సంగతి అని అడిగాడు. డైరెక్టర్ అయ్యాను అన్నాడు. ఏ సినిమా అంటే..ఆది అని చెప్పాను. వివి వినాయక్ అంటే నువ్వా అని అడిగాడు. అవును నేనే అన్న. అంతే దెబ్బకు సైలెంట్ అయి వెళ్ళిపోయాడు అని చెప్పుకొచ్చారు.
వివి వినాయక్ అసలు పేరు మార్పు
అయితే వివి వినాయక్ అసలు పేరు వినాయక రావు. దాంతో మొదట అందరికి అలాగే తెలుసు. డైరెక్టర్ అవ్వడంతో వినాయక్ అని పేరు మార్చుకున్నారు.
VV వినాయక్ అనుభవం ఇండస్ట్రీలో సక్సెస్ విలువను తెలియజేస్తుంది. అవమానాలు ఎదుర్కొన్న వారికి అప్రిసియేషన్ లభించినప్పుడు కలిగే ఆనందం అమూల్యమైనది. ఈ సంఘటన సినీ రంగంలో కష్టానికి, ప్రతిభకు లభించే గుర్తింపునకు నిదర్శనం.


