|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వార్‌ 2కు కౌంట్‌డౌన్‌ మొదలు

Published: 26-06-2025, 8:50 PM
వార్‌ 2కు కౌంట్‌డౌన్‌ మొదలు

హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘వార్ 2’ సినిమా విడుదలకు 50 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్లను విడుదల చేశారు.

Key Points

1

హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14న విడుదల.

2

విడుదలకు 50 రోజుల కౌంట్‌డౌన్ ప్రారంభం.

4

నటీనటుల పోస్టర్స్ విడుదలై సినిమాపై ఆసక్తి పెరిగింది.

50 రోజుల కౌంట్‌డౌన్

థియేటర్స్‌లో ‘వార్‌ 2’కి యాభై రోజుల కౌంట్‌డౌన్‌ మొదలైంది. హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ లీడ్‌ రోల్స్‌లో నటించిన స్పై యాక్షన్‌ సినిమా ‘వార్‌ 2’. ‘వైఆర్‌ఎఫ్‌ (యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌)’ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ‘వార్‌ 2’ని అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.

ఐమ్యాక్స్ విడుదల

కాగా ఈ సినిమా విడుదలకు సరిగ్గా 50 రోజులు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, హృతిక్‌ రోషన్, కియారా అద్వానీల పోస్టర్స్‌ను మేకర్స్‌ గురువారం విడుదల చేశారు. అలాగే ‘వార్‌ 2’ సినిమాను ఉత్తర అమెరికా, మిడిల్‌ ఈస్ట్, యూకె, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సౌత్‌ ఈస్ట్‌ ఆసియా సహా భారతదేశంలో ఐమ్యాక్స్‌ థియేటర్లలో విడుదల చేయనున్నట్లుగా కూడా మేకర్స్‌ తెలిపారు.

నటీనటుల పోస్టర్స్

‘‘భారతీయ సినీ పరిశ్రమలో ఇద్దరు సూపర్‌ స్టార్స్‌ హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ల మధ్య జరిగే ఈ అద్భుతమైన పోరును ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో ప్రదర్శించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించనున్నాం’’ అని తెలిపారు యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ డిస్ట్రిబ్యూషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నెల్సన్‌ డిసౌజా. ‘‘యాక్షన్‌’ చిత్రాలకే ‘వార్‌ 2’ సినిమా ఓ పాఠంలా ఉంటుంది. ప్రేక్షకులు మర్చిపోలేని సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఐమ్యాక్స్‌లో మాత్రమే పొందగలరు’’ అని పేర్కొన్నారు ఐమ్యాక్స్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్, డిస్ట్రిబ్యూషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ క్రిస్టఫర్‌ టిల్లా్మన్‌.

వార్ 2 సినిమా విడుదలకు 50 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఐమ్యాక్స్ థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా భారీ అంచనాలను పెంచుతోంది.

Related News

బోనీ టైలర్ మరణం: సంగీత ప్రపంచంలో పెను విషాదం! కిరాణా షాపు నుంచి గ్లోబల్ స్టార్‌గా.. షాకింగ్!
కార్తీక దీపం 2: సూరజ్-జ్యోత్స్న భార్యాభర్తలా? దీపకు మాలిని అదిరిపోయే ఆఫర్! కార్తీక్ కు షాకే షాక్!
షాకింగ్ ట్విస్ట్! రాజును చంపేందుకు రేఖ కుట్ర? దుగ్గిరాల వారసుడి రహస్యం లీక్ చేసిన చలపతి!
OTTలో ఊచకోత! ఇవాళే 22 కొత్త సినిమాలు, 14 అదిరిపోయేవి, తెలుగులో 8 ట్రెండింగ్ – ఒకే ప్లాట్‌ఫామ్‌లో 7! హారర్ నుండి క్రైమ్ వరకు మాస్ జాతర!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజుకు అమూల్య బిగ్ షాక్! వల్లి పగ రగిలిపోతుంది - సీరియల్ లో ఊహించని ట్విస్ట్!
88 ఏళ్ల వయసులో ANR షాకింగ్ కామెంట్స్! మిల్క్ బ్యూటీ తమన్నాపై మనసుపడ్డ నటసామ్రాట్, అసలు ఏమైందంటే...
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.