
📌 Key Points
- ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం 18 కిలోల బరువు తగ్గారు.
- ఈ సినిమా కోసం ఎన్టీఆర్ లుక్ అభిమానులను ఆశ్చర్యపరిచింది.
- జార్జియాలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో హైదరాబాద్‌లో జరగనుంది.
- ఎన్టీఆర్ బరువు తగ్గడం వెనుక పర్ఫెక్ట్ డైట్, ఎక్సర్సైజ్ ఉన్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం ఏకంగా 18 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్ కొత్త లుక్ వెనుక కథేమిటి?
Jr NTR:సాధారణంగా మిగతా హీరోలతో పోల్చుకుంటే ఎన్టీఆర్ (NTR ) ఎక్కువగా తన సినిమాలోని పాత్ర కోసం తనని తాను ఏ రేంజ్ లో మార్చుకుంటాడో అందరికీ తెలిసిందే. కొన్నేళ్ల క్రితం ఆది, నా అల్లుడు, రాఖీ సినిమాల సమయంలో చాలా లావుగా ఉండి.. సినిమాలు చేసిన ఎన్టీఆర్ అప్పుడు విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కంత్రి సినిమాలో బక్కచిక్కిపోయి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈయన.. టెంపర్ సినిమా కోసం పర్ఫెక్ట్ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక టెంపర్ మూవీ నుంచి అదే ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.. అయితే ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ ఇంకా దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈవారం ఆఖరిలో హైదరాబాద్ శివారులలో షూటింగ్ జరుపుకోబోతోంది.
ఇక ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అక్కడక్కడ బయట కనిపిస్తున్న ఎన్టీఆర్ లుక్ తో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మొదటిసారి ఎన్టీఆర్ తన బావమరిది నార్నే నితిన్ (Narne Nithin) పెళ్లి వేడుకల్లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. దీంతో ఎన్టీఆర్ కు ఏమైంది? ఎందుకు అంత బక్క చిక్కిపోయారు? అంటూ అభిమానులు కూడా కంగారుపడ్డారు. కానీ ఇదంతా ప్రశాంత్ నీళ్ సినిమాలోని పాత్ర కోసం అని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి తోడు ఇటీవల బెంగళూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కి వచ్చిన ఈయన.. అక్కడ మరీ సన్నగా కనిపించాడు. ఎన్టీఆర్ ఫోటోలు, వీడియోలు ఆ ఈవెంట్ నుంచి వైరల్ గా మారాయి.
ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నారు?
అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 18 కిలోల బరువు తగ్గాడట. అది కూడా కేవలం 5 నెలల్లోనే.. పర్ఫెక్ట్ డైట్, ఎక్సర్సైజ్ తో ఎన్టీఆర్ ఈ బరువు తగ్గినట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రశాంత్ నీళ్ సినిమాలో ఎన్టీఆర్ తన పాత్ర కోసం ఈ రేంజ్ లో బరువు తగ్గాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే ప్రశాంత్ నీళ్.. ప్రభాస్, యశ్ లను కూడా కాస్త ఫిట్ బాడీతో పర్ఫెక్ట్ గా చూపించాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం మరీ సన్నబడిపోయాడు. డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ ని ఎలా చూపిస్తాడు అని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను జూన్ 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి ఈ సినిమా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.
బరువు తగ్గేందుకు ఎన్టీఆర్ డైట్ ప్లాన్ ఏమిటి?
డ్రాగన్ సినిమా షూటింగ్ అప్డేట్ విషయానికి వస్తే.. జార్జియాలో ఎన్టీఆర్, టోవినో థామస్ మధ్య కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారట. అలాగే హైదరాబాదు శివార్లలో దాదాపు మూడు సెట్లు వేశారు.. పైగా ఈ సెట్ లలో ఒకటి విలన్ ఇంటి కోసం కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఇక్కడ షూటింగ్ పూర్తి అయిన తర్వాత మళ్ళీ శ్రీలంకలో తదుపరి షూటింగ్ ప్రారంభించినట్లు సమాచారం.
మొత్తానికి ఎన్టీఆర్ తన సినిమా కోసం ఎంత కష్టపడైనా పాత్రలో జీవిస్తారని మరోసారి నిరూపించారు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


