|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ధనుష్‌తో మృణాల్ ప్రేమాయణం నిజమేనా? రూమర్లపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

Published: 16-02-2026, 12:35 AM
ధనుష్‌తో మృణాల్ ప్రేమాయణం నిజమేనా? రూమర్లపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
  • మృణాల్ ఠాకూర్ ఎఫైర్ రూమర్స్‌తో వార్తల్లో నిలుస్తున్నారు.
  • ధనుష్‌తో ఫిబ్రవరి 14న మృణాల్ వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్.
  • రూమర్స్‌పై స్పందిస్తూ ఫ్రీ పబ్లిసిటీ వస్తోందని మృణాల్ కామెంట్.
  • ట్రోలర్స్‌కు ఇన్డైరెక్టుగా కౌంటర్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్.

మృణాల్ ఠాకూర్ గత కొంతకాలంగా ధనుష్‌తో ప్రేమలో ఉన్నారనే రూమర్స్‌తో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ రూమర్స్‌పై స్పందిస్తూ, తనకు ఫ్రీ పబ్లిసిటీ వస్తోందని ఆమె అన్నారు. ట్రోలర్స్‌కు ఆమె కౌంటర్ ఇచ్చారు.

మృణాల్ ఠాకూర్‌పై వస్తున్న రూమర్స్

Mrunal Thakur:’సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) గత కొద్ది రోజులుగా సినిమాల కంటే కూడా ఎఫైర్ రూమర్స్ తో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush ) తో ప్రేమలో ఉందని.. ఈ ఫిబ్రవరి 14వ తేదీన వివాహం కూడా చేసుకోబోతోంది అంటూ గత రెండు నెలలుగా వార్తలు ఏ రేంజ్ లో వినిపించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సినిమాలు లేకపోయినా మృణాల్ కి ఈ రూమర్సే ఊహించని పాపులారిటీని అందించి పెట్టాయని చెప్పవచ్చు. అయితే ఈ రూమర్లపై ఎప్పటికప్పుడు స్పందించిన ఈమె ఇప్పుడు తనకు ఫ్రీ పబ్లిసిటీ లభిస్తోంది అంటూ కామెంట్లు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ తెలుగులో అడివి శేష్ (Adivi shesh) హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మరొకవైపు హిందీలో సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ‘ధో దీవానే షెహర్ మే’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 20వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టిన ఈ ముద్దుగుమ్మ.. అందులో భాగంగానే తనపై వస్తున్న రూమర్స్ గురించి స్పందించి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఫ్రీ పబ్లిసిటీ అంటున్న మృణాల్

తాజాగా ఈ రూమర్స్ పై మృణాల్ మాట్లాడుతూ..” నా వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారం చూసి నేను అసలు విసుగు చెందడం లేదు. ఎందుకంటే నేను పీఆర్ టీం ను కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పెట్టుకున్న సరే నాకు ఇంత పాపులారిటీ, పబ్లిసిటీ వచ్చేది కాదు. అందుకే నా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారందరికీ కూడా నేను పెద్ద థ్యాంక్స్ చెబుతున్నాను” అంటూ చమత్కరించింది మృణాల్ ఠాకూర్ . మొత్తానికైతే కోట్లు ఖర్చుపెట్టి పీఆర్ టీమ్స్ పెట్టుకొని పబ్లిసిటీ చేసుకుంటున్న ఎంతోమంది సెలబ్రిటీలకు , అలాగే తనపై తప్పుడు కథనాలు వల్లిస్తున్న ట్రోలర్స్ కి ఇన్డైరెక్టుగా మరోసారి కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా తనకు మాత్రం ఇలాంటి పిఆర్ టీంలు లేకపోయినా తనపై సృష్టించే తప్పుడు వార్తలే తనకు ఊహించని పాపులారిటీని తెచ్చి పెడతాయని చెప్పుకొచ్చింది.

ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

ఇకపోతే ధనుష్ తో పెళ్లి అంటూ వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేసింది. ” ఫిబ్రవరి 14వ తేదీని చూస్తుంటే నాకు ఏప్రిల్ ఒకటిలా అనిపిస్తోంది. ఎందుకంటే ఆ రోజు ఫూల్స్ డే కాబట్టి ధనుష్ తో పెళ్లి అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఆ సమాచారాన్ని మీకు చేరవేసే మొదటి వ్యక్తిని కూడా నేనే అవుతాను. నాకు పెళ్లి నిశ్చయమైతే కచ్చితంగా మీతో ఆ విషయాన్ని పంచుకుంటాను” అంటూ అప్పటివరకు వచ్చే రూమర్లను ఎవరు నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి అయితే మృణాల్ ఠాకూర్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మొత్తానికి మృణాల్ తనపై వస్తున్న రూమర్స్‌ను పాజిటివ్‌గా తీసుకుని, ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. తన తప్పు వార్తలే తనకు ఊహించని పాపులారిటీని తెచ్చిపెడతాయని ఆమె పేర్కొన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.