
📌 Key Points
- రామ్ చరణ్ దంపతులకు అపోలో ఆసుపత్రిలో కవలలు జన్మించారు.
- కూతురు ఫోటోలు, వీడియోలు తీయడంపై రామ్ చరణ్ టీమ్ సీరియస్ హెచ్చరికలు జారీ చేసింది.
- ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కాపీరైట్ స్ట్రైక్స్ వేస్తామని హెచ్చరించారు.
- మెగా అభిమానులు పాప ఫోటోలను సర్కులేట్ చేయవద్దని కోరారు.
మెగాస్టార్ చిరంజీవి మనవరాలు, రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా కొణిదెల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రామ్ చరణ్ టీమ్ వాటిని షేర్ చేయకూడదని సీరియస్ గా హెచ్చరించింది. కాపీరైట్ స్ట్రైక్స్ కూడా వేస్తామని తెలిపింది.
రామ్ చరణ్ కూతురు జననం, వైరల్ అవుతున్న వీడియోలు
Ram Charan: మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ దంపతులకు కవలలు జన్మించిన విషయం తెలిసిందే. ఆమె అపోలో ఆసుపత్రిలో పండంటి పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఆమెను చూడటానికి రామ్ చరణ్ ఆసుపత్రికి వెళ్లారు. దీంతో అక్కడకు వచ్చిన అభిమానులు కొంతమంది రామ్ చరణ్ కూతురుని ఫోటోలు వీడియోలు తీశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెగా వారసురాలు క్లిన్ కారా కొణిదెల ప్రైవసీ విషయంలో రామ్ చరణ్ టీమ్ మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. పాపకు సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలను సోషల్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ పోస్ట్ చేస్తే కాపీరైట్ స్ట్రైక్స్ (Copyright Strikes) వేస్తామని హెచ్చరించింది.
Read also- Alia Bhatt: వదిలేయాలి అనుకున్నాను.. పర్సనల్ లైఫ్ గురించి ఆలియా భట్ సెన్సేషనల్ వ్యాఖ్యలు..
ఫోటోలు, వీడియోలపై రామ్ చరణ్ టీమ్ హెచ్చరిక
అసలేం జరిగింది? ఈరోజు అపోలో హాస్పిటల్ దగ్గర రామ్ చరణ్ కుటుంబం కనిపించిన సమయంలో, అక్కడ ఉన్న అభిమానుల అత్యుత్సాహం వల్ల క్లిన్ కారా విజువల్స్ మీడియా కెమెరాలకు దొరికాయి. సాధారణంగా చరణ్ దంపతులు తమ పాప ముఖం స్పష్టంగా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, అనూహ్యంగా ఈరోజు కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. క్లిన్ కారా ఇంకా చిన్న పాప కావడంతో, ఆమె ప్రైవసీని గౌరవించాలని చరణ్ టీమ్ కోరుతోంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆ విజువల్స్‌ను పబ్లిష్ చేస్తే, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే వారి ఛానల్స్ లేదా అకౌంట్లపై లీగల్ గా కాపీరైట్ స్ట్రైక్స్ వేస్తామని స్పష్టం చేశారు. కేవలం సోషల్ మీడియా వినియోగదారులకే కాకుండా, మెయిన్ స్ట్రీమ్ మీడియా మరియు యూట్యూబ్ ఛానల్స్‌కు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. మెగా అభిమానులు కూడా ఈ విషయంలో సహకరించాలని, పాప ఫోటోలను సర్కులేట్ చేయవద్దని చరణ్ సన్నిహితులు కోరుతున్నారు.
కాపీరైట్ స్ట్రైక్స్ గురించి రామ్ చరణ్ టీమ్ ప్రకటన
Read also- Nagarjuna 100: దసరా రేసులోకి మన్మథుడి వందో సినిమా.. కింగ్ కోసం రెడీ అవుతున్న హీరోయిన్లు..
క్లిన్ కారా ప్రైవసీని కాపాడాలని, ఆమె ఫోటోలు, వీడియోలను షేర్ చేయకుండా సహకరించాలని రామ్ చరణ్ టీమ్ కోరుతోంది. ఈ విషయంలో మెగా అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.


