|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

`వార్‌ 2`కి నెగటివ్‌ టాక్‌.. ఆగిపోయిన ఎన్టీఆర్‌ కొత్త సినిమా ?, అదే దారిలో మరో మూవీ?

Published: 16-08-2025, 10:50 AM
`వార్‌ 2`కి నెగటివ్‌ టాక్‌.. ఆగిపోయిన ఎన్టీఆర్‌ కొత్త సినిమా ?, అదే దారిలో మరో మూవీ?

ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందనను పొందింది. మొదటి రోజు భారీ కలెక్షన్స్ ఉన్నా, నెగటివ్ టాక్ సినిమా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన కొత్త సినిమాను పక్కన పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Key Points

1

ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’కి నెగటివ్ టాక్ వస్తుంది.

2

సినిమా బాక్స్ ఆఫీస్ వసూళ్లు మొదటి రెండు రోజుల్లో భారీగా ఉన్నాయి.

4

‘వార్ 2’ ఫలితం ‘దేవర 2’ నిర్ణయంపై ప్రభావం చూపిందని అనుమానం.

‘వార్ 2’ కి మిశ్రమ స్పందన

ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి `వార్‌ 2` చిత్రంలో నటించారు. యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ నుంచి వచ్చిన స్పై యాక్షన్‌ మూవీ ఇది. హృతిక్‌ రోషన్‌ మరో హీరోగా నటించారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ బాలీవుడ్‌ మూవీ ఈ గురువారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే మిశ్రమ స్పందన రాబట్టుకుంది. బాలీవుడ్‌ స్పై మూవీస్‌ నార్త్ ఆడియెన్స్ ని బాగానే ఆకట్టుకుంటాయి. కానీ ఈ చిత్రానికి నార్త్ ఆడియెన్స్ నుంచి కూడా నెగటివ్‌ టాక్‌ రావడం గమనార్హం.

ఇక ఎన్టీఆర్‌ ఉండటంతో తెలుగులో ఓపెనింగ్స్ భారీగానే రాబట్టింది. `వార్‌ 2` మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.80కోట్లు రాబట్టింది. రెండో రోజు కూడా సుమారు రూ.80కోట్లు వసూళు చేసినట్టు సమాచారం. హిందీలో రూ.75కోట్లు, తెలుగులో రూ.40కోట్లు రాబట్టిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రెండో రోజు కూడా ఈ రేంజ్‌లో కలెక్షన్లు ఉన్నాయంటే మామూలు విషయం కాదు. కానీ మూడు, నాలుగో రోజు వసూళ్లు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీకెండ్‌ వరకు ఉన్నంతలో బెటర్‌గానే కలెక్షన్లు ఉంటాయి. కానీ ఓవరాల్‌గా ఈ మూవీ పరిస్థితి ఏంటనేది క్లారిటీ రావాల్సి ఉంది. ట్రేడ్‌ వర్గాల ప్రకారం ఈ చిత్రం హిట్‌ ఖాతాలో పడటం డౌటే అని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా హిట్‌ కావాలంటే సుమారు రూ.700కోట్ల గ్రాస్‌ రావాలి.

ఎన్టీఆర్ కొత్త సినిమాపై సందేహాలు

`వార్‌ 2` చిత్రానికి మేజర్‌గా నెగటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. ఎన్టీఆర్‌ ఫ్యాన్సే డిజప్పాయింట్‌ అయినట్టుగా తెలుస్తోంది. చాలా మంది ఓపెన్‌గానే పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్‌ ఒక షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన కొత్త సినిమాని పక్కన పెట్టారట. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. దీనికి `డ్రాగన్‌` అనే పేరు వినిపిస్తోంది. ఆ తర్వాత `దేవర 2` చేయాల్సి ఉంది. మరోవైపు ఇటీవలే హిందీలోనే యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ లో మరో స్పై మూవీ చేయబోతున్నట్టు హింట్‌ ఇచ్చాడు. అలాగే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది తారక్‌.

ఈ క్రమంలో ఇప్పుడు `దేవర 2` మూవీని పక్కన పెట్టారట ఎన్టీఆర్‌. `దేవర` సినిమాకే అప్పుడు మిశ్రమ స్పందన లభించింది. ఇది నార్త్ లోనే బాగా ఆడింది. దీంతో హిట్‌ ఖాతాలో పడింది. కానీ `వార్‌ 2` రిజల్ట్ చూశాక ఎన్టీఆర్‌ `దేవర 2` వద్దు అనుకున్నారట. దర్శకుడు కొరటాలతో ఈ మూవీకి సంబంధించిన చర్చలు కూడా జరిగాయని, ప్రాజెక్ట్ ని క్యాన్సల్‌ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అదే సమయంలో యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ లో మరో స్పై యాక్షన్‌ మూవీ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని కూడా పక్కన పెట్టినట్టు సమాచారం. మొత్తంగా `వార్‌ 2` రిజల్ట్ రెండు సినిమాలను ప్రశ్నార్థకంగా మార్చేసిందని చెప్పొచ్చు.

‘దేవర 2’ భవిష్యత్తు ఏమిటి?

ఇక ప్రస్తుతం తారక్‌.. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `డ్రాగన్‌` మూవీ చిత్రీకరణ దశలో ఉంది. రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ బెంగాల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో మాఫియా నేపథ్యంలో సాగుతుందని, ఇందులో తారక్‌ గ్యాంగ్‌ స్టర్‌గా కనిపిస్తారని సమాచారం. అనంతరం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందే సినిమాలో ఎన్టీఆర్‌ నటించనున్నారు. ఇది మైథలాజికల్‌ కథాంశంతో రూపొందుతుందని టాక్.

‘వార్ 2’ ఫలితం ఎన్టీఆర్ భవిష్యత్ ప్రాజెక్టులపై ప్రభావం చూపుతుందని అనిపిస్తుంది. ‘దేవర 2’ నిర్ణయం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. సినిమా ప్రేక్షకుల ప్రతిస్పందన చాలా కీలకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.