
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ సినిమా థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 9 నుంచి ‘వార్ 2’ స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ.
Key Points
వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్, జూ. ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
థియేటర్లలో రూ.250 కోట్లకు పైగా వసూలు చేయలేక 'వార్ 2' డిజాస్టర్‌గా నిలిచింది.
నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 9 గురువారం నుంచి 'వార్ 2' సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఎన్టీఆర్ తదుపరి చిత్రం ప్రశాంత్ నీల్‌తో 'డ్రాగన్' పేరుతో పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతోంది.
వార్ 2 ఓటీటీ రిలీజ్ వివరాలు
War 2 OTT: బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా(War 2 OTT) విడుదల తరువాత మాత్రం నిరాశపరిచింది. రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కనీసం రూ.250 కోట్లు కలెక్ట్ చేయలేక డిజాస్టర్ గా నిలిచింది. అలాగే, ఎన్టీఆర్ లుక్ పై, యాక్టింగ్ పై తీవ్రమైన ట్రోలింగ్ నడిచింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ అయ్యారు.
Rashmika Mandanna: నా వ్యక్తిగత విషయాలు మీకెందుకు చెప్పాలి.. అన్నీ సోషల్ మీడియాలో పంచుకోలేను: రష్మిక మందన్న
థియేటర్లలో నిరాశపరిచిన వార్ 2
ఇక ఆగస్ట్ 14న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. తాజాగా దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా విడుదల అయ్యింది. వార్ 2 ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 9 గురువారం నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో, ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. అయితే, ఈ సినిమాకు ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, వార్ 2 సినిమాకు థియేటర్స్ లో డిజాస్టర్ టాక్ రావడంతో చాలా మంది ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. కాబట్టి, ఓటీటీలో ఎక్కువమంది చూసే అవకాశం ఉంది.
ఎన్టీఆర్ తదుపరి సినిమా డ్రాగన్
ఇక ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. పాన్ వరల్డ్ లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొదలైన ఈ సినిమా అవుట్ ఫుట్ ఒక రేంజ్ లో వస్తోందట. ప్రశాంత్ నీల్ గత చిత్రాలు కేజీఎఫ్, సాలార్ కి మించి ఈ సినిమా ఉండబోతుంది అనే టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
థియేటర్లలో నిరాశపరిచిన ‘వార్ 2’ ఓటీటీలో మంచి రెస్పాన్స్ పొందుతుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఓటీటీలో ఈ సినిమాను చూడటానికి సిద్ధంగా ఉన్నారు. తదుపరి ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాపై భారీ అంచనాలున్నాయి.


