
హాలీవుడ్ సినిమా “వెపన్స్” బాక్స్ ఆఫీస్ వద్ద రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మిస్టరీ హారర్ చిత్రం త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది.
Key Points
రూ.2 వేల కోట్ల వసూళ్లు సాధించిన "వెపన్స్" సినిమా ఓటీటీలోకి!
సెప్టెంబర్ 9 నుంచి నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్!
అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్, వుడు, గూగుల్ ప్లేలో అందుబాటులోకి!
థియేటర్లలో విడుదల అయినా కూడా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం!
వెపన్స్ సినిమా ఓటీటీ విడుదల
హాలీవుడ్ నుంచి ఈ ఏడాది వచ్చిన మరో సూపర్ హిట్ మిస్టరీ హారర్ మూవీ వెపన్స్ (Weapons). ఈ సినిమా ఆగస్టు 8న థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.2 వేల కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇంకా దూసుకెళ్తూనే ఉంది. అయితే ఈ సినిమాను అప్పుడే ఓటీటీలోకి తీసుకొస్తున్నారు.
మిస్టరీ హారర్ మూవీ వెపన్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. వచ్చే మంగళవారం అంటే సెప్టెంబర్ 9 నుంచి ఈ సినిమా ఒకేసారి నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి అడుగుపెట్టనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో తోపాటు ఆపిల్ టీవీ ప్లస్, వుడు (Vudu), గూగుల్ ప్లేలలోకి అందుబాటులోకి రానుంది.
నాలుగు ప్లాట్‌ఫామ్స్‌లో ఏకకాలంలో స్ట్రీమింగ్
అయితే ఇది వీడియో ఆన్ డిమాండ్ గా రానుంది. అంటే మూవీ చూడాలంటే రెంట్ చెల్లించాల్సిందే. ఇప్పటికీ థియేటర్లలో ఈ వెపన్స్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది. వసూళ్ల పరంగా దూసుకెళ్తూనే ఉంది. కానీ అప్పుడే రెంట్ విధానంలో అయినా ఓటీటీలోకి తీసుకురానుండటం విశేషం.
మిస్టరీ హారర్ మూవీ వెపన్స్ ను 3.8 కోట్ల డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ.335 కోట్లతో తెరకెక్కించారు. అయితే ఇప్పటికే ఈ మూవీ 23.5 కోట్ల డాలర్లు అంటే సుమారు రూ.2 వేల కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాను జాక్ క్రెగర్ డైరెక్ట్ చేశాడు. జోష్ బ్రోలిన్, జూలియా గార్నర్, ఆస్టిన్ అబ్రామ్స్, కేరీ క్రిస్టోఫర్, టోబీ హస్ లాంటి వాళ్లు నటించారు.
రూ.2 వేల కోట్ల వసూళ్లు
ఈ మూవీ స్టోరీ భిన్నంగా ఉంటుంది. ఒకే క్లాస్ కు చెందిన ఒక్క స్టూడెంట్ తప్ప మిగిలిన వాళ్లందరూ ఒకే రాత్రి ఒకే సమయానికి కనిపించకుండా పోతారు. ఇది అక్కడి వాళ్లకు అంతుబట్టదు. అసలు వాళ్లు ఏమయ్యారు? ఎక్కడికి వెళ్లారన్నది తెలుసుకోవడమే ఈ మూవీ స్టోరీ. ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 7.8 రేటింగ్ ఉంది. మరి ఈ వెపన్స్ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
వెపన్స్ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతూనే, ఓటీటీలో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి స్పందనను పొందుతుందో చూడాలి.


