
📌 Key Points
- కన్నడ, తమిళ సీరియల్ నటి నందిని సీఎం బెంగళూరులో ఆత్మహత్య చేసుకుంది.
- పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి తేవడమే ప్రధాన కారణంగా సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
- ఇతర సమస్యల కారణంగా తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు కూడా వెల్లడించింది.
- ఆమె ‘గౌరి’ సీరియల్‌తో తెలుగు, తమిళ ప్రేక్షకులకు, కన్నడలో పలు సీరియల్స్‌తో గుర్తింపు పొందింది.
కన్నడ, తమిళ సీరియల్స్ లో గుర్తింపు పొందిన నటి నందిని ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులో జరిగిన ఈ ఘటనతో అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. తల్లిదండ్రులు పెళ్లి కోసం ఒత్తిడి తేవడం, డిప్రెషన్ కారణాలుగా సూసైడ్ నోట్ లో పేర్కొంది.
నందిని ఆత్మహత్య: ఘటన వివరాలు, కారణాలు
పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురావడంతో కన్నడ సీరియల్ నటి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. కన్నడ మరియు తమిళ సీరియల్స్ లో నటిస్తున్ననందిని సీఎం బెంగుళూరులోని తన నివాసంతో ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ లో తన తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని.. దానికి మానసికంగా తాను సిద్ధంగా లేనని పేర్కొంది. అంతే కాకుండా ఇరత సమస్యల కారణంగా డిప్రెషన్ తోనూ బాధపడుతున్నట్టు పేర్కొంది. కాగా నంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతిగా తెలుస్తోంది.
కానీ తమిళ, కన్నడ సీరియల్స్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తమిళంలో ఆమె నటించిన గౌరి సీరియల్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సీరియల్ లో కనకదుర్గ పాత్రలో డబుల్ రోల్ చేసి ప్రేక్షకులను అలరించింది. దీంతో పాటు కన్నడలో జీవా హూవాగిడే, సంఘర్ష, మధుమగలు లాంటి సీరియల్స్ లో ముఖ్యమైన పాత్రల్లో నటించింది. నటి మృతితో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
నందిని నేపథ్యం, నటించిన ప్రముఖ సీరియల్స్
అభిమానుల శోకం, పరిశ్రమ స్పందన
పెళ్లి ఒత్తిడి, మానసిక సమస్యలు ఒక యువ సినీ తార ప్రాణాన్ని బలిగొన్నాయి. నందిని మృతి విచారకరం, ఆమె కుటుంబానికి, అభిమానులకు మా ప్రగాఢ సానుభూతి.

