
ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచెత్తిన వెడ్నెస్డే సీజన్ 2 రెండో భాగం విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. జెన్నా ఒర్టెగా నటనతో ఈ హారర్ థ్రిల్లర్ ఆకర్షణీయంగా ఉంటుంది.
Key Points
వెడ్నెస్డే సీజన్ 2 పార్ట్ 2 సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది.
పార్ట్ 2లో 8 ఎపిసోడ్లు ఉంటాయి.
జెన్నా ఒర్టెగా నటించిన ఈ హారర్ థ్రిల్లర్ అభిమానులను ఉత్కంఠలో ముంచుతుంది.
పార్ట్ 1 క్లైమాక్స్‌లోని ఉత్కంఠకు పార్ట్ 2లో తెరపడుతుంది.
వెడ్నెస్డే సీజన్ 2 రిలీజ్ డేట్
ఉత్కంఠకు తెరపడనుంది. ఆడియన్స్ సూపర్ థ్రిల్ అందిస్తూ సాగుతున్న వెడ్నెస్ డే సీజన్ 2లో పార్ట్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ కు ముహూర్తం ఖరారైంది. ఈ గ్లోబల్ ట్రెండింగ్ వెబ్ సిరీస్ రెండో సీజన్ పార్ట్ 2 ఓటీటీలోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఫస్ట్ పార్ట్ ఆగస్టు 6న ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
అమెరికన్ హారర్ థ్రిల్లర్ సిరీస్ వెడ్నెస్ డే సీజన్ 2 పార్ట్ 1 ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆగస్టు 6న ఈ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది. ఈ ఫస్ట్ పార్ట్ లో 4 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ పార్ట్ లోని 8 ఎపిసోడ్లు కూడా రిలీజ్ కాబోతున్నాయి. సెప్టెంబర్ 3న ఈ సెకండ్ పార్ట్ ఓటీటీ లో విడుదలవుతుంది. వెడ్నెస్ డే సీజన్ 2 ఆడియన్స్ ను తిరిగి నెవర్మోర్ అకాడమీకి తీసుకెళ్లింది. జెన్నా ఒర్టెగా నేతృత్వంలోని ఈ సిరీస్ అభిమానులను ఆడమ్స్ కుటుంబం, ప్రధాన పాత్ర అయిన వెడ్నెస్ డే భయానక ప్రపంచానికి తిరిగి తీసుకువస్తుంది.
వెడ్నెస్ డే సీజన్ 2 ఫస్ట్ పార్టు క్లైమాక్స్ లో ఉత్కంఠ నెలకొంది. ఆ సస్పెన్స్ కు తెరదించేందుకు సెకండ్ పార్టు ఇప్పుడు రాబోతుంది. వెడ్నెస్ డే సీజన్ 2లోని పార్ట్ 2లో ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నాయి. పార్ట్ 1 కింద నాలుగు విడుదలయ్యాయి. న్యూస్ వీక్ ప్రకారం.. ఈ ఎపిసోడ్ టైటిల్స్ ను అవుట్ లెట్ ఇంకా వెల్లడించలేదు. కానీ స్ట్రీమింగ్ డేట్ ను మాత్రం నెట్‌ఫ్లిక్స్ రివీల్ చేసింది.
ఎనిమిది కొత్త ఎపిసోడ్లు
వెడ్నెస్ డేను ఎవరు వెంబడిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించడం, తన స్నేహితురాలు ఎనిడ్ (ఎమ్మా మైయర్స్) ప్రాణాలను కాపాడటానికి పోరాటం, స్థానిక మానసిక ఆసుపత్రి అయిన విల్లో హిల్ లో జరుగుతున్న ఒక భయంకరమైన పథకం గురించి దర్యాప్తు చేయడం.. తదితర విషయాలతో పార్ట్ 1న సాగుతోంది.
కాస్మోపాలిటన్ ప్రకారం.. వెడ్నెస్ డే, అంకుల్ ఫెస్టర్ ఆసుపత్రి క్రింద ఎల్ఓఐఎస్ అనే పేరుతో ఉన్న రహస్య బంకర్ ను కనుగొంటారు. ఈ ప్రదేశంలో అనేక మంది వేరే వాళ్లు ఉంటారు. వాళ్లు చనిపోయారని అనుకుంటారు. కానీ వాస్తవానికి వారిని ప్రయోగాల కోసం ఉపయోగిస్తారు. టైలర్ ది హైడ్ (హంటర్ డూహాన్) కూడా బంకర్ నుండి విడుదలై వెడ్నెస్ డే ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ట్రై చేయడంతో ఎపిసోడ్ ఒక కొండపై ముగుస్తుంది. చివరి సన్నివేశంలో ఆమెను కిటికీలోంచి బయటకు విసిరేస్తారు. ముగింపు సన్నివేశాల్లో వెడ్నెస్ డే ఫ్యూచర్ పై సందేహాలు వ్యక్తమవుతాయి.
ఉత్కంఠభరిత కథాంశం
వాయిస్ ఓవర్ వెడ్నెస్ డే మరణాన్ని పరోక్షంగా ధృవీకరించింది. ‘చావును ముఖంలో చూడాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. కానీ నా చివరి క్షణాల్లో అమ్మ మాటలు నా చెవుల్లో మోగుతున్నాయి. బహుశా నేను పరిస్థితిని మరింత దిగజార్చాను. అంతకంటే దారుణం’ అని అంటుంది. ఈ పరిస్థితి నుంచి వెడ్నెస్ డే ఎలా బయటపడుతుందో తెలియాలంటే సెప్టెంబర్ 3 వరకు ఆగాల్సిందే.
వెడ్నెస్ డే సీజన్ 2 పార్ట్ 2లో లేగా గాగా కూడా కనిపించనుంది. ఈ పాపులర్ పాప్ స్టార్ నెవర్మోర్ అకాడమీలో ఒక మిస్టీరియస్ పాత్రను పోషిస్తుంది.
వెడ్నెస్డే సీజన్ 2 పార్ట్ 2 తో ఉత్కంఠకు తెరపడనుంది. సెప్టెంబర్ 3న విడుదలయ్యే ఈ పార్ట్‌లో ఎనిమిది కొత్త ఎపిసోడ్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆశిద్దాం.


