|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వాట్సాప్ డేంజర్: సీఈఓల పేరుతో సైబర్ దందా! మీ డబ్బులు ఖాళీ అయ్యేలోపే మేల్కోండి!

Published: 04-04-2026, 1:35 AM
వాట్సాప్ డేంజర్: సీఈఓల పేరుతో సైబర్ దందా! మీ డబ్బులు ఖాళీ అయ్యేలోపే మేల్కోండి!
  • సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా కొత్త మోసాలకు పాల్పడుతున్నారు.
  • సంస్థల సీఈఓల పేరుతో అకౌంటెంట్లను తప్పుదారి పట్టించి డబ్బులు కాజేస్తున్నారు.
  • హైదరాబాద్‌లో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని పోలీసులు హెచ్చరించారు.
  • సమాచారం నమ్మేముందు పై అధికారులకు ఫోన్ చేసి ధృవీకరించుకోవాలని సూచన.

ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. వ్యాపార సంస్థల అధినేతలు, సీఈఓల పేరుతో అకౌంటెంట్లను మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు.

వాట్సాప్ ద్వారా సైబర్ మోసాలెలా?

వ్యాపార సంస్థల అధినేతలు, సీఈఓలు, సీఎఫ్ఓలు, అకౌంటెంట్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త మోస్తాల(Whatsapp Impersonation Fraud)కు తెరలేపారు. సంస్థల అధికారిక ఈమెయిల్స్‌కు హానికరమైన ఫిషింగ్ లింకులు పంపడం ద్వారా కంప్యూటర్లలోకి మాల్వేర్‌ను ప్రవేశపెడుతున్నారు. ఫలితంగా సిస్టమ్స్‌పై పూర్తి స్థాయి రిమోట్ యాక్సెస్‌ను పొందుతున్నారు.

సిస్టమ్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత…. అందులో యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను ఉపయోగించి సీఈఓ లేదా సీఎఫ్ఓల పేరుతో అకౌంటెంట్లకు తప్పుదారి పట్టించే సందేశాలను పంపిస్తున్నారు. తాను అత్యవసర సమావేశంలో ఉన్నానని, ఫోన్ ఎత్తడం వీలుపడదని నమ్మబలుకేలా సందేశాలు పంపుతారు. సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలతో కోట్లాది రూపాయలను తక్షణమే సైబర్ నేరగాళ్లు తమ ఖాతాలకు బదిలీ చేయించుకుంటున్నారు.

కంపెనీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వ్యాపార సంస్థల అధినేతలు, సీఈఓలు, సీఎఫ్ఓల ఫోన్ నంబర్ల నుంచే అకౌంటెంట్లను సందేశాలు వస్తుండటంతో నిజమేనని డబ్బును పంపుతున్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటువంటి కేసులు నమోదవుతున్న నేపథ్యంలో…. ప్రతి కంపెనీ కూడా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరించారు.

“వాట్సాప్‌లో పై అధికారుల పేరుతో వచ్చే ఆర్థిక అభ్యర్థనలను గుడ్డిగా నమ్మకూడదు. వెంటనే వారికి నేరుగా ఫోన్ చేసి ఆ మెసేజ్ నిజమేనా కాదా అని ధృవీకరించుకోవాలి. ఆఫీసు సిస్టమ్స్‌లో నాణ్యమైన ఫైర్‌వాల్స్, యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసి ఉంచండి. అలాగే వాట్సాప్ వెబ్ వాడిన ప్రతిసారి తప్పకుండా లాగౌట్ చేయడం మర్చిపోకండి” అని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు.

సైబర్ మోసానికి గురైతే ఏం చేయాలి?

ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని సీపీ సూచించారు. లేదా http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.