|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వాట్సాప్, టెలిగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్! సిమ్ బైండింగ్ గడువు పొడిగింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

Published: 30-03-2026, 6:05 AM
వాట్సాప్, టెలిగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్! సిమ్ బైండింగ్ గడువు పొడిగింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
  • వాట్సాప్‌, టెలిగ్రామ్‌ సిమ్‌ బైండింగ్‌ గడువును కేంద్రం పొడిగించే అవకాశం.
  • టెలికమ్యూనికేషన్ల శాఖ(DoT) డిసెంబర్ చివరి వరకు గడువు పెంచే సూచనలు.
  • సాంకేతిక సమస్యల కారణంగా గడువును పొడిగించాలని టెక్ కంపెనీల విజ్ఞప్తి.
  • సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా సిమ్ బైండింగ్ నిబంధనలు.

వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వినియోగదారులకు ఒక ముఖ్యమైన అప్‌డేట్. కేంద్ర ప్రభుత్వం సిమ్ బైండింగ్ నిబంధనల అమలు గడువును పొడిగించే ఆలోచనలో ఉంది. దీనికి గల కారణాలు మరియు ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

సిమ్ బైండింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం!

వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వంటి మెసేజింగ్‌ యాప్‌ యూజర్లకు కిలక అప్ డేట్.. ఈ మెసేజింగ్‌ యాప్‌లకు సంబంధించిన సిమ్‌ బైండింగ్‌ నిబంధనల అమలు గడువును పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. టెలికమ్యూనికేషన్ల శాఖ(DoT) అధికారులు వెల్లడించిన ప్రకారం వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లకు గడువు ఇప్పుడు డిసెంబర్ చివరి వరకు పెంచే అవకాశం ఉందని ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయా టెక్ కంపెనీల అభ్యర్థన మేరకు ఈ డెడ్‍లైన్ పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సిమ్ బైండింగ్ అంటే సిమ్ లేకుండా ఆయా యాప్స్ ఫోన్ లో పనిచేయకుండా ఉండటం. సైబర్ నేరాలు అరికట్టే ఉద్దేశ్యంతో వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రాం లాంటి యాప్‌ ఆధారిత కమ్యూనికేషన్‌ సర్వీసులు తప్పనిసరిగా యాక్టివ్‌ సిమ్‌కార్డుతో లింక్‌ అయి ఉండాల్సిందేనంటూ (సిమ్‌ బైండింగ్‌) గతేడాది నవంబర్‍లో ఈ నిబంధనలను కేంద్రం తీసుకువచ్చింది. వీటి అమలుకు 90 రోజుల గడవును విధించింది. అయితే ఈ నిబంధనల అమలుకు సాంకేతికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ముఖ్యంగా టెస్టింగ్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌డేట్స్‌ వంటి విషయంలో సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటున్నామని ఆయా యాప్ సంస్థలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాయి. అమలుకు మరికొంత గడవు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

గడువు పెంపునకు కారణాలు ఏమిటి?

వినియోగదారులకు ఈ నిర్ణయం వల్ల లాభమా?

సిమ్ బైండింగ్ గడువు పెంపు నిర్ణయం టెక్ కంపెనీలకు ఊరటనిచ్చింది. అయితే, దీనిపై కేంద్రం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.