|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాశి కెరీర్‌ను నాశనం చేసిన ఆ సినిమా ఏది? సంచలన నిజాలు వెల్లడించిన నటి!

Published: 02-01-2026, 1:00 AM
రాశి కెరీర్‌ను నాశనం చేసిన ఆ సినిమా ఏది? సంచలన నిజాలు వెల్లడించిన నటి!
  • నటి రాశి చైల్డ్ ఆర్టిస్టుగా సినీ రంగ ప్రవేశం చేసి గ్లామరస్, ట్రెడిషనల్ పాత్రలతో మెప్పించారు.
  • డైరెక్టర్ తేజ ‘నిజం’ సినిమాలో తన పాత్ర గురించి చెప్పిన దానికి భిన్నంగా సీన్ చేయించారని రాశి ఆరోపణ.
  • ఆ సినిమా తన కెరీర్‌ను మొత్తం నాశనం చేసిందని, తేజను ఎప్పటికీ క్షమించలేనని రాశి పేర్కొంది.
  • రాశి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చర్చనీయాంశమయ్యాయి.

ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో అలరించిన నటి రాశి రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం సీరియల్స్‌లో నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్‌కు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించింది. ఓ సినిమా వల్ల తన కెరీర్ మొత్తం నాశనమైందని, ఆ డైరెక్టర్‌ను ఎప్పటికీ క్షమించలేనని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

రాశి సినీ ప్రస్థానం: బాలనటి నుండి స్టార్‌గా

తెలుగు సినీపరిశ్రమలో వరుస సినిమాలతో అలరించిన హీరోయిన్లలో రాశి(Rasi) ఒకరు. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ తర్వాత హీరోయిన్‌గా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అలా పవన్ కళ్యాణ్, జగపతి బాబు, శ్రీకాంత్, బాలకృష్ణ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన రాశి.. ఇటు ట్రెడిషనల్.. అటు గ్లామరస్ పాత్రలలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది.

‘నిజం’ సినిమా: తేజతో వివాదం, చేయకూడని సీన్

అయితే కొంత కాలం ఇండస్ట్రీకి దూరమైన ఈ చిన్నది ప్రజెంట్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి సీరియల్స్‌లో యాక్ట్ చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. “డైరెక్టర్ తేజ నిజం సినిమాలో నా పాత్రను పాజిటివ్‌గా చెప్పారు. తీరా సెట్‌కు వెళ్లాక మొదటిరోజే నాతో చేయకూడని సీన్ చేయించారు. అసలు ఆ సీన్ ఉంటుందనే చెప్పలేదు.

కెరీర్‌పై ప్రభావం: రాశి సంచలన వ్యాఖ్యలు

చాలా హర్టయ్యాను. సినిమా చేయనన్నాను. నాకున్న ఇమేజ్‌కు సినిమా చేశానంటే కెరీర్ ఆగిపోతుంది.. నా వల్ల కాదన్నాను. కానీ చేయాల్సిందేనన్నారు. దీంతో ఇష్టం లేకుండానే ఆ మూవీ చేశాను. డబ్బింగ్ సమయంలో తేజ కాల్ చేసి సారీ చెప్పారు. ఈ విషయంలో ఆయనను ఎప్పటికీ క్షమించలేను. ఆ సినిమా వల్ల నా కెరీర్ మొత్తం స్పాయిల్ అయింది. ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్‌ను మర్చిపోవాలనుకుంటున్నారు ? అని అడిగితే తేజ పేరు చెప్తాను. నా పుట్టినరోజే నాన్న చనిపోయారు. అది ఎప్పటికీ మర్చిపోలేని విషాదం” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారింది.

నటి రాశి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. ఒక సినిమా తన కెరీర్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపిందో ఆమె నిర్మొహమాటంగా చెప్పడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.