
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) సినిమాల్లోనే కాదు, ఆర్థికంగానూ ఎంతో ముందున్నారు. భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారులలో ఒకరిగా నిలిచిన ఆయన, 100 కోట్ల నుండి 2000 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల వరకు తన సంపదను ఎలా పెంచుకున్నారో ఈ కథనంలో తెలుసుకోండి.
Key Points
అక్షయ్ కుమార్ అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు, దేశంలోనే అత్యధిక పన్ను చెల్లింపుదారు.
జితేంద్ర 100 కోట్ల FD స్ఫూర్తితో అక్షయ్ ఆర్థిక భద్రత కోసం కృషి చేయడం మొదలుపెట్టారు.
100 కోట్ల FD నుండి 2000 కోట్ల FD వరకు తన లక్ష్యాన్ని పెంచుకున్నట్లు అక్షయ్ తెలిపారు.
అపార సంపద ఉన్నా, లైట్లు, ఫ్యాన్లు ఆపివేయడం వంటి మధ్యతరగతి అలవాట్లను వీడని అక్షయ్.
అక్షయ్ కుమార్: బాలీవుడ్ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) 1987 నుంచి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రతి సంవత్సరం అత్యధిక సినిమాలు చేస్తూ, దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా నిలిచారు. సినిమాకు 100 కోట్ల వరకూ అక్షయ్ వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
అక్షయ్ కుమార్ అత్యధిక పారితోషికం తీసుకోవడమే కాదు. చాలా ఏళ్లుగా ‘భారత్‌లో అత్యధిక పన్ను చెల్లింపుదారు’ (Highest tax payer) అనే పేరు కూడా సంపాదించారు. అంతే కాదు తను డబ్బును సంపాదించడమే కాదు, సమాజసేవలో కూడా ముందు ఉంటాడు అక్షయ్. రీసెంట్ గా తాను ఇప్పటి వరకూ డబ్బును ఎలా పెంచుకున్నారో చెప్పారు.
ఇటీవల, అక్షయ్ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శో’ (సీజన్ 3) ఫైనల్‌లో కనిపించారు. అక్కడ అతని 35 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా, ఆర్థిక భద్రతకు ఎవరు ప్రేరణ ఇచ్చారో, డబ్బు ఆస్తులు ఎలా పెంచారో వివరించారు. అక్షయ్ కుమార్ ఆర్ధికంగా ఎంత స్ట్రాంగా ఉంటాడో, అంత జాగ్రత్తగా కూడా ఉంటాడు.
ఆర్థిక భద్రతకు అక్షయ్ వ్యూహం
డబ్బు గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ “చాలా కాలం క్రితం జితేంద్ర గారు 100 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేశారని ఒక పత్రికలో చదివాను. అప్పుడు మా నాన్న దగ్గరికి పరుగెత్తుకెళ్లి, ‘నాన్న, ఎవరైనా 100 కోట్ల FD చేస్తే, ఎంత వడ్డీ వస్తుంది?’ అని అడిగాను.”
ఆ సమయంలో వడ్డీ రేటు 13% ఉండేది, అంటే నెలకు 1.3 కోట్లు. ‘నేను అలాంటి FD చేసిన రోజు, ఆర్థికంగా సురక్షితంగా ఉంటానని అప్పుడే అనుకున్నాను. దానికోసం ఇంకా ఎక్కువ కష్టపడటం మొదలుపెట్టాను’.
2000 కోట్ల FD – మధ్యతరగతి అలవాట్లు
కానీ ఎంత డబ్బు ఉన్నా మనిషికి తృప్తి ఉండదు. ఆ సంఖ్య నాకు పెరుగుతూనే ఉంది . 100 కోట్ల నుంచి 1,000 కోట్లకు, ఆ తర్వాత 2,000 కోట్లకు FD చేశాను. ఈ అత్యాశకు అంతం ఉండదని అక్షయ్ అన్నారు.
ఈ టైంలో కపిల్, మీరు ఇంకా మిడిల్ క్లాస్ ఆలోచనలు వదిలారా? లేదా? అని అడగ్గా, అక్షయ్ నవ్వుతూ, “ఈ రోజు కూడా, నా కొడుకు లేదా కూతురు ఫ్యాన్ లేదా లైట్ వేస్తే, నేను వెంటనే వెళ్లి ఆపేస్తాను. అది నా అలవాటు. నేను పిసినారిని కాదు, కానీ పెరిగిన విధానం అలాంటిది.” అన్నారు.
అక్షయ్ కుమార్ ఆర్థిక ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. 2000 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను కలిగి ఉన్నప్పటికీ, మధ్యతరగతి అలవాట్లను వీడకుండా ఉండటం ఆయన ప్రత్యేకత. ఇది కేవలం సంపదను కూడబెట్టడమే కాదు, వ్యక్తిత్వ విలువలను నిలుపుకోవడాన్ని కూడా తెలియజేస్తుంది.


