
📌 Key Points
- హనుమంతుడు కష్టాలను తొలగించి భక్తులను రక్షిస్తాడు.
- ప్రతి సంవత్సరం రెండుసార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటాము.
- చైత్ర పౌర్ణమి నాడు హనుమంతుడికి రెండవ జన్మ లభించింది.
- హనుమాన్ జయంతి నాడు సుందరకాండ పారాయణం చేయడం శ్రేయస్కరం.
హనుమాన్ జయంతి అనేది హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ రోజున హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. హనుమంతుడు శక్తి, ధైర్యం, భక్తికి ప్రతీక.
హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటాము?
హనుమాన్ జయంతి నాడు హనుమంతుని భక్తులతో ఆరాధించడం వలన హనుమంతుని అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండవచ్చు. హనుమంతుడు కష్టాలను, బాధలను, దుఃఖాలను తొలగిస్తాడు. అందుకే ఆయనను సంకట మోచనుడు అని పిలుస్తారు. హనుమంతుడు చిరంజీవి. ప్రతీ ఏటా హనుమాన్ జయంతిని ఎందుకు 2 సార్లు జరుపుకుంటాము?
రేపే హనుమాన్ జయంతి. ప్రతి ఏటా రెండు సార్లు మనం హనుమాన్ జయంతిని జరుపుకుంటాము. హనుమాన్ జయంతి నాడు హనుమంతుని భక్తులతో ఆరాధించడం వలన హనుమంతుని అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండవచ్చు. హనుమంతుడు కష్టాలను, బాధలను, దుఃఖాలను తొలగిస్తాడు. అందుకే ఆయనను సంకట మోచనుడు అని పిలుస్తారు. హనుమంతుడు చిరంజీవి.
అందుకనే కలియుగంలో భూమిపై ఇప్పటికీ నివసించే ఏకైక దేవుడు హనుమంతుడు అని భక్తులు నమ్ముతారు. హనుమాన్ జయంతి నాడు హనుమంతుడికి ప్రత్యేక పూజలు జరుపుతారు. భక్తి శ్రద్ధలతో హనుమాన్‌ను పూజిస్తారు.ఇక హనుమాన్ జయంతిని ఏడాదికి రెండుసార్లు ఎందుకు జరుపుకుంటారు? దాని వెనుక కారణం ఏంటి? అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హనుమాన్ జయంతిని ఎందుకు ఏడాదిలో రెండు సార్లు జరుపుకుంటాము?
వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుని జన్మ
మరొకటి కార్తీక మాసం కృష్ణపక్ష చతుర్దశి స్వాతి నక్షత్రంలో హనుమంతుడు జన్మించాడని వాల్మీకి రామాయణం ద్వారా తెలుస్తోంది. ఆ రోజును హనుమాన్ అవతార ఉత్సవంగా జరుపుతారు. హనుమంతుడి విజయ అభినందన మహోత్సవాన్ని చైత్ర మాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు జరుపుతాము. చైత్ర పౌర్ణమి నాడు హనుమంతుడికి రెండవ జన్మ లభించింది. అందుకని ఆ రోజున హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము.
హనుమాన్ జయంతి నాడు ఇలా చేస్తే అప్పులు, బాధలు తొలగిపోతాయి:
ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో గొడవలు, శత్రు బాధలు వంటివి తొలగిపోవాలంటే హనుమాన్ జయంతి నాడు హనుమంతుడిని భక్తితో ఆరాధించండి.
చైత్ర పౌర్ణమికి గల విశిష్టత ఏమిటి?
సుందరకాండలో లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
“ఓం హం హనుమతే నమః” అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు పఠించండి.
ఉదయం తమలపాకులను సమర్పించి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి. మధ్యాహ్నం హనుమంతుడికి గంధంతో పూజ చేసి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి. సాయంత్రం సింధూరంతో పూజించి అరటి పండ్లను నైవేద్యంగా పెట్టండి.
హనుమంతుని కరుణా కటాక్షాలతో మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆశిస్తూ, సదా ఆంజనేయ స్మరణతో శుభం కలుగుగాక.


