|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అలాంటి పాత్రలు హీరోయిన్లు ఎందుకు చేయకూడదు.. అందుకే సవాలుగా తీసుకుని చేశా: కామాక్షి భాస్కర్ల

Published: 15-11-2025, 9:16 PM
అలాంటి పాత్రలు హీరోయిన్లు ఎందుకు చేయకూడదు.. అందుకే సవాలుగా తీసుకుని చేశా: కామాక్షి భాస్కర్ల

యంగ్ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల తన కొత్త చిత్రం ’12ఏ రైల్వే కాలనీ’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్లు విభిన్నమైన పాత్రలు ఎందుకు చేయకూడదని, అందుకే సవాలుగా తీసుకుని ఈ పాత్ర చేశానని వెల్లడించింది. ఈ చిత్రం నవంబర్ 21న విడుదల కానుంది.

Key Points

1

కామాక్షి భాస్కర్ల '12ఏ రైల్వే కాలనీ' ప్రమోషన్స్‌లో పాల్గొంది.

2

తన 'ఆరాధన' పాత్ర కథకు అత్యంత కీలకమని వెల్లడించింది.

4

'డెకాయిట్', 'పొలిమేర 3'తో పాటు ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో భాగం.

’12ఏ రైల్వే కాలనీ’లో కామాక్షి పాత్ర

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఊహించని క్రేజ్‌ను రాబట్టుకుంది. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, రౌడీ బాయ్స్, వీరూపాక్ష వంటి హిట్ చిత్రాల్లో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుని వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం కామాక్షి ‘12ఏ రైల్వే కాలనీ’(12A Railway Colony) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను నాని కాసరగడ్డ తెరకెక్కించగా.. అల్లరి నరేష్ (Allari Naresh)హీరోగా నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నవంబర్ 21న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ప్రమోషన్స్‌లో పాల్గొన్న కామాక్షి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

‘‘నేను ఇందేలో నరేష్‌కు జోడీగా ఆరాధన పాత్రలో నటించాను. ఈ పాత్ర లేకపోతే ఈ కథే లేదు. ఈ సినిమా చూశాక మీ అందరికీ నా పాత్ర గుర్తుండిపోతుంది. విజయ్ సేతుపతి, శ్రీవిష్ణు, సుహాస్.. ఇలా చాలామంది హీరోలు అన్ని రకాల పాత్రలు చేసుకుంటూ వచ్చారు. హీరోయిన్లు అలా ఎందుకు చేయకూడదని ఓ సవాల్‌గా తీసుకుని ఈ పాత్ర చేశాను. ఇకనుంచి అయినా విభిన్న రకాల పాత్రలో పోషించే ప్రయత్నం చేస్తున్నాను. అలా ఈ ఐదేళ్ల నా ప్రయాణంలో చేసిన విరూపాక్ష, పొలిమేర మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ‘డెకాయిట్’ చేస్తు్న్నాను. అలాగే ఓ పెద్ద ప్రాజెక్ట్‌లోనూ భాగం అయ్యాను. త్వరలోనే వివరాలను అధికారికంగా వెల్లడిస్తా. వీటితో పాటు ‘పొలిమేర-3’ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది.

హీరోయిన్ల పాత్రలపై కామాక్షి ఆసక్తికర వ్యాఖ్యలు

కామాక్షి భాస్కర్ల భవిష్యత్ ప్రాజెక్ట్‌లు

కామాక్షి భాస్కర్ల విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాలని చూస్తోంది. ‘పొలిమేర’ సిరీస్‌తో పాటు మరిన్ని పెద్ద ప్రాజెక్ట్‌లతో ఆమె భవిష్యత్ ప్రయాణం ఆసక్తికరంగా మారనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.