|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘రజనీకాంత్‌ కంటే విజయ్‌ ఎందులో గొప్ప’

Published: 16-06-2025, 11:15 PM
'రజనీకాంత్‌ కంటే విజయ్‌ ఎందులో గొప్ప'

నటుడు విజయ్ రాజకీయాలలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 2026 ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే, ఆయన సినిమా నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎలా ఉంటారనే చర్చ జరుగుతోంది. ఈ కథనం విజయ్ రాజకీయ ప్రయాణం గురించి వివరిస్తుంది.

Key Points

1

విజయ్ రాజకీయ ప్రవేశంపై చర్చ జోరు

2

2026 ఎన్నికల్లో విజయ్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అభిమానుల నమ్మకం

4

రజనీకాంత్, విజయకాంత్ లతో విజయ్ పోలికలు

విజయ్ రాజకీయ ప్రవేశం

నటుడు విజయ్‌ రాజకీయ పార్టీని నెలకొల్పి 2026లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈనెల 22న విజయ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇప్పటి నుంచే ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏర్పాట్లు  చేస్తున్నారు. ఈవేడుకలో  పార్టీ జిల్లా కార్యదర్శి  ఏ.అప్పు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 2026లో విజయ్‌ ముఖ్యమంత్రి కావడం తథ్యం అన్నారు. తమిళగ వెట్రి కళగం పార్టీకి తమిళ ప్రజలు ఓట్లు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. 365రోజులు తమ తలైవన్‌ పుట్టినరోజును వేడుకను జరుపుకునే ఒకే ఒక్క పార్టీ తమిళగ వెట్రి కళగం అని ఆయన అన్నారు.

రజనీకాంత్‌ కంటే విజయ్‌ ఎందులో గొప్ప: వేల్‌మురుగన్‌ ఇదిలా ఉంటే తమిళ వాళ్‌ ఉరిమై పార్టీకి చెందిన వేల్‌మురుగన్‌ విజయ్‌పై విమర్శల దాడి చేశారు. ఒక వేడుకలో ఆయన మాట్లాడుతూ కరుణానిది పాలనలో పోరాడి, వాదాడి రాష్ట్రంలో 36 మెడికల్‌ కళాశాలను తీసుకొచ్చింది తానేనన్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన నటులు తమిళ సమాజానికి చేసిందేమిటని ప్రశ్నించారు. ఒక నటుడు (విజయ్‌) 10,12వ తరగతి విద్యార్థులను అభినందించడానికి మాత్రమే సమావేశాలు నిర్వహిస్తున్నారని కౌంటర్‌ ఇచ్చారు.  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విజయకాంత్‌ల కంటే విజయ్‌ ఏమైనా గొప్పా అంటూ ఫైర్‌ అయ్యారు. చిన్న నటుడు బాలా కూడా తాను స్వయంగా సంపాదించిన డబ్బును పేదలకు సాయం చేస్తున్నారని, రాఘవ లార్సెన్‌ తాను సంపాదించిన మొత్తంలో వృద్ధులు, వికలాంగుల కోసం ఆశ్రమాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈయన మాత్రం సమావేశాలు మాత్రమే నిర్వహిస్తున్నారని ధ్వజం మెత్తారు.

అభిమానుల ఆశలు మరియు నమ్మకాలు

విమర్శలు మరియు ప్రతిస్పందనలు

విజయ్ రాజకీయ ప్రవేశం తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని తెరుస్తుందని భావిస్తున్నారు. ఆయన రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.