|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆపిల్ WWDC 2026: iOS 27, AI సిరితో భవిష్యత్తు ఇక్కడే! లైవ్ చూడండి!

Published: 08-06-2026, 6:15 AM
ఆపిల్ WWDC 2026: iOS 27, AI సిరితో భవిష్యత్తు ఇక్కడే! లైవ్ చూడండి!
  • WWDC 2026 జూన్ 8న ప్రారంభమై జూన్ 12 వరకు 4 రోజుల పాటు జరుగుతుంది.
  • ఈ ఈవెంట్‌లో iOS 27, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఆవిష్కరిస్తారు.
  • iOS 27లో AI ఆధారిత సిరి, కెమెరా మోడ్‌లు, ఆన్-డివైస్ ఫోటో ఎడిటింగ్ ఉంటాయి.
  • ఆపిల్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు లైవ్ చూడవచ్చు.

ఆపిల్ వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్ WWDC 2026 జూన్ 8న ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్‌లో ఆపిల్ iOS 27, iPadOS 27లను ఆవిష్కరించనుంది. AI సిరి, కొత్త కెమెరా ఫీచర్లు, ఆన్-డివైస్ AI ఎడిటింగ్‌తో యూజర్లకు అద్భుతమైన అనుభూతిని అందించనుంది.

WWDC 2026: ఆపిల్ ఈవెంట్ టైమింగ్స్

WWDC 2026 : ఆపిల్ లవర్స్ మీకోసమే.. అమెరికన్ టెక్ దిగ్గజం ఆపిల్ వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) ఈవెంట్ జూన్ 8, 2026న జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌లో కంపెనీ రాబోయే ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించనుంది.

ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, వాచ్ ఎక్స్ఆర్ డివైజ్‌ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్‌లను ప్రదర్శించనుంది. ప్రపంచవ్యాప్తంగా యాప్ డెవలపర్లు ఈ ఈవెంట్‌లో పాల్గొని ఆపిల్ రాబోయే ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్టింగ్ యాప్‌లను డిజైన్ చేస్తారు అనమాట.

ఈ ఆపిల్ ఈవెంట్ చిన్నదే.. సెప్టెంబర్‌లో జరిగే ఆపిల్ ఈవెంట్ లాంటిది కాదు. ఎందుకంటే.. కంపెనీ ఇందులో ఎలాంటి ప్రొడక్టులను లాంచ్ చేయదు. ప్రధానంగా కంపెనీ ప్రొడక్టులు, ఆపరేటింగ్ సిస్టమ్‌లు సాఫ్ట్‌వేర్‌లను ప్రదర్శిస్తుంది.

అలాగే, రాబోయే ఆపిల్ డివైజ్‌ల కోసం యూజర్ ఇంటర్‌ఫేస్ సపోర్ట్ గురించి వివరాలను అందిస్తుంది. పాత ఆపిల్ డివైజ్‌లలో ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ ముగియనుందని కూడా కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది.

ఆపిల్ ఈవెంట్ టైమ్ ఎప్పుడంటే? : ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) కీనోట్ జూన్ 8న భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కాన్ఫరెన్స్ జూన్ 12వ తేదీ వరకు మొత్తం 4 రోజుల పాటు జరుగుతుంది.

iOS 27లో కొత్తగా రాబోయే ఫీచర్లు

దాంతో వరల్డ్ వైడ్ డెవలపర్లు ఆపిల్ ఎకోసిస్టమ్‌ను ఈజీగా యాక్సస్ చేయొచ్చు. ఈ ఈవెంట్‌లో ప్రధానంగా ఐఫోన్ల కోసం iOS 27 అప్ డేట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఐప్యాడ్‌ల కోసం iPadOS 27 కూడా ఉండనుంది.

iOS 27 ఫీచర్లు ఇవే : లీక్ డేటా ప్రకారం.. రాబోయే ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS 27 అప్‌డేట్.. iOS 26తో పోలిస్తే అదిరిపోయే అప్‌గ్రేడ్‌లతో వస్తుందని అంచనా. ఐఫోన్ యూజర్లు కొన్ని ఆండ్రాయిడ్ ఫీచర్లు కూడా పొందవచ్చు.

కెమెరా యాప్‌లో స్పెషల్ సిరి-ఆధారిత మోడ్ కూడా ఉండనుంది. ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీలో యూజర్లకు అద్భుతంగా ఉంటుంది. ఐఫోన్ యూజర్లకు గతంలో కన్నా ఎక్కువ కస్టమైజేషన్ ఆప్షన్లు ఉంటాయని అంచనా.

Read Also : TVS Ntorq 150 : ఇది స్కూటర్ కాదు.. స్పీడ్ రాకెట్! టీవీఎస్ NTORQ 150 ఫీచర్లు అదుర్స్.. 6.3 సెకన్లలో 60కి.మీ రేంజ్!

AI సిరి, ఫోటోస్ యాప్ అప్‌గ్రేడ్‌లు

ఏఐ ఫీచర్ల విషయానికి వస్తే.. ఫొటోస్ యాప్ కూడా భారీ అప్‌గ్రేడ్‌ అందుకోనుంది. వినియోగదారులు తమ ఐఫోన్‌తో తీసిన ఫొటోలను ఆన్-డివైస్ ఏఐతో ఎడిట్ చేయొచ్చు. iOS 27, MacOSX స్నో లెపర్డ్‌ మాదిరి యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది. గత ఆపరేటింగ్ సిస్టమ్‌లోని అనేక బగ్స్‌ను కూడా ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది.

ఈ ఐఫోన్‌లకు iOS 27 అప్‌డేట్ : ప్రస్తుతం ఆపిల్ కంపెనీ iOS 27 రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది. వచ్చే సెప్టెంబర్‌లో జరగబోయే ఆపిల్ ఈవెంట్‌లో అధికారికంగా లాంచ్ చేయనుంది. రాబోయే ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు, ఐఫోన్ 17, ఐఫోన్ 16, ఐఫోన్ 15, ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12 సిరీస్‌ వాడే యూజర్లకు కూడా iOS 27 అప్‌డేట్‌ రానుంది.

ఆపిల్ కీనోట్ టైమ్, లైవ్‌స్ట్రీమ్‌ ఎలా చూడాలి? : కాలిఫోర్నియాలో క్యూపెర్టినో ఆపిల్ పార్క్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో జూన్ 8 నుంచి జూన్ 12 వరకు డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026 ఈవెంట్ జరగనుంది. ఈరోజు రాత్రి 10:30 గంటలకు ఎంపిక చేసిన డెవలపర్‌ల కోసం సీఈఓ టిమ్ కుక్ ఇచ్చే డైరెక్ట్ కీనోట్‌తో వస్తుంది.

ఈ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌ను ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఆపిల్ టీవీ 4K, విండోస్ పీసీలు, స్మార్ట్ టీవీలు, ఇతర డివైజ్‌లతో ఆపిల్ టీవీ యాప్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. ఈ ఈవెంట్ ఆపిల్ డెవలపర్ యాప్, ఆపిల్ డెవలపర్ వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.

మొత్తం మీద, WWDC 2026 ఆపిల్ సాఫ్ట్‌వేర్ భవిష్యత్తును ఆవిష్కరించనుంది. iOS 27, AI సామర్థ్యాలతో యూజర్లకు కొత్త అనుభూతిని అందిస్తూ, టెక్ ప్రపంచంలో ఆపిల్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.