|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

X వీడియో లింక్స్ మాయ: యూజర్లలో దడ పుట్టిస్తున్న వైరల్ వార్త! అసలు నిజం ఏంటి?

Published: 02-04-2026, 11:35 AM
X వీడియో లింక్స్ మాయ: యూజర్లలో దడ పుట్టిస్తున్న వైరల్ వార్త! అసలు నిజం ఏంటి?
  • ఏప్రిల్ 1న ఎక్స్ వీడియో లింక్ కాపీ ఫీచర్ తొలగింపు వార్త వైరల్.
  • కొందరు యూజర్లు లింక్ షేర్ చేయలేకపోతున్నామని ఫిర్యాదు చేశారు.
  • ఇది ఎంగేజ్‌మెంట్ కోసం చేసిన ఫేక్ న్యూస్ అని కొందరు కొట్టిపారేశారు.
  • చాలామంది యూజర్లకు ఫీచర్ సక్రమంగా పనిచేస్తోందని రిపోర్ట్ చేశారు.

ఎక్స్(X)లో వీడియో లింక్స్ కాపీ చేయడం కుదరడం లేదనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనితో యూజర్లలో ఒకటే టెన్షన్ మొదలైంది. అసలు ఆ వార్తలో నిజం ఎంత ఉందో తెలుసుకుందాం.

వైరల్ అవుతున్న వీడియో లింక్స్ వార్త

X Copy Video Links : ఎలన్ మస్క్ కంపెనీ కాపీ వీడియోలను లింక్ చేయడం లేదు.. ఎక్స్ వేదికగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీన అసలేం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

X Copy Video Links : ఏప్రిల్ ఒకటో తేదీ.. ఎక్స్ వేదికగా యూజర్లలో ఒక వార్త ఆందోళన రేకిత్తించింది. ఎక్స్ వీడియో లింకులను కాపీ చేయకుండా ఫీచర్ డిలీట్ చేసిందంటూ ఆ వార్త సంచలనం రేకిత్తించింది.

కొన్ని గంటల వ్యవధిలోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వేగంగా వైరల్ అయింది. వైరల్ అయిన పోస్టులను చూసి నిజంగానే కంపెనీ ఇలా ఎందుకు చేసిందో తెలియక వినియోగదారులు ఆశ్చర్యపోయారు. అయితే, ఆ తర్వాత అసలు నిజం తెలియడంతో ఎక్స్ యూజర్లంతా ఊపిరిపీల్చుకున్నారు.

అసలేం జరిగిందంటే? : ఏప్రిల్ 1వ తేదీన ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కలకలం రేగింది. ఎక్స్ వేదికగా వీడియో లింక్‌లను కాపీ చేయలేకపోతున్నామని చాలా మంది యూజర్లు పేర్కొన్నారు. ఇంతలో, ఒక కొత్త అప్‌డేట్‌లో భాగంగా ఎక్స్ లింక్‌లను కాపీ లేదా షేర్ చేసే ఫీచర్‌ను తొలగించిందని పేర్కొంటూ పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ పోస్టులు వేగంగా వైరల్ అయ్యాయి.

ఈ పోస్టులకు లక్షలాది వ్యూస్ : ఎక్స్ ప్లాట్ ఫారంలో వీడియో లింకులు కాపీ కావడం లేదంటూ వచ్చిన సమాచారం వేగంగా వైరల్ అయింది. కొంతమంది ఆ వీడియోను డైరెక్ట్ లింక్ ద్వారా షేర్ చేయలేకపోతున్నామని చాలామంది ఫిర్యాదు చేశారు.

Read Also : Redmi Note 15 SE : కొంటే రెడ్‌మి ఫోన్ కొనాలి.. ఈ స్పెషల్ ఎడిషన్ కిర్రాక్ బ్రో.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!

యూజర్ల ఆందోళనలు, ఫిర్యాదులు

పొలిటికల్ వీడియోల లింకుల వంటి ఇతర వీడియో కంటెంట్‌ను షేర్ అవ్వడం లేదనే ఆందోళనలు తలెత్తాయి. కొన్ని గంటల్లోనే ఈ తరహా వైరల్ న్యూస్ బాగా వైరల్ అయింది. పోస్టులకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

You can still copy the link of any video on X!!

All the other accounts are just doing engagement farming!

— ARS (@Papaji200) April 2, 2026

వైరల్ పోస్టులతో మరింత ఆందోళన : కొన్ని అకౌంట్లలో ఈ వాదన అందరిని ఆందోళనకు గురిచేసింది. మస్క్ కంపెనీ ఈ కొత్త నియమాన్ని అమలు చేసిందని యూజర్లు నమ్మేలా మీమ్స్, పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే, ఈ వైరల్ వార్తలో అసలు వాస్తవం వెంటనే బయటపడింది. చాలా మంది వినియోగదారులు తమ ఫోన్‌లు, కంప్యూటర్‌లలో ఆ ఫీచర్ ఎలాంటి సమస్య లేకుండా పనిచేస్తోందని రిపోర్టు చేశారు.

అసలు నిజం ఏమిటి?

ఆ తర్వాత, “యూఎస్ఏ న్యూస్” అనే అకౌంట్ ఈ న్యూస్ మొత్తం కేవలం ఒక ఏప్రిల్ ఫూల్స్ జోక్ అంటూ అంగీకరించింది. కేవలం ఎంగేజ్‌మెంట్‌ను పెంచడమే తప్ప మరొకటి లేదు. కొంతమంది యూజర్లు ఇది ఒక “రీబేస్” పోస్ట్ అని ఎక్స్ ఇలాంటి మార్పులేవీ చేయలేదని స్పష్టంగా పేర్కొన్నారు.

You can no longer copy the link of a video anymore on X pic.twitter.com/gfxCbYsBdr

— sachin. (@sachinyadav699) April 2, 2026

ఆ ఫీచర్ ఇప్పటికీ వర్క్ అవుతోంది : అసలు వాస్తవం ఏమిటంటే.. ఎక్స్ ప్లాట్‌ఫారంలో వీడియో లింక్‌లను కాపీ చేసే ఫీచర్ గతంలో మాదిరిగానే పనిచేస్తోంది. మొబైల్ యాప్‌లో షేర్ ఐకాన్‌ను ట్యాప్ చేస్తే.. ‘కాపీ లింక్’ ఆప్షన్ ఇప్పటికీ కనిపిస్తోంది. వెబ్ బ్రౌజర్‌లో ‘కాపీ వీడియో అడ్రస్’ ఆప్షన్ కూడా వర్క్ అవుతోంది.

ఎక్స్‌లో వీడియో లింక్‌లను ఎలా కాపీ చేయాలి? :

ఏది ఏమైనా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను నమ్మే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవడం చాలా అవసరం. లేకపోతే తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.