
📌 Key Points
- షావోమీ 17 మ్యాక్స్ 200MP ట్రిపుల్ కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో చైనాలో లాంచ్.
- 16GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ కలిగి ఉంది.
- 6.9-అంగుళాల 1.5K AMOLED 120Hz డిస్‌ప్లే, IP68 రేటింగ్‌తో రక్షణ అందిస్తుంది.
- చైనాలో ధర సుమారు రూ. 68,000 నుండి ప్రారంభం, మే 25 నుండి అమ్మకాలు మొదలవుతాయి.
షావోమీ 17 మ్యాక్స్ చైనా మార్కెట్లో విడుదలైంది. 200MP ట్రిపుల్ కెమెరా, భారీ 8000mAh బ్యాటరీ, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ టెక్ ప్రియులను ఆకట్టుకుంటోంది. దీని ధర, ఇతర అద్భుతమైన ఫీచర్లను ఇప్పుడు తెలుసుకుందాం.
షావోమీ 17 మ్యాక్స్: ధర, లభ్యత
Xiaomi 17 Max Launch : కొత్త షావోమీ ఫోన్ వచ్చేసింది. షావోమీ 17 మ్యాక్స్ చైనా మార్కెట్లో లాంచ్ అయింది. ఈ కొత్త ఫోన్ షావోమీ 17 సిరీస్‌లో చివరి ఫోన్. షావోమీ 17 సిరీస్ ఫోన్‌లలో అతిపెద్ద 8000mAh బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్‌లో 200MP మెయిన్ కెమెరా ఉంది. 16GB వరకు ర్యామ్‌తో వస్తుంది. 512GB వరకు స్టోరేజ్‌ను అందిస్తుంది. ధర, ఇతర ముఖ్య ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
షావోమీ 17 మ్యాక్స్ ధర, లభ్యత : కంపెనీ దేశీయ మార్కెట్లో షావోమీ 17 మ్యాక్స్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. చైనాలో ఈ ఫోన్ ధర 4,799 యువాన్లు (సుమారుగా రూ. 68వేలు). ఈ ఫోన్ టాప్ వేరియంట్ 16GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో వస్తుంది.
ధర 5,799 యువాన్లు (సుమారుగా రూ. 82వేలు) ఉంటుంది. ఈ ఫోన్ చైనాలో ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. ఈ ఫనో్ సేల్స్ మే 25న ప్రారంభమవుతాయి. ఈ షావోమీ ఫోన్ పిక్సెల్ బ్లాక్, స్కై బ్లూ, వైట్ కలర్ ఆప్షన్లలో పొందవచ్చు.
అద్భుతమైన కెమెరా, బ్యాటరీ ఫీచర్లు
షావోమీ 17 మ్యాక్స్ స్పెసిఫికేషన్లు : షావోమీ 17 మ్యాక్స్ 6.9-అంగుళాల 1.5K డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ సపోర్టు ఇస్తుంది. టచ్ శాంప్లింగ్ రేట్ 300Hz, 100శాతం డీసీఐ-పీ3 కలర్ గామట్‌కు సపోర్టు ఇస్తుంది. షావోమీ ఫోన్ స్క్రీన్ డ్రాగన్ క్రిస్టల్ 3.0 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16, HyperOS 3తో వస్తుంది.
Read Also : Motorola Razr 60 Ultra : ఖతర్నాక్ డీల్ మావా.. ఈ మోటోరోలా ఫ్లిప్ ఫోన్‌పై రూ. 30వేలు డిస్కౌంట్.. ఈ క్రేజీ ఆఫర్ మళ్లీ రాదు!
ఈ ఫోన్ 3nm ప్రాసెసింగ్‌పై స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ, ఏఐ ఫీచర్ల కోసం క్వాల్‌కామ్ ఏఐ ఇంజిన్ ఉన్నాయి. కంపెనీ 16GB వరకు ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. సేప్టీ కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది.
ప్రాసెసర్, డిస్‌ప్లే వివరాలు
షావోమీ 17 మ్యాక్స్‌లో ఎఫ్/1.65 అపర్చర్‌తో శాంసంగ్ HP9 సెన్సార్ ద్వారా 200MP మెయిన్ కెమెరా ఉంది. ఎఫ్/2.4 అపర్చర్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంది. 3x వరకు ఆప్టికల్ జూమ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్‌లో ఎఫ్/2.4 అపర్చర్‌తో 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. 102-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 32MP సెల్ఫీ కెమెరా ఉంది.
షావోమీ 17 మ్యాక్స్‌లో 8000mAh బ్యాటరీ ఉంది. 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, USB టైప్-C ఉన్నాయి. ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది. ఈ ఫోన్ కొలతలు 162.9×77.6×8.2mm, బరువు 225 గ్రాములు ఉంటుంది.
షావోమీ 17 మ్యాక్స్ దాని అద్భుతమైన స్పెసిఫికేషన్లు, శక్తివంతమైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఒక సంచలనం సృష్టించడం ఖాయం. అధిక పనితీరు, అద్భుతమైన కెమెరా, దీర్ఘకాలిక బ్యాటరీ కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక.


