
📌 Key Points
- షావోమీ 18 బేస్ మోడల్‌లో 7,200mAh బ్యాటరీ, 2K రిజల్యూషన్‌తో 6.4-అంగుళాల డిస్‌ప్లే ఉండవచ్చు.
- బేస్ మోడల్‌లో 200MP ప్రైమరీ కెమెరా, ప్రో మోడల్‌లో డ్యూయల్ 200MP కెమెరాలు ఉండనున్నాయి.
- షావోమీ 18 ప్రో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్‌సెట్, 100W వైర్డ్/వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
- ప్రైవసీ ప్రొటెక్షన్ ఫీచర్‌తో రానున్న షావోమీ 18 ప్రో ముందుగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
షావోమీ నుంచి రాబోయే సరికొత్త షావోమీ 18 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు లీక్ అయ్యాయి. బేస్ మోడల్‌లో భారీ 7,200mAh బ్యాటరీ, 200MP కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్లు ఉండనున్నాయి. ఈ సిరీస్ టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించడం ఖాయం.
డిస్‌ప్లే, బ్యాటరీ వివరాలు
Xiaomi 18 Leak : షావోమీ నుంచి అద్భుతమైన ఫోన్ రాబోతుంది. అతి త్వరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్ చేయనుంది. షావోమీ 18 సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు లీక్ అయ్యాయి. ఈ సిరీస్‌లోని బేస్ మోడల్‌లో 2K రిజల్యూషన్‌తో 6.4-అంగుళాల డిస్‌ప్లే ఉంటుందని అంచనా. షావోమీ 17 సిరీస్ గత ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయింది. అయితే, రాబోయే స్మార్ట్‌ఫోన్ సిరీస్ బేస్ మోడల్ ఇంజనీరింగ్ ప్రోటోటైప్‌లో 7,200mAh బ్యాటరీ ఉందని వెల్లడించారు.
అదే షావోమీ 17లో పరిశీలిస్తే 7,000mAh బ్యాటరీ ఉంటుంది. కానీ, షావోమీ 18 కాంపాక్ట్ డిజైన్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 2K రిజల్యూషన్‌తో 6.4-అంగుళాల డిస్‌ప్లే ఉంటుందని అంచనా. నాలుగు వైపులా సన్నని బెజెల్స్, రౌండెడ్ కార్నర్స్, డిస్‌ప్లే 19.5:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుందని అంచనా.
కెమెరా స్పెసిఫికేషన్లు
కెమెరా స్పెషిఫికేషన్లు, ఫీచర్లు : షావోమీ 18లో సింగిల్ మెయిన్ అప్‌గ్రేడ్ కెమెరా సిస్టమ్‌లో ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ రియర్ కెమెరా యూనిట్‌లో 200MP ప్రైమరీ కెమెరా ఉంటుందని అంచనా. రాబోయే స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో స్టాండర్డ్ మోడల్‌తో పాటు షావోమీ 18 ప్రో, షావోమీ 18 ప్రో మ్యాక్స్ కూడా ఉండవచ్చు. ఈ సిరీస్‌లో షావోమీ 18 ప్రో కొన్ని అప్‌గ్రేడ్‌లతో రానుంది.
Read Also : Tata Sierra EV Launch : టాటా లవర్స్ గెట్ రెడీ.. కొత్త సియెర్రా EV వచ్చేస్తోంది.. ఫుల్ ఛార్జ్‌పై 600కి.మీ రేంజ్.. ధర ఎంత ఉండొచ్చంటే?
ప్రాసెసర్, ఛార్జింగ్ ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 సిరీస్ చిప్‌సెట్ ఉండవచ్చు. షావోమీ 18 ప్రోలో 100W వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో హై కెపాసిటీ బ్యాటరీ ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ 200MP రియర్ కెమెరా సిస్టమ్ ఉండవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా మాదిరిగానే షావోమీ 18 ప్రోలో కూడా ప్రైవసీ ప్రొటెక్షన్ ఉండవచ్చు. ప్రైవసీ ప్రొటెక్షన్ కారణంగా దగ్గరలో ఉన్న వ్యక్తులు మొబైల్ స్క్రీన్‌పై ఉన్న డేటాను చూడలేరు.
రాబోయే స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లోని స్టాండర్డ్, ప్రో మోడళ్లను ఒకేసారి కాకుండా షావోమీ 18 ప్రోను ఫస్ట్ లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. షావోమీ 17 ప్రోలో 6.3-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ రియర్ ప్యానెల్‌లో 3,500 నిట్స్ టాప్ బ్రైట్ నెస్ లెవల్ M10 సెకండరీ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.
మొత్తం మీద, షావోమీ 18 సిరీస్ శక్తివంతమైన బ్యాటరీ, అద్భుతమైన కెమెరా, అత్యాధునిక ప్రాసెసర్‌తో మార్కెట్‌లోకి రానుంది. ఈ లీక్‌లు టెక్ ప్రియులలో భారీ అంచనాలను పెంచుతున్నాయి. అధికారిక లాంచ్ కోసం వేచి చూద్దాం.


