|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ లీక్! షావోమీ 18 ప్రో డిజైన్ చూస్తే దిమ్మతిరగాల్సిందే! AI బటన్ తో అదుర్స్ ఫీచర్లు!

Published: 16-04-2026, 11:15 AM
షాకింగ్ లీక్! షావోమీ 18 ప్రో డిజైన్ చూస్తే దిమ్మతిరగాల్సిందే! AI బటన్ తో అదుర్స్ ఫీచర్లు!
  • షావోమీ 18 ప్రోలో కొత్త ఫిజికల్ AI బటన్ ఉండనుంది.
  • ఈ ఫోన్ 7000mAh బ్యాటరీతో వస్తుందని అంచనా.
  • 200MP టెలిఫోటో కెమెరా, 200MP మాక్రో కెమెరా ఉండవచ్చు.
  • 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

షావోమీ 18 ప్రో యొక్క డిజైన్ మరియు ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ ఫోన్లో సరికొత్త AI బటన్ మరియు శక్తివంతమైన కెమెరా ఫీచర్లు ఉండబోతున్నాయని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

షావోమీ 18 ప్రో ఫీచర్లు (అంచనా)

Xiaomi 18 Pro Leak : షావోమీ నుంచి ఖతర్నాక్ ఫోన్ రాబోతుంది. లాంచ్ కు ముందుగానే కీలక ఫీచర్లు, ఫొటోలు లీక్ అయ్యాయి. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవండి..

Xiaomi 18 Pro Leak : షావోమీ అభిమానులకు పండగే.. అతి త్వరలో కొత్త షావోమీ 18 ప్రో వచ్చేస్తోంది. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు భారీ డిజైన్ మార్పుతో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఇటీవల ఆన్‌లైన్‌లో లీక్ అయిన ఫోటోలలో వెల్లడైంది. రాబోయే ఫోన్ లెఫ్ట్ సైడ్ కొత్త ఫిజికల్ బటన్ ఉన్నట్లు కనిపిస్తోంది. షావోమీ 18 ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్ల అంచనా వివరాలపై ఓసారి లుక్కేయండి.

షావోమీ 18 ప్రో ఫీచర్లు (అంచనా) : నివేదికల ప్రకారం.. షావోమీ 18 ప్రో ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్ ప్యానెల్ కనిపించనప్పటికీ, ఇతర డిజైన్ వివరాలు కనిపించాయి. ఈ ఫొటోల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త ఫిజికల్ బటన్ ఉండొచ్చు. అది ఫోన్‌కు రైట్ సైడ్ ఉండవచ్చని తెలుస్తోంది. ఆ బటన్‌పై ఏఐ లోగో ఉన్నట్లు కనిపిస్తోంది.

కొత్త ఏఐ బటన్ ప్రత్యేకతలు

Read Also : Samsung Galaxy Z Flip 4 : వారెవ్వా.. కిర్రాక్ ఆఫర్.. ఈ శాంసంగ్ ఫ్లిప్ ఫోన్‌పై ఏకంగా రూ. 56,000 డిస్కౌంట్.. ఇంత తక్కువలో మళ్లీ రాదు!

ఈ కొత్త స్పెషల్ ఏఐ బటన్‌, వివిధ రకాల ఏఐ టాస్కులకు బెస్ట్ ఆప్షన్. షావోవీ 18 ప్రోలో ఈ కొత్త ఫిజికల్ బటన్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు, స్మార్ట్ హోమ్ ఫంక్షనాలిటీల కోసం వన్-ట్యాప్ కంట్రోల్‌ను అందిస్తుంది. అదనంగా, వినియోగదారులు ‘Xiaomi MicroCall’తో సహా ఇతర ఏఐ ఆధారిత ఫీచర్లు కూడా సింగిల్ క్లిక్‌తో యాక్సెస్ చేయొచ్చు.

బ్యాటరీ మరియు కెమెరా అంచనాలు

ఈ రెండర్ ప్రకారం.. ఈ ఫోన్‌లో 2 కెమెరా లెన్స్‌లతో రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. గత మోడల్ మాదిరిగా ఒక సెకండరీ డిస్‌ప్లే ఉంటుందని అంచనా. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నల్ పార్టులను కూడా రివీల్ చేసింది. ఈ ఫోన్ డిజైన్ గత ఏడాది లాంచ్ అయిన షావోమీ 17 ప్రో మాదిరిగా ఉన్నట్లు కనిపిస్తోంది.

రిపోర్టు ప్రకారం.. షావోమీ 18 ప్రో ఈ ఏడాది చివరిలో 7000mAh లేదా అంతకంటే భారీ బ్యాటరీతో లాంచ్ కావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుందని అంచనా. షావోమీ 18 ప్రో బ్యాక్ సైడ్ 200MP టెలిఫోటో కెమెరా, 200MP మాక్రో కెమెరా ఉంటాయి. అయితే, కంపెనీ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

షావోమీ 18 ప్రో లీక్ ప్రకారం అంచనాలు భారీగా ఉన్నాయి. AI బటన్, పవర్ఫుల్ కెమెరా, బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ మార్కెట్లో ఒక సంచలనం సృష్టించే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.